News


మరో పావు శాతం తగ్గిన ఫెడ్‌ రేటు

Thursday 31st October 2019
news_main1572491254.png-29243

  • ఫెడ్‌ ఫండ్స్‌ రేటు 1.5 శాతం నుంచి 1.75 శాతానికి !
  • ఈ ఏడాది ఇది మూడో తగ్గింపు 

అందరి అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పావు శాతం మేర రేట్లను తగ్గించింది. రెండు రోజుల పాటు జరిగి బుధవారం ముగిసిన సమావేశంలో ఫెడ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ, ప్రస్తుతం 1.75 శాతం నుంచి 2 శాతం రేంజ్‌లో ఉన్న ‘ఫెడ్‌ ఫండ్స్‌ రేటు’ను 1.5 శాతం నుంచి 1.75 శాతానికి తగ్గించింది. ఈ ఏడాది రేట్లను తగ్గించడం ఫెడరల్‌ రిజర్వ్‌కు ఇది మూడో సారి. ఈ ఏడాది జూలై, సెప్టెంబర్‌ల్లో పావు శాతం మేర రేట్లను ఫెడ్‌ తగ్గించింది. అంతర్జాతీయంగా మందగమనం నెలకొనడంతో రేట్లను ఫెడ్‌ తగ్గిస్తూ వస్తోంది. 
ఫెడరల్‌ ఫండ్స్‌ రేట్‌ అంటే...
బ్యాంక్‌లు పరస్పరం ఇచ్చుకునే ఓవర్‌నైట్‌ రుణాలపై ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయించే రేటునే ఫెడరల్‌ ఫండ్స్‌ రేట్‌గా వ్యవహరిస్తారు. ఈ రేట్‌పై ఆధారపడే బ్యాంక్‌లు వినియోగదారులకు ఇచ్చే తాకట్టు, క్రెడిట్‌, వ్యాపార ఇలా  వివిధ రుణాలపై వడ్డీరేట్లను నిర్ణయిస్తాయి. You may be interested

బంగారం ఎక్కువైతే... ఇత్తడైపోద్ది!!

Thursday 31st October 2019

లెక్క చూపని బంగారంపై కేంద్రం కన్ను ప్రభుత్వం పరిశీలనలో ‘క్షమాభిక్ష’ పథకం ‘పెద్ద నోట్ల’ మాదిరిగానే వెలికితీసే యోచన స్వచ్చందంగా వెల్లడించి పన్ను చెల్లించే అవకాశం న్యూఢిల్లీ: ‘భాయియో.. ఔర్‌ బెహనో!!’ అంటూ ప్రధాని ఒక్క రాత్రిలో పెద్ద నోట్లన్నీ రద్దు చేసేయటం ఎవరూ మరిచిపోలేరేమో!!. ఇదిగో ఇపుడు అలాంటి ప్రమాదమే మన ఇళ్లలో ఉన్న బంగారానికి కూడా వచ్చేటట్టు కనిపిస్తోంది. ఎందుకంటే లెక్కలు లేకుండా పరిమితికి మించి ఉన్న బంగారాన్ని వెలికితీయాలని కేంద్రం ఆలోచిస్తోంది.

ఐఆర్‌సీటీసీలో ఇంకెంత సత్తా?

Thursday 31st October 2019

ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) సంవత్‌ 2075లో మల్టీబ్యాగర్‌ రిటర్నులు పంచింది. అక్టోబర్‌లో ఇది ఐపీవోకి వచ్చిన విషయం తెలిసిందే. ఒక్కో షేరును రూ.320కు ఇష్యూ చేయగా, కేవలం ఎనిమిది ట్రేడింగ్‌ సెషన్లలోనే 181 శాతం పెరిగింది. లిస్టింగ్‌ రోజునే రూ.728.60 వరకు వెళ్లింది. దీంతో ఐఆర్‌సీటీసీ మార్కెట్‌ విలువ రూ.15,000 కోట్ల స్థాయికి చేరిపోయింది. ఐఆర్‌సీటీసీ షేరు ఇంత అద్భుత ప్రదర్శనకు కారణం వ్యాపార

Most from this category