News


ఆర్థిక మోసాల నివారణకు ట్విట్టర్‌ కొత్త ఆస్త్రం

Wednesday 25th September 2019
news_main1569390805.png-28539

న్యూఢిల్లీ: ఆర్థిక మోసాలకు ట్విట్టర్‌ వేదిక కాకుండా చూసేందుకు ఆ సంస్థ నూతన విధానాన్ని ప్రకటించింది. ట్విట్టర్‌ సాయంతో వ్యక్తులు ప్రైవేటు ఆర్థిక సమాచారం పొందడం, నగదు పొందడం వంటి మోసపూరిత చర్యలను నిషేధించింది. మోసపూరిత, నిషేధిత  చర్యలను రిపోర్ట్‌ చేయాలనుకునే యూజర్లు... ట్విట్టర్‌ యాప్‌లోని మెనూలో ఉన్న రిపోర్ట్‌ట్విట్‌ ద్వారా తెలియజేయవచ్చని సూచించింది. ‘ఇట్స్‌ ఏ ఫైనాన్షియల్‌ స్కామ్‌’ ఆప్షన్‌ను ఎంచుకుని అనుమానిత ట్వీట్ల గురించి వివరంగా తెలియజేయవచ్చని పేర్కొంది. వ్యక్తుల మధ్య ఆర్థిక వివాదాల మధ్యలో జోక్యం చేసుకునేది లేదని ట్విట్టర్‌ స్పష్టం చేసింది. 



You may be interested

రిలయన్స్‌ చేతికి బజోడాట్‌ఏఐ

Wednesday 25th September 2019

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు  చెందిన అనుబంధ కంపెనీ హాప్‌టిక్‌, ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కన్వర్జేషనల్‌ కామర్స్‌ స్టార్టప్‌, బజోడాట్‌ఏఐను కొనుగోలు చేసింది. ఈ స్టార్టప్‌ కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలను హాప్టిక్‌ కంపెనీ వెల్లడించలేదు. ఈ స్టార్టప్‌ కొనుగోలుతో మరింత మెరుగైన వాయిస్‌, చాట్‌ కామర్స్‌ సొల్యూషన్స్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు అందజేయగలమని హాప్టిక్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్వపన్‌ రాజ్‌దేవ్‌ వెల్లడించారు. శామ్‌సంగ్‌, కేఎఫ్‌సీ, కోక-కోలా, ఓయో

యాంఫీ చైర్మన్‌గా నీలేష్ షా

Wednesday 25th September 2019

న్యూఢిల్లీ: అసోసియేష‌న్ ఆఫ్ మ్యూచువ‌ల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) నూతన చైర్మన్‌గా కోటక్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నీలేష్ షా ఎన్నికయ్యారు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఎండీ సీఈవో నిమేష్ షా స్థానంలో ఆయన ఎన్నికయ్యారు. ఇక వైస్‌ చైర్మన్‌గా ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ సీఈఓ సౌరభ్ నానావతి ఎన్నికైనట్లు యాంఫీ ప్రకటించింది. 

Most from this category