News


అల్ట్రాటెక్‌ సిమెంట్‌ లాభం 80 శాతం అప్‌

Saturday 25th January 2020
news_main1579923503.png-31187

  • రూ.10,176 కోట్లకు తగ్గిన మొత్తం ఆదాయం 
  • నిర్వహణ లాభం రూ.1,786 కోట్లు

(అప్‌డేటెడ్‌...)

ముంబై: బిర్లా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అల్ట్రాటెక్‌ సిమెంట్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో 80 శాతం మేర పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.396 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.712 కోట్లకు పెరిగిందని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.10,294 కోట్ల నుంచి రూ.10,176 కోట్లకు తగ్గిందని పేర్కొంది. స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే. నికర లాభం రూ.433 కోట్ల నుంచి రూ.643 కోట్లకు ఎగసిందని వివరించింది. వివాద పరిష్కార పథకం కోసం రూ.133 కోట్లు కేటాయించామని, దీనిని కూడా కలుపుకుంటే ఈ నికర లాభం మరింతగా పెరిగి ఉండేదని తెలిపింది. ఈ క్యూ3లో నిర్వహణ లాభం రూ.1,786 కోట్లుగా, నిర్వహణ లాభ మార్జిన్‌ 17.9 శాతంగా ఉందని పేర్కొంది. 
డిమాండ్‌పై ఆశావహ అంచనాలు...
కొన్ని మార్కెట్లలో డిమాండ్‌ ఇప్పటికే పుంజుకుందని, మౌలిక రంగంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుండటంతో డిమాండ్‌ మరింతగా పుంజుకునే అవకాశాలున్నాయని ఈ కంపెనీ అంచనా వేస్తోంది. ఈ క్యూ3లోనే గ్రూప్‌ కంపెనీ సెంచురీ సిమెంట్‌ వ్యాపారాన్ని విలీనం చేసుకున్నామని అల్ట్రాటెక్‌ సిమెంట్‌  తెలిపింది. బం‍గ్లాదేశ్‌లోని ఎమిరేట్స్‌ సిమెంట్‌ బంగ్లాదేశ్‌, ఎమిరేట్స్‌ పవర్‌ కంపెనీల్లో తమ అనుబంధ కంపెనీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ మిడిల్‌ ఈస్ట్‌కున్న పూర్తి వాటాలను విక్రయించామని వెల్లడించింది. ఈ వాటాలను హెడెల్‌బర్గ్‌ సిమెంట్‌ బంగ్లాదేశ్‌ 3 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిందని వివరించింది. 



You may be interested

నవంబర్‌లో 14.33 లక్షల నూతన ఉద్యోగాలు

Saturday 25th January 2020

రూ.10,176 కోట్లకు తగ్గిన మొత్తం ఆదాయం  నిర్వహణ లాభం రూ.1,786 కోట్లు ముంబై: బిర్లా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అల్ట్రాటెక్‌ సిమెంట్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో 80 శాతం మేర పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.396 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.712 కోట్లకు పెరిగిందని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.10,294 కోట్ల నుంచి

62 శాతం ఎగసిన ఇండియన్‌ బ్యాంక్‌ లాభం

Saturday 25th January 2020

తగ్గిన మొండి బకాయిలు  క్యూ3లో రూ.4 లక్షల కోట్ల వ్యాపారం చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్‌ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 62 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.152 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.247 కోట్లకు పెరిగిందని ఇండియన్‌ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ పద్మజా చందూర్‌ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.5,269 కోట్ల నుంచి రూ.6,506 కోట్లకు

Most from this category