News


ఒప్పందంపై త్వరలో సంతకాలు: ట్రంప్‌

Wednesday 25th December 2019
Markets_main1577248253.png-30425

చైనాతో ప్రాథమిక దశ వాణిజ్య ఒప్పందం
ఏడాదిన్నర కాలంగా నలుగుతున్న వివాదాలకు చెక్‌

ఏడాదిన్నర కాలంగా చైనాతో కొనసాగుతున్న వాణిజ్య వివాదాలకు త్వరలోనే చెక్‌ పెట్టనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఇందుకు వీలుగా ఇటీవల కుదిరిన ఒప్పందంపై త్వరలోనే సంతకాలు చేయనున్నట్లు తెలియజేశారు. వాణిజ్య వివాద పరిష్కారంలో భాగంగా ఈ నెల మొదట్లో రెండు దేశాల మధ్య ప్రాధమిక దశ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. మరోపక్క ఈ అంశంపై యూఎస్‌ ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్‌ ముచిన్‌ స్పందిస్తూ.. జనవరి మొదట్లోనే ఒప్పందంపై సంతకాలు చేసే వీలున్నట్లు తెలియజేశారు. ఈ ప్రాథమిక దశ ఒప్పందంలో భాగంగా కొన్ని రకాల చైనా దిగుమతులపై ట్రంప్‌ ప్రభుత్వం టారిఫ్‌లను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా చైనా సైతం అమెరికా నుంచి వ్యవసాయోత్పత్తుల దిగుమతులను పెంచుకోనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఈ రెండు దేశాల మధ్య చెలరేగిన వాణిజ్య వివాదాలు గత కొద్ది నెలలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నట్లు పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య మైత్రిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నట్లు నిపుణులు తెలియజేశారు.



You may be interested

1500డాలర్లపైన ముగిసిన పసిడి

Wednesday 25th December 2019

ఏడు వారాల అనంతరం పసిడి ఫ్యూచర్ల ధర 1500డాలర్లపైన ముగిసింది. అమెరికాలో నిన్నరాత్రి ఫిబ్రవరి కాంటాక్టు ఔన్స్‌ పసిడి ఫ్యూచర్స్‌ 16.10 డాలర్లు లాభపడి 1,504.80 వద్ద స్థిరపడింది. ఆర్థిక మాంద్య భయాలు వెంటాడటంతో పాటు ఈక్విటీ మార్కెట్లు గరిష్ట స్థాయిల వద్ద ట్రేడ్‌ తరుణంలో లాభాల స్వీకరణ జరగవచ్చనే అందోళనలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచినట్లు బులియన్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.  ‘‘ ఈక్విటీ సూచీలు గరిష్ట స్థాయి వద్ద ఉన్నాయి.

యూఎస్‌ మార్కెట్లు ఫ్లాట్‌

Wednesday 25th December 2019

రికార్డుల ర్యాలీకి మంగళవారం బ్రేక్‌ మిశ్రమంగా ముగిసిన ఇండియన్‌ ఏడీఆర్‌లు క్రిస్మస్‌ సెలవులు ప్రారంభంకానున్న నేపథ్యంలో అమెరికా స్టాక్‌ మార్కెట్లు మంగళవారం మందగించాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో సరికొత్త గరిష్టాలను నమోదు చేస్తున్న మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ముగిశాయి. డోజోన్స్‌ 36 పాయింట్లు(0.13 శాతం) క్షీణించి 28,515 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ నామమాత్ర నష్టంతో 3223 వద్ద స్థిరపడింది. అయితే నాస్‌డాక్‌ 7 పాయింట్లు బలపడి 8953 వద్ద ముగిసింది.

Most from this category