News


ఎయిర్‌టెల్‌పై బుల్లిష్‌ అంటున్న బ్రోకరేజ్‌లు!

Wednesday 5th February 2020
news_main1580885321.png-31527

డిసెంబర్‌ త్రైమాసికంలో అంచనాలను అందుకోలేకపోయినా.. భారతీ ఎయిర్‌టెల్‌పై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌ ధోరణినే కొనసాగిస్తున్నాయి. క్యు3లో కంపెనీ రూ. 1035 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. త్వరలో మరిన్ని టారిఫ్‌ పెంపుదలలుంటాయని కంపెనీ సీఈఓ సంకేతాలు ఇచ్చారు. భవిష్యత్‌ టెక్నాలజీలపై వ్యయాలకోసం టారిఫ్‌లు పెంచకతప్పదన్నారు. దీంతో రాబోయే రోజుల్లో కంపెనీ బాలెన్స్‌ షీట్‌ మెరుగుపడుతుందన్న అంచనాలతో బ్రోకింగ్‌ సంస్థలు భారతీ ఎయిర్‌టెల్‌పై బుల్లిష్‌గా ఉన్నాయి.
= యూబీఎస్‌ సంస్థ ఎయిర్‌టెల్‌కు కొనొచ్చు రేటింగ్‌ను ఇచ్చింది. టార్గెట్‌ ధరను రూ. 615కు పెంచింది. టెలికం రంగంలో పునరుజ్జీవనం రానున్న సమీప భవిష్యత్‌లో ఎయిర్‌టెల్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. వొడాఫోన్‌ ఐడియా మనుగడ కష్టంగా మారే అవకాశాలున్నాయని, ఈ పరిస్థితి కంపెనీకి కలిసివస్తుందని అభిప్రాయపడింది. టెక్నికల్స్‌ కూడా మరింత ర్యాలీకే అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది.
= మోర్గాన్‌స్టాన్లీ సంస్థ ఎయిర్‌టెల్‌కు ఓవర్‌ వెయిట్‌ రేటింగ్‌ను ఇచ్చింది. టార్గెట్‌ రూ. 530గా పేర్కొంది. క్యు3లో కంపెనీ భారతీయ వ్యాపారాదాయాలు అంచనాలకన్నా అధికంగా ఉన్నాయని, ఏఆర్‌పీయూ సైతం ఆశ్యర్యపరిచిందని తెలిపింది. కంపెనీ ఎబిటా క్యు3లో 11.4 శాతం పెరిగిందని గుర్తు చేసింది. ఇటీవల టారిఫ్‌ పెంపు ప్రభావం ఇంకా పూర్తిగా బాలెన్స్‌ షీటులో కనిపించలేదని, భవిష్యత్‌లో ఈ పెంపు ప్రభావం ప్రతిబింబిస్తుందని వివరించింది. 



You may be interested

బజాజ్‌ ఆటోపై హెచ్‌ఎస్‌బీసీ బుల్లిష్‌

Wednesday 5th February 2020

హెచ్‌ఎస్‌బీసీ రీసెర్చ్‌ సంస్థ బజాజ్‌ ఆటోకు బై రేటింగ్‌ను ఇస్తూ, రూ.3600 వరకు పెరుగుతుందని అంచనా వేసింది. టూవీలర్‌ లేదా త్రీ వీలర్‌ ట్యాక్సీలను బ్యాన్‌ చేసే రిస్క్‌ ఉన్నప్పటికీ, వివిధ మార్గాల ద్వారా  బజాజ్‌ ఆటోకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నందున దీర్ఘకాలిక పెట్టుబడులకు డోకా ఉండదని షేర్లు కొనుగోలు చేయవచ్చని ఇన్వెస్టర్లకు సూచించింది. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌కు జెఫరీస్‌ హోల్డ్‌ రేటింగ్‌ పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు జెఫరీస్‌ బ్రోకరేజ్‌ సంస్థ

వర్థమాన మార్కెట్లలో భారత్‌ భేష్‌

Wednesday 5th February 2020

త్వరలోనే ఆర్థిక పురోభివృద్ధి! మోర్గాన్‌ స్టాన్లీ తాజా అంచనాలు వర్ధమాన మార్కెట్లలోకెల్లా భారత్‌ మెరుగైన ఫలితాలు ఇవ్వగలదని విదేశీ రీసెర్చ్‌ దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ తాజాగా పేర్కొంది. గత కొంతకాలంగా కార్పొరేట్‌ ఫలితాలు, ఆర్థిక వ్యవస్థ మందగమన సమస్యలు ఎదుర్కొంటున్న భారత్‌ త్వరలోనే వృద్ధి బాట పట్టగలదని అంచనా వేసింది. దీంతో దేశీ మార్కెట్లకు ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ను ఇస్తున్నట్లు మోర్గాన్‌ స్టాన్లీ విశ్లేషకులు జోనాథన్‌ గార్నర్‌ తెలియజేశారు. మోర్గాన్‌ స్టాన్లీలో ఏషియా, ఎమర్జింగ్‌

Most from this category