STOCKS

News


యూనియన్‌ బ్యాంకు ఆకర్షణీయ ఫలితాలు

Tuesday 11th February 2020
news_main1581391835.png-31676

  • నాలుగు రెట్లు పెరిగిన నికర లాభం
  • రూ.575 కోట్లుగా నమోదు

న్యూఢిల్లీ: యూనియన్‌ బ్యాంకు డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల్లో మంచి పనితీరు ప్రదర్శించింది. బ్యాంకు స్టాండలోన్‌ లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.153 కోట్లతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగి రూ.575 కోట్లకు చేరుకుంది. బ్యాంకు ఆదాయం కూడా రూ.9,573 కోట్ల నుంచి రూ.10,741 కోట్లకు దూసుకుపోయింది. బ్యాంకు ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 15.66 శాతం నుంచి 14.86 శాతానికి (మొత్తం రుణాల్లో రూ.49,923 కోట్లు) తగ్గాయి. నికర ఎన్‌పీఏలు కూడా 8.27 శాతం నుంచి 6.99 శాతానికి (రూ.21,510 కోట్లు) తగ్గుముఖం పట్టాయి. ఎన్‌పీఏల కోసం చేసిన కేటాయింపులు రూ.1,570 కోట్లుగా ఉన్నాయి. ఇక కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం బ్యాంకు నికర లాభం రూ.554 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.183 కోట్లు. ఆదాయం రూ.9,757 కోట్ల నుంచి రూ.10,985 కోట్లకు పెరిగింది. ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకులను యూనియన్‌ బ్యాంకు విలీనం చేసుకోనున్న సంగతి తెలిసిందే. 



You may be interested

సిగరెట్‌ ధరల పెంపుతో ఐటీసీ జూమ్‌!

Tuesday 11th February 2020

వివిధ సిగరెట్ల ధరలను వాటి పొడవు ఆధారంగా 10- 12 శాతం మేర పెంచుతున్నట్లు ఐటీసీ ప్రకటించింది. బడ్జెట్లో విధించిన పన్ను భారాన్ని తట్టుకునేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. సిగరెట్‌ ధరల పెంపు ప్రకటనతో మంగళవారం ఐటీసీ షేరు ఆరంభ ట్రేడింగ్‌లో దాదాపు 3 శాతం లాభపడింది. సోమవారం క్లోజింగ్‌ రూ. 210.55 కాగా, మంగళవారం రూ. 216.50 వద్ద ఆరంభమైన ఐటీసీ షేరు రూ.216.95 గరిష్ఠాన్ని, రూ.213.85

ఇసుజు కార్ల పరిశ్రమలో అదనపు ఉత్పత్తులు ప్రారంభం

Tuesday 11th February 2020

రూ. 400కోట్లతో ప్రెస్‌షాప్, ఇంజన్‌ అసెంబ్లీ యూనిట్లు ఏర్పాటు వరదయ్యపాళెం(చిత్తూరు జిల్లా): శ్రీసిటీలోని జపనీస్‌ యుటిలిటీ వాహన తయారీదారు ఇసుజు మోటార్స్‌ ఇండియా పరిశ్రమలో అదనపు ఉత్పత్తుల యూనిట్‌ను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. కంపెనీ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ కొజిరో యఖియామా, ఇసుజు మోటార్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ టోరూ నకాటా, మిట్సుబిషి కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్, సీఈఓ ఇవారో టోయిడి శ్రీసిటీ మేనేజింగ్‌

Most from this category