News


కార్డుల్ని మించిన యూపీఐ

Friday 17th May 2019
news_main1558075730.png-25792

  •  రూ.లక్ష కోట్ల విలువ దాటుతున్న లావాదేవీలు
  • ఏడాది కాలంలో 4.5 రెట్లు వృద్ధి

న్యూఢిల్లీ: ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ) ద్వారా లావాదేవీలు క్రమంగా పుంజుకుంటున్నాయి. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో నెలవారీ లావాదేవీల సంఖ్య 4.5 రెట్లు పెరిగి.. 79.95 కోట్ల స్థాయికి చేరింది. ఈ క్రమంలో క్రెడిట్, డెబిట్‌ కార్డు లావాదేవీలను కూడా మించి యూపీఐ చెల్లింపులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో యూపీఐ లావాదేవీల విలువ రూ.1.09 లక్షల కోట్లుగా ఉండగా, కార్డు లావాదేవీల విలువ రూ.1.05 లక్షల కోట్లకు పరిమితమైంది. ఇక ఫిబ్రవరిలో యూపీఐ లావాదేవీల విలువ రు. 1.07 లక్షల కోట్లు కాగా.. కార్డుల విలువ రూ.93,998 కోట్లుగా నమోదైంది. మార్చిలో రెండు విధానాల్లోనూ చెల్లింపులు రూ.1 లక్ష కోట్లు దాటాయి. యూపీఐ ద్వారా రూ. 1.33 లక్షల కోట్లు, కార్డుల ద్వారా రూ.1.11 లక్షల కోట్ల విలువ చేసే లావాదేవీలు జరిగాయి. యూజర్లను ఆకర్షించేందుకు యూపీఐ యాప్స్‌.. డిస్కౌంట్లు, స్క్రాచ్‌కార్డులు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు వంటివి అందిస్తుండటం కూడా ఈ విధానం ఆదరణ పొందడానికి కారణంగా ఉంటోందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. 
2020 నాటికి 80 శాతం ...
తొలినాళ్లలో వ్యక్తుల మధ్య చెల్లింపులకు (పీ2పీ) మాత్రమే యూపీఐని ఎక్కువగా ఉపయోగించారు. కానీ దీని ద్వారా వ్యాపార సంస్థలకు వ్యక్తులు జరిపే చెల్లింపులు (పీ2ఎం) కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కార్డు ఆధారిత చెల్లింపులు, నెట్‌ బ్యాంకింగ్‌ చెల్లింపుల మార్కెట్‌ వాటాను యూపీఐ కొల్లగొడుతోంది. ఏడాది క్రితం పేమెంట్‌ గేట్‌వేస్‌ పరిమాణంలో యూపీఐ వాటా కేవలం 2 శాతమే ఉండగా.. ప్రస్తుతం 20 శాతానికి పెరిగిందని రేజర్‌పే సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో హర్షిల్‌ మాథుర్‌ పేర్కొన్నారు. మొబైల్‌ ద్వారా చెల్లింపులు జరిపేందుకు అత్యంత అనువైనదిగా రూపొందించిన మొట్టమొదటి విధానం బహుశా ఇదే అయి ఉంటుందని, అందుకే వేగంగా ప్రజాదరణ చూరగొందని ఆయన తెలిపారు. ఇదే తీరు కొనసాగితే పాత తరం డిజిటల్‌ పేమెంట్స్‌ విధానాల మార్కెట్‌ను యూపీఐ మరింతగా ఆక్రమించే అవకాశం ఉందని కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా అభిప్రాయపడింది. 2020 నాటికల్లా ప్రస్తుతం కార్డుల ద్వారా జరిగే లావాదేవీల్లో దాదాపు 80 శాతం లావాదేవీలు యూపీఐకి మారే అవకాశం ఉందని పేర్కొంది. You may be interested

రూ.2 వేల కోట్లతో మాస్టర్‌ కార్డ్‌ సర్వీస్‌ హబ్‌

Friday 17th May 2019

పుణేలో ఏర్పాటు; అక్కడే డేటా సెంటర్‌ కూడా ఐదేళ్లలో రూ.7 వేల కోట్ల పెట్టుబడుల ప్రణాళిక మాస్టర్‌ కార్డ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ కుమార్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గ్లోబల్‌ కార్డ్‌ పేమెంట్స్‌ కంపెనీ మాస్టర్‌ కార్డ్‌ వచ్చే ఐదేళ్లలో ఇండియాలో రూ.7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో రూ.2 వేల కోట్ల పెట్టుబడులతో పుణేలో సర్వీస్‌ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. ఇదే ప్రాంతంలో గతేడాది అక్టోబర్‌లో డేటా సెంటర్‌ను కూడా ఏర్పాటు

ఆయిల్‌, గ్యాస్‌ బ్లాక్‌ కోసం ఆర్‌ఐఎల్‌, బీపీ పోటీ

Friday 17th May 2019

ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి పోటీలోకి వేదాంత, ఓఎన్‌జీసీ, ఓఐఎల్‌ సైతం బిడ్లు దాఖలు 32 బ్లాక్‌లను ఆఫర్‌ చేస్తున్న కేంద్రం న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, దాని భాగస్వామి బ్రిటిష్‌ పెట్రోలియం (బీపీ పీఎల్‌సీ) ఎనిమిదేళ్ల విరామం తర్వాత తొలిసారిగా ఓ చమురు, సహజ వాయివు బ్లాక్‌ కోసం బిడ్‌ దాఖలు చేశాయి. వేదాంత 30 బ్లాక్‌ల కోసం బిడ్లు వేయగా, ఓఎన్‌జీసీ 20 బ్లాక్‌లకు బిడ్లు వేసింది. ఓపెన్‌ యాకరేజ్‌ లైసెన్సింగ్‌ పాలసీ (ఓఏఎల్‌పీ)

Most from this category