News


హైదరాబాద్‌లో బ్రిటన్ టెక్నాలజీ హబ్‌

Thursday 8th August 2019
news_main1565243640.png-27633

  • దేశవ్యాప్తంగా నాలుగు ఏర్పాటు
  • బ్రిటన్ హై కమిషనర్ సర్‌ డొమినిక్ వెల్లడి

‍చెన్నై: భారతీయ కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు, ఇరు దేశాల్లోను పెట్టుబడులను ప్రోత్సహించేందుకు  ప్రయత్నాలు చేస్తున్నట్లు భారత్‌లో బ్రిటన్ హై కమిషనర్ సర్ డొమినిక్ ఆస్కిత్ తెలిపారు. ఇందులో భాగంగా త్వరలో నాలుగు భారతీయ నగరాల్లో టెక్ హబ్‌లు (టెక్నాలజీ హబ్‌) ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. హైదరాబాద్‌తో పాటు న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో వీటిని నెలకొల్పనున్నట్లు చెప్పారు. రెండు దేశాల్లోని టెక్నాలజీ పరిశ్రమల సామర్ధ్యాలు .. అవసరాలను మదింపు చేసి, ఇరు దేశాల కంపెనీలు కలిసి పనిచేయగలిగే అంశాలపై ఈ టెక్ హబ్‌లు కసరత్తు చేస్తాయని డొమినిక్ వివరించారు. బ్రిటన్‌కు భారత్ రెండో అతి పెద్ద మార్కెట్ అని, ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 20 బిలియన్ డాలర్ల పైగా ఉందని ఆయన చెప్పారు. గత తొమ్మిది త్రైమాసికాలుగా వాణిజ్యం నిలకడగా వృద్ధి చెందుతోందన్నారు. వాణిజ్య ఎగుమతులను ప్రోత్సహించడం కోసం బ్రిటన్‌లో యునైటెడ్ కింగ్‌డం హై కమిషన్‌ ప్రత్యేక రోడ్‌ షో కూడా నిర్వహించినట్లు డొమినిక్ చెప్పారు. భారత్‌లో అవకాశాల గురించి బ్రిటన్‌ కంపెనీలకు ఎప్పటికప్పుడు బ్రిటన్ హై కమిషన్‌ తెలియజేస్తూ ఉంటుందని తెలిపారు.



You may be interested

రిలయన్స్‌ ఇన్ఫ్రా 7 శాతం క్రాష్‌

Thursday 8th August 2019

క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో 5.50శాతం ర్యాలీ చేసిన రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ షేర్లు గురువారం నష్టాల బాట పట్టాయి. ఈ కంపెనీ షేర్లు నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.50.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ఆరంభం నుంచే నుంచే ఇన్వెస్టర్లు ఈ షేర్లకు అమ్మకాలకు మొగ్గుచూపడంతో షేరు ఒకదశలో 9శాతం నష్టపోయి రూ.46.05 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:15ని.లకు షేరు కిత్రం ముగింపు(రూ.50.25)తో పోలిస్తే 1శాతం నష్టంతో రూ.47.05

ఉత్పత్తి నాణ్యతకే ప్రధమ ప్రాధాన్యం

Thursday 8th August 2019

నచ్చకపోతే తిప్పి పంపేయడమే దేశంలో ఆన్‌లైన్‌ షాపర్ల ధోరణి యూపీఎస్‌ పల్స్‌ అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ: ఆకర్షణీయంగా కనిపించే వెబ్‌సైట్‌, ఆధునికతను ఒలకబోసే మొబైల్‌ యాప్‌... ఆన్‌లైన్‌ షాపర్లను ఆకర్షించేవి ఇవి కావట. ఫీజుల విషయంలో పారదర్శకత, డెలివరీపై నియంత్రణ, స్పష్టతతో కూడిన రిటర్న్‌ పాలసీ, లాయల్టీ రివార్డులు వీటికి ఆన్‌లైన్‌ షాపర్లు ప్రాధాన్యం ఇస్తున్నట్టు యూపీఎస్‌ సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్‌ షాపర్స్‌ పల్స్‌ అధ్యయనంలో తెలిసింది. ఆన్‌లైన్‌ రిటైలర్లకు తదుపరి హద్దులు ఇవేనని

Most from this category