News


ఇదే సరైన సమయం

Thursday 27th June 2019
news_main1561621324.png-26621

  • బహుళ జాతి సంస్థలను భారత్ ఆకర్షించవచ్చు
  • అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంపై పనగరియా వ్యాఖ్యలు

న్యూయార్క్‌: అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధ పరిస్థితులను భారత్ తనకు అనుకూలంగా మలచుకోవాలని ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ పనగరియా అభిప్రాయపడ్డారు. చైనా కాకుండా ఇతరత్రా దేశాల్లో కార్యకలాపాలు విస్తరించాలనుకుంటున్న భారీ బహుళ జాతి సంస్థలను (ఎంఎన్‌సీ) ఆకర్షించేందుకు ఇది అనువైన సమయమని ఆయన వ్యాఖ్యానించారు. న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా పనగరియా ఈ విషయాలు తెలిపారు.  "భారీ బహుళ జాతి సంస్థలు చైనా నుంచి తప్పుకుంటున్నాయి. వాటిని ఆకర్షించేలా భారత్‌ అన్ని ప్రయత్నాలు చేయడానికి ఇదే సరైన సమయం" అని పేర్కొన్నారు. చైనా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై అమెరికా భారీ టారిఫ్‌లు విధించడం, ప్రతిగా చైనా కూడా అమెరికన్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు విధించడం తదితర చర్యలతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. 
మరోవైపు, అమెరికా నుంచి దిగుమతయ్యే మోటార్‌సైకిళ్లు, వాహనాలపై భారత్ టారిఫ్‌లను తగ్గించాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో అమెరికాతో ఇచ్చి పుచ్చుుకునే ధోరణిలో చర్చలు జరపాలని పనగరియా సూచించారు. "డేటా లోకలైజేషన్ వంటి కొన్ని వివాదాస్పద అంశాలు ఉన్న మాట వాస్తవమే. అయితే, హార్లీ డేవిడ్‌సన్‌ బైకులపై భారత్ భారీ టారిఫ్‌లు విధించడం వంటి అంశాలను పరిష్కరించుకోవచ్చు. వీటిపై సుంకాలు పూర్తిగా ఎత్తివేస్తే వచ్చిన నష్టమేంటి? ఇంకా ఎన్నాళ్ల పాటు భారత్ తమ సొంత వినియోగదారులను నష్టపరుస్తుంది? ప్రస్తుతం భారత్‌లో ఆటో టారిఫ్‌లు దాదాపు 100 శాతానికి పైగా ఉంటున్నాయి. వీటి వల్ల ఎవరికి ప్రయోజనం? వీటిల్లో కొన్ని సుంకాలు పూర్తిగా అర్ధరహితమైనవి" అని పనగరియా చెప్పారు. ప్రతీ దానికీ టారిఫ్‌లు ప్రయోగించకుండా భారత్ కావాలంటే కరెన్సీ మారకం రేటు మరికాస్త తగ్గేలా చేస్తే.. ఎగుమతిదారులకు, దేశ శ్రేయస్సుకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.



You may be interested

ఆశాజనకంగా భారత కంపెనీల వృద్ధి రేటు

Thursday 27th June 2019

- హెచ్‌ఎస్‌బీసీ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: అభివృద్దిపై ఆశాజనకంగా ఉన్న కంపెనీల జాబితా పరంగా భారత్‌ రెండవ స్థానంలో ఉంది. ప్రతి పది కంపెనీల్లోని తొమ్మిది కంపెనీలు అత్యంత ఆశావాద దృక్పథంతో ఉన్నట్లు హెచ్‌ఎస్‌బీసీ తాజా నివేదికలో పేర్కొంది. ఈ అంశంలో ఇండోనేషియా మొదటి స్థానంలో ఉండగా.. ఆ తరువాత స్థానంలో భారత్‌ ఉన్నట్లు తెలిపింది. గతేడాదిలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్టస్థాయికి పడిపోయి 6.8

త్వరలో హెచ్‌డీబీ ఐపీఓ !

Thursday 27th June 2019

ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఉండొచ్చు  ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్ల నియామకం ! ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ), హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ త్వరలో ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) రానుంది. 2007లో ప్రారంభమైన హెచ్‌డీబీ వ్యక్తిగత రుణాలతో పాటు, వాణిజ్య వాహనాలతో పాటు, బంగారంపై రుణాలివ్వటం చేస్తోంది. ఆస్తులు తనఖాగా కూడా రుణాలిస్తోంది. కాగా హెచ్‌డీబీ ఐపీఓ కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ గత నెల రోజులుగా వివిధ ఇన్వెస్ట్‌మెంట్‌

Most from this category