News


అనిశ్చితి నిరోధానికి అసాధారణ చర్యలు

Friday 23rd August 2019
news_main1566540746.png-27968

  • ఆర్థిక మందగమనంపై 
  • నీతి ఆయోగ్‌ సూచన
  • ఫైనాన్షియల్‌ రంగంలో 
  • ఎన్నడూ లేనంత ఒత్తిడి
  •  ప్రైవేటు రంగంలో 
  • ఒకరినొకరు విశ్వసించని స్థితి...
  • దీని నివారణకు చర్యలు అవసరం

న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనడానికి అసాధారణ చర్యలు అవసరమని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ కేంద్రానికి సూచించారు. ఫైనాన్షియల్‌ రంగంలో ముందెన్నడూ లేనంత తీవ్ర ఒత్తిడి నెలకొందనీ, ఆర్థిక మందగమన పరిస్థితులు తీవ్రతకూ ఇదీ ఒక కారణమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రైవేటు రంగాన్ని ప్రస్తావిస్తూ, ఈ రంగంలో ఒకరినొకరు విశ్వసించలేని పరిస్థితి నెలకొందన్నారు. పెట్టుబడులు పెట్టడంపై ఆందోళనలూ ఉన్నాయన్నారు. ఆయా భయాలను పోగొట్టి, పెట్టుబడులకు వారిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు...
- గడచిన 70 యేళ్లలో లేనంతగా ఫైనాన్షియల్‌ రంగంలో ఒత్తిడి కనబడుతోంది. ఎవరు ఎవ్వరనీ విశ్వసించడంలేదు. ప్రైవేటు రంగంలో రుణాలు ఇవ్వడానికి ఎవ్వరూ సిద్దంగా లేదు. ఎవరికివారు పెట్టుబడులు పెట్టకుండా, ఎవరి డబ్బు వారి దగ్గరే ఉంచుకుంటున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి తగిన చర్యలు అవసరం. 
- ఫైనాన్షియల్‌ రంగంలో ఒత్తిడిని నిరోధించడానికి, 2018-19లో ఐదేళ్ల కనిష్టస్థాయి 6.8 శాతానికి పడిపోయిన వృద్ధిని పెంపొందించడానికి 2019-2020 బడ్జెట్‌లో కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. త్వరలో అవి ఫలాలను అందిస్తాయని విశ్వసిస్తున్నా. 
- మందగమనంలోకి ఆర్థిక పరిస్థితులు పూర్తిగా జారిపోవడానికి ఫైనాన్షియల్‌ రంగం కూడా ఒక కారణం. 2009-2014లో విచక్షణా రహితంగా రుణాలు జారీ చేయడంతో తొలుత ఫైనాన్షియల్‌ రంగంలో సమస్యలు ప్రారంభమైనాయి. తరువాతి కాలంలో ఈ రుణాల్లో అధిక భాగం మొండిబకాయిలు (ఎన్‌పీఏ)గా మారాయి. ఎన్‌పీఏల పెరుగుదలతో బ్యాంకులు తాజా రుణాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. బ్యాంకింగ్‌యేతర ఆర్థిక కంపెనీలూ ద్రవ్య లభ్యత సమస్యల్లో పడ్డాయి. 
- వస్తు, సేవలకు సంబంధించి ప్రైవేటు రంగానికి  ప్రభుత్వ, ప్రభుత్వ శాఖల నుంచి చెల్లింపులల్లో ఆలశ్యం కూడా మందగమన పరిస్థితులు నెలకొనడానికి ఒక కారణమై ఉండచ్చు. అయితే చెల్లింపుల ప్రక్రియ వేగవంతానికి అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. 



You may be interested

మధ్యాహ్న భోజనానికి భారతీ ఆక్సా లైఫ్‌ చేయూత

Friday 23rd August 2019

హైదరాబాద్‌: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమానికి చేయూతనిచ్చేందుకు భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ముందుకు వచ్చింది. సంస్థ 13వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అక్షయపాత్ర ఫౌండేషన్‌తో చేతులు కలిపింది. ఒక్కరోజు వేతనాన్ని విరాళంగా అందించాలని తన ఉద్యోగులకు పిలుపునిచ్చింది. కడుపునిండా ఆహారం ఉంటే విద్యార్థులు మరింత మంచిగా చదువుకోగలరని తాము నమ్ముతున్నట్టు భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవో వికాస్‌సేత్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 15,000 పాఠశాల్లలో

మార్కెట్లోకి ‘కియా సెల్టోస్‌ ఎస్‌యూవీ’

Friday 23rd August 2019

ముంబై: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌ తాజాగా తన ‘సెల్టోస్‌ మిడ్‌-సైజ్‌ ఎస్‌యూవీ’ కారును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో ఇటీవలే తొలి కారును ఆవిష్కరణ కంపెనీ.. గురువారం దేశవ్యాప్తంగా విడుదలచేసింది. ఈకారు ధరల శ్రేణి రూ.9.69 లక్షలు నుంచి రూ.15.99 లక్షలుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 32,035 బుకింగ్స్‌ పూర్తయినట్లు సంస్థ ఎండీ, సీఈఓ కూక్‌ హున్‌ షిమ్‌ ఈ సందర్భంగా

Most from this category