STOCKS

News


కేంద్ర బడ్జెట్‌ 2020 హైలైట్స్‌..(అప్‌డేటింగ్‌) -ఆదాయ పన్ను శ్లాబ్‌ తగ్గింపు

Saturday 1st February 2020
news_main1580546825.png-31395

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో 11 గంటలకల్లా బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించారు. వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) అత్యంత ప్రధానమైన సంస్కరణగా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి ప్రసంగం ఇలా సాగింది.

ఆదాయ పన్ను తగ్గింపు
రూ. 5 లక్షలలోపు ఆదాయంపై పన్ను లేదు
రూ. 5-7.5 లక్షల ఆదాయంపై ప్రస్తుతం అమలవుతున్న 20 శాతం‍ శ్లాబు 10 శాతానికి కుదింపు
రూ. 7.5-10 లక్షల ఆదాయంపై ఇక 15 శాతం పన్ను- ఇప్పటివరకూ ఇది 20 శాతం
రూ. 10-12.5 లక్షల ఆదాయంపై  20 శాతం పన్ను- గతంలో 30 శాతం
రూ. 12.5-15 లక్షల ఆదాయంపై 25 శాతం పన్ను- గతంలో 30 శాతం
రూ. 15 లక్షలకుపైగా ఆదాయం ఆర్జించేవారు 30 శాతం పన్ను చెల్లించవలసి ఉంటుంది
- కార్పొరేట్‌ కంపెనీలు చెల్లిస్తున్న డివిడెండ్‌ పంపిణీ పన్ను(డీడీటీ) ఎత్తివేత
- డీడీటీ రద్దుతో రూ. 25,000 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి

----------------

- అందుబాటు ధరల గృహ నిర్మాణాలపై ట్యాక్స్‌ హాలిడే మరో ఏడాదిపాటు పొడిగింపు.
- ప్రస్తుతం ఇస్తున్న 100 రకాల ఆదాయ పన్ను మినహాయింపు అంశాలలో 70వరకూ తొలగించారు.
- 2021లో వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యం రూ. 90,000 కోట్లు
- 2021లో ఆర్‌బీఐ, ఫైనాన్షియల్‌ సంస్థల నుంచి రూ.రూ. 89,640 కోట్ల డివిడెండ్‌
- ప్రత్యక్ష పన్నుల కేసుల పరిష్కారానికి వివాద్‌ సే వి‍శ్వాస్‌ పేరుతో కొత్త పథకం
- మెడికల్‌ పరికరాల దిగుమతులపై సెస్‌ విధింపు

--------------------------

ఆదాయ వ్యయాలు
2020లో వ్యయాలు 26.99 లక్షల కోట్లు
వసూళ్లు -(రిసీప్ట్స్‌) 19.32 లక్షల కోట్లు
జీడీపీలో ద్రవ్యోలోటు లక్ష్యం 3.3 శాతానికి బదులుగా 3.8 శాతానికి సవరణ
రూ. 4.99 లక్షల కోట్లు మార్కెట్ల నుంచి నికర రుణ సమీకరణ

2021లో వసూళ్ల అంచనాలు రూ. 22.46 లక్షల కోట్లు
మొత్తం వ్యయ ప్రణాళికలు రూ. 30.42 లక్షల కోట్లు
జీడీపీలో ద్రవ్యలోటు లక్ష్యం 3.5 శాతం
రూ. 5.36 లక్షల కోట్లు మార్కెట్ల నుంచి నికర రుణ సమీకరణ 

-----------------------
ఎల్‌ఐపీ ఐపీవో?
- ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టడం ద్వారా నిధుల సమీకరణ ప్రణాళికలు
- గత కొన్నేళ్లలో ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ. 3.5 లక్షల కోట్ల కేటాయింపు  
- కేపిటల్‌ మార్కెట్ల నుంచి మరిన్ని నిధుల సమీకరణకు పీఎస్‌యూ బ్యాంకులను ప్రోత్సహిస్తాం
- డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంపు
- 2022లో జీ20 సమావేశాల నిర్వహణకు రూ. 100 కోట్లు
- సహకార బ్యాంకుల పటిష్టతకు నిబంధనల సవరణ
- 2020లో ద్రవ్యోలోటు  జీడీపీలో 3.8 శాతం
- 2021లో ద్రవ్యలోటు టార్గెట్‌ 3.5 శాతం
- ఐడీబీఐ బ్యాంక్‌లో మిగిలిన ప్రభుత్వ వాటా విక్రయం
- ప్రధానంగా జీ సెక్యూరిటీలతో కూడిన కొత్త తరహా డెట్‌ ఈటీఎఫ్‌లు
- నేషనల్‌ ఇన్‌ఫ్రా పైప్‌లైన్‌కు రూ. 22000 కోట్లు
- కార్పొరేట్‌ బాండ్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్‌ పరిమితి 9 శాతం నుంచి 15 శాతానికి పెంపు

--------------------

భద్రత- శుభ్రత
- క్లీన్‌ ఎయిర్‌ కార్యక్రమానికి రూ. 4400 కోట్లు 
- కాలుష్యం పరిమితిని మించితే బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాల మూసివేత
- జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యం
- వాయుకాలుష్యం తగ్గించుకునే ద్వితీయ శ్రేణి పట్టణాలకు ప్రోత్సాహకాలు
- సంపదను సృష్టించేవారికి తగిన గౌరవం
- పన్ను చెల్లింపుదారులకు వేధింపులు ఉండవు
- నాన్‌గెజిటెట్‌ ఉద్యోగాలకు ఒకే జాతీయ పరీక్షా విధానం

------------------

స్ట్రీలకు ప్రాధాన్యం
- 2021లో స్త్రీ ప్రాధాన్య కార్యక్రమాలకు 28,600 కోట్లు 
- పోషకాహార సంబంధ పథకాలకు రూ. 35600 కోట్లు కేటాయింపు
- 2021లో షెడ్యూల్డ్‌ కులాలు, ఓబీసీలకు రూ. 85,000 కోట్లు
- గిరిజనులకు(షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌) 2021లో రూ. 53,700 కోట్లు
- సీనియర్‌ సిటిజన్లకు రూ. 9500 కోట్లు
- సాంస్కృతిక శాఖకు రూ. 3100 కోట్లు
- పర్యాటక​ అభివృద్ధికి రూ. 2500 కోట్లు

---------------------------

విద్యుత్‌, గ్యాస్‌కు ప్రాధాన్యం

- విద్యుత్‌, పునరుత్పాదక ఇంధన రంగానికి రూ. 22,000 కోట్లు
- జాతీయ గ్యాస్‌ గ్రిడ్‌ 16,200 కిలోమీటర్లకు 27,000 కిలోమీటర్లకు పెంపు
- డేటా కేంద్రాల(డేటా సెంట్రల్‌ ) ఏర్పాటుకు ప్రణాళికలు
- భారత్‌ నెట్‌ కార్యక్రమానికి 2021లో రూ. 6,000 కోట్లు కేటాయింపు
- లక్ష గ్రామ పంచాయతీలను భారత్‌ నెట్‌కు అనుసంధానం
- రెండు జాతీయ సైన్స్‌ పథకాలు
- టూరిస్ట్‌ ప్రాంతాలకు మరిన్ని తేజస్‌ తరహా రైళ్లు
- నేషనల్‌ మిషన్‌ క్వాంటమ్ టెక్నాలజీకు ఐదేళ్ల కాలంలో రూ. 8000 కోట్లు

-------------------

5 స్మార్ట్‌ సిటీలు- 100 ఎయిర్‌పోర్ట్‌లు
- కొత్తగా ఐదు స్మార్ట్‌ సిటీలు
- విద్యారంగానికి రూ. 99,000 కోట్లు
- నీర్విక్‌ పేరుతో కొత్త ఎగుమతి క్రెడిట్‌ స్కీమ్‌ 
- 2021లో పరిశ్రమలు, వాణిజ్యం అభివృద్ధికి రూ. 27,300 కోట్లు
- టెక్స్‌టైల్‌ మిషన్‌కు రూ. 1480 కోట్లు
- నేషనల్‌ ఇన్‌ఫ్రా పైప్‌లైన్‌లో భాగంగా 6,500 ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల కోసం రూ. 103 లక్షల కోట్ల ప్రణాళికలు
- త్వరలో కొత్త నేషనల్‌ లాజిస్టిక్స్‌ పాలసీ -తద్వారా సింగిల్‌ విండో ఈ లాజిస్టిక్స్‌ మార్కెట్‌
-2023కల్లా ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే
- భారతీయ రైల్వేల అభివృద్ధికి 5 ప్రణాళికలు
- పీపీపీ విధానంలో4 రైల్వే స్టేషన్ల పునరభివృద్ధి ప్రణాళికలు
- బెంగళూరు పట్టణ రవాణా ప్రాజెక్టుకు రూ. 18,600 కోట్లు
- ఈ ప్రాజెక్టులో ప్రభుత్వానికి 20 శాతం వాటా
- 2024 కల్లా ఉడాన్‌ పథకంలో భాగంగా 100 విమానాశ్రయాల అభివృద్ధి
- రవాణా రంగానికి 2021లో రూ. 1.7 లక్షల కోట్లు

 

 

త్వరలో కొత్త విద్యావిధానం​

- విద్యార్ధుల నైపుణ్య శిక్షణకు రూ. 3,000 కోట్లు 

- 2021లో విద్యా రంగానికి రూ. 99,300 కోట్ల కేటాయింపు
- సాధారణ కేటగిరీ విద్యార్ధులకు శిక్షణ కోసం 150 అత్యుత్తమ ఇన్‌స్టిట్యూట్స్‌
- ఆరోగ్య రంగానికి రూ. 69,000 కోట్లు
- ద్వితీయ స్థాయి పట్టణాలలో ఆయుష్మాన్‌ పథకంలో భాగంగా మరిన్ని ఆసుపత్రులు
- స్వచ్చ భారత్‌ మిషన్‌కు రూ. 12,300 కోట్లు
- జల్‌ జీవన్‌ మిషన్‌కు రూ. 3.6 లక్షల కోట్లు
- 2025కల్లా టీబీ వ్యాధి నిర్మూలన

-------------------

- వ్యవసాయం, నీటిపారుదలకు రూ. 2.83 లక్షల కోట్ల కేటాయింపులు
- గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌లకు రూ. 1.23 లక్షల కోట్ల కేటాయింపు
- 2 మిలియన్ల రైతులకు సోలార్‌ పంప్‌ సెట్ల అందజేత
- 2006-16 మధ్య 21.7 కోట్లమంది పేదరికం నుంచి బయటపడ్డారు
- 2014లో 52.2 శాతంగా నమోదైన ప్రభుత్వ రుణాలు 2019 మార్చికల్లా 48.7 శాతానికి తగ్గాయి

 

------------------

- 2014-19 మధ్య 7.4 శాతం జీడీపీ వృద్ధి
- ద్రవ్యోల్బణం 4.2 శాతం స్థాయిలో కట్టడి
- జీఎస్‌టీని ప్రవేశపెట్టాక నెలవారీ వ్యయాల నుంచి 4 శాతం పొదుపు చేస్తున్న కుటుంబాలు
- 2022కల్లా రైతుల ఆదాయం​ రెట్టింపునకు పెంచే కట్టుబాటు- ఇందుకు 16 చర్యల ప్రణాళిక
- పీఎం ఫసల్‌ బీమా యోజన కింద 6.11 కోట్ల రైతులకు బీమా సదుపాయం
- వ్యవసాయ మార్కెట్లకు స్వేఛ్చను కల్పించవలసిన అవసరం ఉంది
- నీటి ఎద్దటి ఎదుర్కొంటున్న 100 జిల్లాలకు సమీకృత ప్రణాళికలుYou may be interested

రూ.లక్ష దాటిన జీఎస్టీ ఆదాయం

Saturday 1st February 2020

  న్యూఢిల్లీ: వరుసగా మూడోనెల్లో వస్తుసేవల పన్ను(జీఎస్టీ) ఆదాయం రూ.లక్ష కోట్లకుపైగా వసూలయ్యింది. పన్ను ఎగవేత దారుల నుంచి చెల్లింపు వసూళ్లు పెరగడంతో డిసెంబర్‌ నెలలో  రికార్డు స్తాయిలో జీఎస్టీ ఆదాయం రూ. 1.1లక్షలుగా నమోదైంది. రెవిన్యూ సెక్రటరీ అజయ్‌ భూషన్‌ పాండే  ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.దేశీయ లావాదేవీల్లో 12 శాతం వృద్ధి పెరిగిందని, గతేడాది జనవరితో పోలిస్తే 2020 జనవరిలో ఐజీఎస్టీ ఆదాయం 80

బడ్జెట్‌ లైవ్‌ అప్‌డేట్‌ : వ్యవసాయానికి పెద్దపీట

Saturday 1st February 2020

నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్‌‌ను వినేందుకు ఆమె కుమార్తె వాంగ్మయి, సహా కుటుంబసభ్యులు కూడా విచ్చేశారు. వారిని పార్లమెంట్‌ సిబ్బంది, అధికారులు వీరిని సాదరంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్లారు. పార్లమెంట్ హాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ బడ్జెట్ 2020-21కి ఆమోదం తెలిపింది.  పార్లమెంట్‌లో మొదలైన ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రసంగం దేశంలో అన్ని వర్గాల, రంగాల ఆశలను, ఆంక్షాలను పరిష్కరించడమే బడ్జెట్‌ లక్ష్యం సాహసోపేతంగా ప్రవేశపెట్టిన జీఎస్‌టీ అద్భుతమైన ఫలితాలను

Most from this category