News


విశాఖలో ఉబెర్‌ ఎక్సలెన్స్‌ సెంటర్‌

Tuesday 3rd December 2019
news_main1575336215.png-30016

  •  2020 చివరికి 500 మందికి ఉపాధి

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ ట్యాక్సీ సేవల సంస్థ ‘ఉబెర్‌’.. విశాఖపట్నంలో తన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ)ను సోమవారం ప్రారంభించింది. ఈ కేంద్రం ఏర్పాటు నిమిత్తం రూ. 5.73 కోట్లను వెచ్చించినట్లు ప్రకటించింది. అత్యవసర సమస్యలను పరిష్కరించడం, ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించడం కోసం శిక్షణ పొందిన బృందాలు ఇక్కడ నుంచే నిరంతర సేవలను అందిస్తాయని వివరించింది.

ప్రస్తుతం ఈ కేంద్రంలో 70 మంది పనిచేస్తుండగా.. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి వీరి సంఖ్యను 120కి పెంచనున్నామని, ఇక ఏడాది చివరినాటికి మొత్తం 500 మందికి ఉపాధి లభించనుందని ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ సీనియర్‌ డైరెక్టర్‌ (కమ్యూనిటీ ఆపరేషన్స్‌ ఫర్‌ ఆసియా పసిఫిక్‌) వెన్‌ స్జూ లిన్‌ మాట్లాడుతూ.. ‘కస్టమర్లు, రైడర్లకు పూర్తిస్థాయి మద్దతును అందించడానికి ఏర్పాటుచేసిన ప్రత్యేక కేంద్రం ఇది. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న కేంద్రాన్ని విస్తరించడంలో భాగంగా ఇక్కడ సెంటర్‌ను ప్రారంభించం’ అని వ్యాఖ్యానించారు.   

ప్రపంచంలో 12వ సెంటర్‌
భారత్‌లో తన మొదటి కేంద్రాన్ని హైదరాబాద్‌లో 2015లో సంస్థ ఏర్పాటుచేసింది. ప్రస్తుతం 1,000 మంది ఉద్యోగులతో ఉబెర్‌ రైడర్స్, డ్రైవర్లు, కస్టమర్లు, కొరియర్, రెస్టారెంట్‌ భాగస్వాములకు ఇక్కడ నుంచే సేవలందిస్తోంది. ఓలాకు పోటీనివ్వడం కోసం తాజాగా రెండవ సెంటర్‌ను విశాఖలో ప్రారంభించింది. ప్రపంచంలోనే కంపెనీకి ఇది 12వ సెంటర్‌గా ప్రకటించింది. అమెరికాలో 2, యూరప్‌లో 4 సీఓఈ కేంద్రాలతో పాటు మధ్యప్రాచ్యం, ఆఫ్రికాల్లో ఇటువంటి కార్యాలయాలనే నిర్వహిస్తోంది. 



You may be interested

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దివాలా దరఖాస్తుకు ఎన్‌సీఎల్‌టీ ఓకే

Tuesday 3rd December 2019

ముంబై: దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌పై (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) దివాలా పరిష్కార చర్యలు చేపట్టాలని కోరుతూ ఆర్‌బీఐ దాఖలు చేసిన దరఖాస్తును జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) సోమవారం అనుమతించింది. ఈ పిటిషన్‌ ప్రవేశానికి అర్హమైనదని ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ స్పష్టం చేసింది. గృహ, ప్రాపర్టీ తనఖా రుణాల్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దేశంలోనే మూడో అతిపెద్ద సంస్థ కావడం గమనార్హం. ఈ సంస్థ రుణ చెల్లింపుల్లో విఫలం కావడంతో దివాలా అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌

ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల ‘డేటా బ్యాంక్‌’ ఆరంభం

Tuesday 3rd December 2019

న్యూఢిల్లీ: ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల వివరాలతో కూడిన సమగ్రమైన ‘డేటా బ్యాంక్‌’ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ డేటా బ్యాంక్‌లో ప్రస్తుతమున్న ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల వివరాలతో పాటు ఇండిపెండెంట్‌ డైరెక్టర్లయ్యే అర్హత గల వారి వివరాలను కూడా పొందుపరుస్తారు. కంపెనీలు ఏవైనా ఇండిపెండెంట్‌ డైరెక్టర్లను నియమించుకోవాలనుకుంటే ఈ డేటా బ్యాంక్‌ వాటికి ఉపయోగపడుతుంది. ఈ డేటా బ్యాంక్‌ పోర్టల్‌ను కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ఇండి యన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్పొరేట్‌

Most from this category