News


పట్టణ సహకార బ్యాంకుల్లో మోసాలు వెయ్యి

Tuesday 28th January 2020
news_main1580181170.png-31251

  • ‘పంచవర్ష’ పాపమిది
  • ఆర్‌బీఐ గణాంకాల వెల్లడి
  • విలువ రూ.220 కోట్లు

న్యూఢిల్లీ: పట్టణ సహకార బ్యాంకుల్లో గత ఐదు ఆర్థిక సంవత్సరాల కాలంలో దాదాపు 1,000 మోసాలు చోటుచేసుకున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. ఈ మోసాల విలువ దాదాపు రూ.220 కోట్లని పేర్కొంది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద ఆర్‌బీఐ అందించిన సమాచారంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

  • 2018-19 మధ్య కాలంలో జరిగిన మోసాల సంఖ్య 181. వీటి విలువ రూ.127.7 కోట్లు. 
  • 2017-18లో మోసాల సంఖ్య 99. వీటి విలువ రూ.46.9 కోట్లు.
  • 2016-17లో జరిగిన 27 మోసాల విషయంలో జరిగిన నష్టం రూ.9.3 కోట్లు. 
  • 2015-16లో మోసాల సంఖ్య 187. ఇందుకు సంబంధించి జరిగిన నష్టం రూ.17.3 కోట్లు. 
  • 2014-15లో జరిగిన నష్టం రూ.19.8 కోట్లయితే, ఇందుకు సంబంధించి జరిగిన మోసాల సంఖ్య 478. 
  • మొత్తం 2014-15 నుంచి 2018-19 మధ్య జరిగిన మోసాల సంఖ్య 972 అయితే జరిగిన నష్టం రూ.221 కోట్లు. 

కఠిన చర్యలు...
ఈ మోసపూరిత కేసులకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని,  తగిన క్రిమినల్‌, సివిల్‌ చర్యలు చేపట్టాలని  బ్యాంకింగ్‌ను ఇప్పటికే ఆదేశించినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. అయితే ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలకు సంబంధించి సమాచారం అందుబాటులో లేదని తెలిపింది. అలాగే  మార్గదర్శకాలకు అనుగుణంగా పట్టణ సహకార బ్యాంకులు పనిచేసేలా నిర్వహణా యంత్రాంగాలను పటిష్టం చేసినట్లు పేర్కొంది. రిటర్న్స్‌, స్టేట్‌మెంట్స్‌ వంటివి నిర్దిష్ట సమయాల్లో ఎటువంటి జాప్యం లేకుండా పట్టణ సహకార బ్యాంకులు సమర్పించేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. ఆకస్మిక తనిఖీలూ తీసుకుంటున్న చర్యల్లో ఉన్నాయని తెలిపింది. తద్వారా డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు తగిన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపింది. 



You may be interested

భారత్‌-బ్రెజిల్‌ వాణిజ్య పటిష్టతకు చర్యలు: గోయెల్‌

Tuesday 28th January 2020

రెండు దేశాల అధికారుల విందు సమావేశంలో ప్రసంగం బిజినెస్‌ లీడర్స్‌ ఫోరమ్‌ పునర్‌వ్యవస్థీకరణకు ప్రతిపాదన న్యూఢిల్లీ: భారత్‌ - బ్రెజిల్‌ మధ్య వాణిజ్య పటిష్టతకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయెల్‌ సూచించారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇండియా-బ్రెజిల్‌ బిజినెస్‌ లీడర్స్‌ ఫోరమ్‌ పునర్‌వ్యవస్థీకరణ, ఫోరమ్‌ క్రియాశీలతకు చర్యలు అవసరమని బ్రెజిల్‌కు సూచించారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు బొల్సనారో సమక్షంలో ఇరు

రెండు రెట్లకు మించిన ఇండిగో లాభం

Tuesday 28th January 2020

మొత్తం ఆదాయం 26 శాతం అప్‌ 2 శాతం తగ్గిన ఇంధన వ్యయాలు  న్యూఢిల్లీ/ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ, ఇండిగో మాతృ కంపెనీ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో రెండు రెట్లకు మించి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.185 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.496 కోట్లకు పెరిగిందని ఇండిగో సీఈఓ రనోజాయ్‌ దత్తా తెలిపారు.  మొత్తం

Most from this category