News


ఓ మై గాడ్‌... యెస్‌ బ్యాంకు నుంచి వెంకన్నే రక్షించాడు!

Friday 6th March 2020
news_main1583466592.png-32314

  • యస్‌ బ్యాంకు పరిస్థితిపై ప్రమాద ఘంటికలు ముందస్తుగానే గుర్తించిన టీటీడీ ఛైర్మన్‌ 
  • కొన్ని నెలల కిందటే రూ.1300 కోట్ల డిపాజిట్ల ఉపంసహరణ

సాక్షి, అమరావతి: టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి ముందు చూపుతో తీసుకున్న నిర్ణయంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేటు రంగ యెస్‌ బ్యాంక్‌ నుంచి రూ.1300 కోట్ల విలువైన డిపాజిట్లను ఉపసంహరించుకొని వాటిని ప్రభుత్వరంగ బ్యాంకుల్లోకి మరలించారు. ప్రస్తుతం యెస్‌ బ్యాంక్‌ ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుపోవడంతో ఖాతాదారులు రూ.50,000 మించి తీసుకోవడానికి వీలు లేదంటూ ఆంక్షలు విధించింది. ఎటువంటి ఇబ్బందుల లేకుండా ముందస్తుగా రూ.1,300 కోట్లు ఉపసంహరించుకోవడంపై టీటీడీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ చైర్మన్‌గా వై.వి సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే టీటీడీ డిపాజట్లపై దృష్టిసారించారు. గత ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడి ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన విషయం తెలియడంతో దేవుడి సొమ్ముకు భద్రత లేదన్న విషయాన్ని గ్రహించి ఆ మొత్తాన్ని పటిష్టమైన ప్రభుత్వరంగ బ్యాంకులోకి తరలించారు. డిపాజిట్లు ఉపసంహరించుకోవద్దంటూ తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినా ఖాతరు చేయకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడి​‍్డ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ముఖ్యమంత్రికి దేవుడి సొమ్ము భద్రంగా ఉండాల్సిందేనని ఆదేశాలు ఇవ్వడంతో యెస్‌ బ్యాంకు నుంచి రూ.1,300 కోట్లు ఉపసంహరించుకున్నారు. 



You may be interested

యస్‌బ్యాంక్‌ షేరు టార్గెట్‌ రూ.1మాత్రమే..!

Friday 6th March 2020

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ, జేపీ మోర్గాన్‌ యస్‌ బ్యాంక్‌ షేర్‌ టార్గెట్‌ ధరను రూ.1కు (గతంలో రూ.55)కు తగ్గించింది. రేటింగ్‌ను అండర్‌ వెయిట్‌గా కొనసాగించింది. ప్రస్తుత ధర (రూ.37)కు బాగా ఎక్కువ డిస్కౌంట్‌కు కొత్త మూలధనం లభించే అవకాశాలున్నందున టార్గెట్‌ ధరను రూ.1కు తగ్గిస్తున్నామని జేపీ మోర్గాన్‌ వివరించింది. 

ప్రపంచ మార్కెట్లకు కరోనా షాక్‌

Friday 6th March 2020

గురువారం అమెరికా ఇండెక్సులు 3.5 శాతం పతనం  3-1 శాతంమధ్య పడిన యూరోపియన్‌ మార్కెట్లు ఆసియా మార్కెట్లలోనూ భారీ అమ్మకాల ఒత్తిడి ఆథిత్య రంగ, ట్రావెల్‌ కంపెనీ షేర్లు బోర్లా ప్రపంచ దేశాలపై సునామీలా విరుచుకు పడుతున్న కరోనా.. స్టాక్‌ మార్కెట్లలో కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా కరోనా మరణాలు 3,300కు చేరడం, న్యూయార్క్‌, శాన్‌ఫ్రాన్సిస్కోలలో కొత్త కేసులు నమోదుకావడంతో సెంటిమెంటుకు షాక్‌ తగిలినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఇప్పటికే అమెరికా సిలికాన్‌ వ్యాలీ, సియాటెల్‌లోని టెక్‌ కంపెనీలు

Most from this category