News


భారీ డిస్కౌంట్లను ప్రకటించిన మారుతీ

Thursday 5th September 2019
news_main1567653699.png-28200

  • రూ. 1.12 లక్షల వరకు తగ్గింపు

న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) తాజాగా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. మోడల్‌ ఆధారంగా రూ. 1.12 లక్షల వరకు తగ్గింపు ఇస్తున్నట్లు బుధవారం వెల్లడించింది. విటారా బ్రెజా, స్విఫ్ట్‌, డిజైర్‌, సియాజ్‌ కార్లకు ఈ స్థాయి వరకు డిస్కౌంట్‌ వర్తిస్తుందని వివరించింది. విటారా బ్రెజాకు కస్టమర్‌ ఆఫర్‌ రూ. 50000, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ రూ. 20000, కార్పొరేట్‌ ఆఫర్‌ రూ. 10000, ఐదేళ్ల వారెంటీ కలుపుకుని మొత్తంగా రూ. 1.01 లక్షల వరకు డిస్కౌంట్‌ ఉన్నట్లు తెలియజేసింది. ఇదే తరహాలో అన్ని వాహనాలకు ఆఫర్‌ ఉన్నట్లు స్పష్టంచేసింది. ఆల్టో, ఆల్టో కే10 పెట్రోల్‌ వేరియంట్లకు రూ.65,000 వరకు ఆఫర్‌ ప్రకటించింది. స్విఫ్ట్‌ పెట్రోల్‌ వేరియంట్‌కు రూ. 50,000 డిస్కౌంట్‌.. డీజిల్‌ వేరియంట్‌కు రూ.77,700 డిస్కౌంట్‌ ఇస్తోంది. డిజైర్‌ పెట్రోల్‌ వేరియంట్‌కు రూ. 30,000 తగ్గింపు.. డీజిల్‌ వేరియంట్‌కు రూ.20,000 డిస్కౌంట్‌ ప్రకటించింది. ఈకో సెవన్‌ సీటర్‌ డిస్కౌంట్‌ రూ. 25,000 ఉండగా.. బాలెనో, సియాజ్‌ కార్లకు ఆఫర్‌ వర్తిస్తుందని ప్రకటించింది.



You may be interested

ఎన్‌హెచ్‌ఏఐ పటిష్టంగానే ఉంది

Thursday 5th September 2019

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం లేదు పైప్‌లైన్‌లో ఎన్నో ప్రాజెక్టులు చైర్మన్‌ సిన్హా ప్రకటన న్యూఢిల్లీ: జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఎటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం లేదని చైర్మన్‌ ఎన్‌ఎన్‌ సిన్హా స్పష్టం చేశారు. చాలా బలమైన స్థితిలోనే ఎన్‌ఎచ్‌ఏఐ ఉందని, ప్రణాళికలో ఎన్నో ప్రాజెక్టులు కూడా ఉన్నట్టు తెలిపారు. గతేడాది 3,300 కిలోమీటర్ల మేర రహదారుల ప్రాజెక్టులను చేపట్టగా, ప్రస్తుత ఏడాది 4,500 కిలోమీటర్ల మేర ప్రాజెక్టులను నిర్మించనున్నామని ఆయన చెప్పారు.

రుణ రేట్లు అన్నీ రెపోకు అనుసంధానం కావాల్సిందే!

Thursday 5th September 2019

బ్యాంకింగ్‌కు ఆర్‌బీఐ స్పష్టీకరణ అక్టోబర్‌ 1 నుంచీ అమల్లోకి... ముంబై: బ్యాంకింగ్‌ రుణ రేట్లు అన్నీ రెపోసహా ద్రవ్య విధాన నిర్ణయ రేట్లకు, ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేట్లకు అనుసంధానం కావాల్సిందేనని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకులకు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్‌బీఐ బుధవారం ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. మూడు నెలలకు ఒకసారి ఇలాంటి అనుసంధాన నిర్ణయాలు (రిసెట్‌) జరగాలని సర్క్యులర్‌ నిర్దేశించింది. ‘‘వ్యక్తిగత లేదా గృహ, ఆటో అలాగే

Most from this category