News


ఆంధ్రాబ్యాంక్‌ విలీనానికి యూనియన్‌ బ్యాంక్‌ బోర్డ్‌ ఓకే

Tuesday 10th September 2019
news_main1568089734.png-28277

  • రూ.17,200 కోట్ల పెట్టుబడుల సమీకరణకు కూడా 
  • సోమవారం నాటి సమావేశంలో ఆమోదం తెలిపిన బోర్డ్‌

న్యూఢిల్లీ: ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌లను విలీనం చేసుకోవడానికి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.17,200 కోట్ల నిధుల సమీకరణ ప్రతిపాదనను కూడా డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదించిందని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. సోమవారం జరిగిన బోర్డ్‌ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి ​ప్రిఫరెన్షియల్‌ కేటాయింపుల ద్వారా ఈక్విటీ షేర్లు జారీ చేసి రూ.13,000 కోట్లు సమీకరిస్తామని తెలిపింది. అలాగే అదనపు టైర్‌ వన్‌/టూ బాండ్ల జారీ ద్వారా రూ.4,200 కోట్లు సమీకరిస్తామని వెల్లడించింది. 

బ్యాంక్‌ల విలీనానికి డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలపడం, రూ.17,200 కోట్ల మేర నిధులు సమీకరించనుండటం వంటి సానుకూలాంశాల నేపథ్యంలో బీఎస్‌ఈలో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్‌ 2.2 శాతం లాభంతో రూ.56.25 వద్ద ముగిసింది. 
12కు తగ్గనున్న ప్రభుత్వ బ్యాంక్‌లు...
గత నెల 30న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భారీ బ్యాంక్‌ల విలీన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పది బ్యాంక్‌లు విలీనమై నాలుగు  బ్యాంక్‌లుగా అవతరించనున్నాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌ బ్యాంక్‌లు విలీనమవుతున్నాయి. అలాగే కెనరా బ్యాంక్‌లో సిండికేట్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌లో అలహాబాద్‌ బ్యాంక్‌ విలీనం కానున్నాయి. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, పంజాబ్‌ సింధ్‌ బ్యాంక్‌లు కొనసాగుతాయి. మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల సంఖ్య 12కు తగ్గనున్నది. 



You may be interested

పీడబ్ల్యూసీపై సెబీ నిషేధాన్ని కొట్టివేసిన శాట్‌

Tuesday 10th September 2019

ఆడిటర్లపై ఐసీఏఐ మాత్రమే చర్యలు తీసుకోగలదు ఆ అధికారం సెబీకి లేదని శాట్‌ స్పష్టీకరణ న్యూఢిల్లీ: ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ (పీడబ్ల్యూసీ) ఇండియాకు ఊరట లభించింది. లిస్టెడ్‌ కంపెనీలకు ఆడిటింగ్‌ సేవలు అందించకుండా ఆ సంస్థ విభాగంపై సెబీ విధించిన నిషేధాన్ని సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) కొట్టివేసింది. ఆడిటింగ్‌ సంస్థను నిషేధించే అధికారం సెబీకి లేదని స్పష్టం చేసింది. కేవలం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ (ఐసీఏఐ) మాత్రమే ఆడిటర్లపై

నేడు మార్కెట్లకు సెలవు

Tuesday 10th September 2019

మొహర్రం సందర్భం‍గా మంగళవారం మార్కెట్లకు సెలవు దినం. నేడు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయవు. అలాగే ఫారెక్స్‌ మార్కెట్‌కు కూడా సెలవు. కమోడిటీ ఎక్చ్సేంజ్‌ మాత్రం మధ్యాహ్నం వరకు పనిచేయదు. సాయంత్రం 5గం.లకు ట్రేడింగ్‌ ప్రారంభవుతోంది. స్టాక్‌ మార్కెట్‌ తిరిగి యథావిధిగా బుధవారం (10న) ప్రారంభమవుతుంది. ఇక ఆర్థిక మందగమన పరిస్థితులను చక్కదిద్దే మరిన్ని చర్యలను ప్రభుత్వం చేపట్టనున్నదన్న అంచనాలతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలతో మార్కెట్‌ రెండోరోజూ

Most from this category