News


డబ్ల్యూఈఎఫ్‌ సదస్సుకు జోరుగా సన్నాహాలు

Monday 23rd December 2019
news_main1577072328.png-30370

  • హాజరు కానున్న 100 పైగా భారతీయ సీఈవోలు
  • పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా 

న్యూఢిల్లీ: వచ్చే నెలలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సుకు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో కేంద్ర మంత్రులు పియుష్ గోయల్‌, మన్‌సుఖ్ మాండవీయతో పాటు ముగ్గురు ముఖ్యమంత్రులు (అమరీందర్ సింగ్, కమల్‌ నాథ్‌, బీఎస్ యడ్యూరప్ప), తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు, 100 మందిపైగా భారతీయ సీఈవోలు పాల్గోనున్నారు. పారిశ్రామికవేత్తల్లో ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, రాహుల్ బజాజ్, కుమార మంగళం బిర్లా, ఆనంద్ మహీంద్రా మొదలైన వారు ఉన్నారు. అటు అగ్రరాజ్యాలు ‍అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ కూడా హాజరు కావొచ్చని అంచనా. అయితే, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాత్రం రాకపోవచ్చని తెలుస్తోంది. 2020 జనవరి 20-24 మధ్య డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సదస్సు జరగనుంది. మానసిక ఆరోగ్య ప్రాధాన్యతపై అపోహలు తొలగించి, అవగాహన పెంచేందుకు లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసిన సినీ నటి దీపికా పదుకొణె.. ఈ సదస్సు తొలి రోజున ప్రతిష్టాత్మక క్రిస్టల్ అవార్డు అందుకోనున్నారు. 



You may be interested

కన్సార్షియం రుణాల పంపిణీపై కార్యాచరణ

Monday 23rd December 2019

ఏప్రిల్‌ నాటికి సిద్ధం చేయనున్న ఐబీఏ న్యూఢిల్లీ: బ్యాంకులు ఒక కూటమిగా ఏర్పడి మంజూరు చేసే రుణాల విషయంలో (కన్సార్షియం లెండింగ్‌) ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కార్యాచరణను ఇండియన్‌ బ్యాం‍క్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) వచ్చే ఏప్రిల్‌ నాటికి తయారు చేయనుంది. అలాగే, బ్యాంకులకు ప్రత్యామ్నాయ నిధుల మార్గాలపైనా దృష్టి సారించనుంది. ‘‘ప్రస్తుతం కన్సార్షియంగా ఇచ్చే రుణాల విషయంలో నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) కోసం అన్ని బ్యాంకుల చుట్టూ రుణగ్రహీత తిరగాల్సి వస్తోంది.

త్వరలో పీసీఏ నుంచి ఐడీబీఐ బ్యాంక్ బైటికి

Monday 23rd December 2019

న్యూఢిల్లీ: భారీ మొండిబాకీల రికవరీ, మరింత మూలధనం లభించడం తదితర అంశాల ఊతంతో ఐడీబీఐ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలోనే పీసీఏ ఆంక్షల పరిధి నుంచి బైటికి వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే రుణాల మంజూరీపరమైన కొన్ని నిబంధనలను సడలించిందని వెల్లడించాయి. భారీ మొండిబాకీలు పేరుకుపోయిన ఐడీబీఐ బ్యాంక్ వంటి బ్యాంకులను సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధిలోకి చేరుస్తూ

Most from this category