News


టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ ఆదాయం రూ.1,197 కోట్లు

Tuesday 16th April 2019
news_main1555394085.png-25159

5 శాతం పతనమైన షేర్‌

న్యూఢిల్లీ:- మీడియా కంపెనీ, టీవీ-18 బ్రాడ్‌కాస్ట్‌ లిమిటెడ్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో రూ.30 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.5 కోట్ల నికర లాభం వచ్చిందని టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.765 కోట్ల నుంచి రూ.1,197 కోట్లకు పెరిగింది. వయాకామ్‌​ 18 మీడియా, ఇండియాకాస్ట్‌ మీడియా డిస్ట్రిబ్యూషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లు గత ఏడాది మార్చి 1 నుంచి తమకు పూర్తి అనుబంధ సంస్థలుగా మారాయని కంపెనీ తెలియజేసింది. అందుకే ఈ క్యూ4 ఫలితాలను, గతేడాది ఫలితాలతో  పోల్చడం సరికాదని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభం 30 శాతం వృద్ధితో రూ.314 కోట్లకు పెరిగింది. నికర లాభం రూ.167 కోట్లుగా, నిర్వహణ ఆదాయం రూ.4,993 కోట్లుగా నమోదయింది.



You may be interested

శ్రీరామ్‌ ప్రొపర్టీస్‌ ఐపీఓకు సెబీ ఆమోదం

Tuesday 16th April 2019

ఇష్యూ సైజు రూ.1,250 కోట్లు  న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ శ్రీరామ్‌ ప్రొపర్టీస్‌ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ పచ్చజెండా ఊపింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.1,250 కోట్లు సమీకరిస్తుందని అంచనాలున్నాయి. ఈ విలువ పరంగా చూస్తే, ఈ కంపెనీ విలువ రూ.3,750 కోట్లని అంచనా. ఐపీఓ పత్రాలను గత ఏడాది డిసెంబర్‌లో సమర్పించిన ఈ కంపెనీ ఈ నెల 9న సెబీ

దేశీయంగా ఐవోసీ ట్రేడింగ్ డెస్క్‌

Tuesday 16th April 2019

స్పాట్‌ మార్కెట్లో ముడి చమురు కొనుగోలుకు ఏర్పాట్లు న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి రియల్‌ టైమ్ ప్రాతిపదికన ముడిచమురును కొనుగోలు చేసే దిశగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) దేశీయంగా ఢిల్లీలో ట్రేడింగ్ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. నాణ్యమైన ముఽడిచమురును మెరుగైన ధరకే దక్కించుకోవడం ద్వారా దిగుమతి వ్యయాలను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్‌) ఎ.కె.శర్మ తెలిపారు. ఐవోసీ ప్రస్తుతం తమ అవసరాల్లో 30 శాతాన్ని (15

Most from this category