STOCKS

News


ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ ఐపీవో.. ముఖ్యమైన వివరాలు..

Thursday 28th November 2019
news_main1574963324.png-29934

ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు చెందిన సబ్సిడరీ.. ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు (ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ) ఐపీవో సోమవారం (డిసెంబర్‌ 2న) ప్రారంభం కానుంది. 4వ తేదీన ఇష్యూ ముగుస్తుంది. రూ.750 కోట్లను ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా సమీకరించనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.36-37గా కంపెనీ ఖరారు చేసింది. ఒక రిటైల్‌ ఇన్వెస్టర్‌ కనీసం 400 షేర్లకు (ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక లాట్‌ కోసం పెట్టుబడి రూ.14,800 అవుతుంది. రిటైల్‌ కేటగిరీలో ఒకరు గరిష్టంగా 13 లాట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉ‍జ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వాటాదారుల కోసం 10 శాతం అంటే రూ.75 కోట్ల విలువ మేర షేర్లను రిజర్వ్‌ చేశారు. పైగా రూ.2 డిస్కౌంట్‌ కూడా ఒక్కో షేరుపై కంపెనీ ఆఫర్‌ చేస్తోంది.

 

ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు సూక్ష్మ రుణాలు, గ్రూపు రుణాలు, పర్సనల్‌, వ్యవసాయ, ఎంఎస్‌ఈ రుణాలు, అందుబాటు ధరల ఇళ్లకు రుణాలు, వాహన రుణాలను మంజూరు చేస్తుంటుంది. సేవింగ్స్‌, కరెంటు ఖాతాలు, డిపాజిట్‌ సేవలను కూడా ఆఫర్‌ చేస్తోంది. ఏటీఎం, ఆధార్‌ నమోదు సేవలతోపాటు, మూడో పార్టీ బీమా ఉత్పత్తుల మార్కెటింగ్‌ కార్యకలాపాల్లోనూ ఉంది. జూన్‌ నాటికి 4.72 మిలియన్‌ కస్టమర్లు బ్యాంకుకు ఉన్నారు. 474 బ్యాంకింగ్‌ కేంద్రాలను నిర్వహిస్తోంది. అలాగే బ్యాంకు నిర్వహణలో 387 ఏటీఎంలు కూడా ఉన్నాయి. 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోకి కార్యకలాపాలను విస్తరించింది. 

 

ఐపీవోకు ముందు షేర్ల కేటాయింపు ద్వారా బ్యాంకు రూ.250 కోట్ల నిధులను సమీకరించింది. ఒక్కో​ షేరును రూ.35కు సంస్థాగత ఇన్వెస్టర్లకు జారీ చేసింది. ప్రస్తుతం ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ క్యాపిటల్‌ అడెక్వసీ రేషియో 18.5 శాతం ఉండగా, ఐపీవో నిధుల సమీకరణ అనంతరం 22 శాతానికి చేరుతుంది. అలాగే, ఐపీవో అనంతరం బ్యాంకులో ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వాటా 95 శాతం నుంచి 85 శాతానికి తగ్గుతుంది. బ్యాంకు రుణాలు జూన్‌ 30 నాటికి రూ.11,783 కోట్లుగా ఉన్నాయి. డిపాజిట్లు రూ.7,956 కోట్లు. జూన్‌ త్రైమాసికంలో బ్యాంకు రూ.94.5 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. 2018-19లో బ్యాంకు లాభం రూ.199 కోట్లు. రుణ పుస్తకంలో స్థూల ఎన్‌పీఏలు జూన్‌ నాటికి 0.84 శాతంగా ఉన్నాయి. ఎంకే గ్లోబల్‌ విశ్లేషణ ప్రకారం.. ఐపీవోలో అధిక ధర రూ.37 అన్నది 2021 సెప్టెంబర్‌ నాటి అడ్జెస్టెడ్‌ బుక్‌ వ్యాల్యూ ప్రకారం 1.5 రెట్లకు సమానం.  You may be interested

నిఫ్టీ ర్యాలీ ఎక్కడి వరకు..?

Thursday 28th November 2019

మూడు వారాల కన్సాలిడేషన్‌ అనంతరం ఈ వారం మార్కెట్లు నూతన గరిష్టాలకు దూసుకెళ్లాయి. నిఫ్టీ 12,159 పాయింట్ల చారిత్రక స్థాయిని నమోదు చేసింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందానికి అవకాశాలు బలపడడం, ఎఫ్‌ఐఐల పెట్టుబడులు మార్కెట్ల ర్యాలీకి దోహద పడుతున్నాయి. మూడు వారాల కన్సాలిడేషన్‌ (స్థిరీకరణ) అనంతరం బ్రేకవుట్‌ కావడంతో నిఫ్టీ టార్గెట్‌ను రానున్న నెలలకు 12,400గా సవరిస్తున్నట్టు ఐసీఐసీఐ డైరెక్ట్‌ తెలిపింది.    ‘‘ప్రభుత్వం కార్పొరేట్‌ పన్ను తగ్గింపు తర్వాత..

రికార్డు ర్యాలీతో నవంబర్‌ సిరీస్‌ ముగింపు

Thursday 28th November 2019

  ఇంట్రాడేలో కొత్త గరిష్టాలను నమోదు చేసిన సూచీలు 12150 పైన ముగిసిన నిఫ్టీ సూచీలు నవంబర్‌ డెరివేటివ్‌ సీరీస్‌ను గురువారం రికార్డు ర్యాలీతో ముగించాయి. ప్రతీనెలా చివరి గురువారం ఆ నెల డెరివేటివ్‌ కాంట్రాక్టులకు ముగింపు రోజు. కాగా ఈ రోజు బ్యాంకింగ్‌, మెటల్‌, ఐటీ షేర్ల ర్యాలీతో వరుసగా రెండోరోజూ లాభాలతో ముగిశాయి. ఇంట్రాడేలో కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేయడంతో పాటు రెండోరోజూ కొత్త రికార్డుస్థాయిలోనే ముగియడం విశేషం.సెన్సెక్స్‌ 109 పాయింట్లు

Most from this category