News


ఏజీఆర్‌ చెల్లింపుల ఎఫెక్ట్‌: మూసివేత దిశగా మరో కంపెనీ ..!

Monday 24th February 2020
news_main1582530071.png-32043

టెలికం రంగంలో నెలకొన్న సంక్షోభంతో మరో సంస్థ మూసివేతకు దారితీసింది. బ్రాడ్‌బాండ్‌ సేవల అందించే అమెరికా ఆధారిత సం‍స్థ హ్యూస్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్స్‌ ఇండియాలో తన సేవలను పూర్తిగా నిలిపివేసేందుకు సిద్దమైంది. కేంద్రానికి చెల్లించాల్సి భారీ సుంకాల కారణంగా భారత్‌ తన కార్యకలాపాలను మూసివేయాల్సి ఉంటుందని, ఈ పరిణామం వేలాది బ్యాంకింగ్ సేవలను ప్రశ్నార్థం చేస్తుందని కంపెనీ టెలికాం శాఖను లేఖ రాసినట్లు ప్రముఖ వార్త సంస్థ రాయిటర్స్‌ ప్రచురించింది. 

హ్యూస్‌ నెట్‌వర్క్స్‌ దేశంలో రక్షణ, విద్య, బ్యాంకింగ్‌ రంగాల్లో సేవలు అందిస్తోంది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగంలో విస్తృతంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా 30కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు కమ్యూనికేషన్ సేవలను అందిస్తుంది

గత ఏడాది చివరలో సుప్రీంకోర్టు వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌, హ్యూస్ నెట్‌వర్క్‌ సిస్టమ్స్‌ వంటి పెద్ద సంస్థలతో సహా పలు టెలికం కంపెనీలను ప్రభుత్వానికి చెల్లించాల్సిన బిలియన్ డాలర్లను కచ్చితంగా చెల్లించాల్సిందేనని ఆదేశించిన సంగతి తెలిసిందే. 

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తీర్పు ప్రకారం రూ.600కోట్లను చెల్లించలేమని ఫిబ్రవరి 20న టెలికాం మంత్రిత్వ శాఖకు హ్యూస్ ఇండియా అధ్యక్షుడు పార్థో బెనర్జీ రాశారు. పదేళ్ల కిందట ప్రభుత్వ టెలికాం విభాగం బకాయిలను తప్పుగా లెక్కించిందని, ఇది వడ్డీ జరిమానాతో కలిసి ఇప్పుడు ఈ మొత్తం రూ.600 కోట్లకు పెరిగింది. ఇంత పెద్ద మొత్తంలో తమ కంపెనీ చెల్లించే స్థితిలో లేదని ఆయన స్పష్టం చేశారు. సంస్థ మూసివేయడంతో 70వేల కంటే ఎక్కువ బ్యాంకింగ్ లొకషన్లు, భారత నావికాదళం, సైన్యం, రైల్వేలలోని అనేక క్లిష్టమైన ఉపగ్రహ నెట్‌వర్క్‌లలో కనెక్టివిటీకి అంతరాయం కలుగుతుందని పార్థో బెనర్జీ లేఖలో తెలిపారు.

ఈ అంశంపై మరింత స్పష్టత కోసం రాయిటర్స్ హ్యూస్‌నెట్క్‌ వర్క్‌ అధికార ప్రతినిధులను  సంప్రదించగా... తాము ఇప్పటికైతే భారత్‌లో సేవలు అందిస్తున్నామని తెలిపింది కానీ లేఖ సారాంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మరోవైపు భారత టెలికాం మంత్రిత్వ శాఖ ఈ అంశంపై స్పందిచేందుకు నిరాకరించింది. 



You may be interested

ఇండియా చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌!

Monday 24th February 2020

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం 11:40 నిముషాలకు గుజరాత్‌లోని అహ్మాదాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌కు అధ్యక్ష విమానంలో అమెరికా ఫస్ట్‌ లేడీ మెలానీయాతో కలిసి చేరుకున్నారు. ఎయిర్‌ పోర్ట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ట్రంప్‌ దంపతులకు రెడ్‌ కార్పెట్‌ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్‌ ఆనందీబేన్‌ పటేల్‌, గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రుపానీ, ఉన్నతస్థాయి అధికారులు

ఈ మూడు స్టాక్స్‌ టెక్నికల్‌ బ్రేకవుట్స్‌!

Monday 24th February 2020

జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రికమండేషన్స్‌ ఈ వారంలో ఫిబ్రవరి డెరివేటివ్‌ సిరీస్‌ ముగియనున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూసే అవకాశమున్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు చెందిన మార్కెట్‌ నిపుణులు ఆనంద్‌ జేమ్స్‌ పేర్కొంటున్నారు. ఉన్నట్టుండి అంతర్జాతీయంగా కోవిడ్‌-19 విస్తరించడం, వైరస్‌ బాధితులు, మృతుల సంఖ్య పెరగడం సెంటిమెంటును బలహీనపరచినట్లు తెలియజేశారు. మార్కెట్లు, పసిడి, స్టాక్స్‌ తదితర అంశాలపై ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. 12,300 వద్ద

Most from this category