News


ఆగస్ట్‌లో 10వేల ఉద్యోగాలకు నష్టం

Friday 6th September 2019
news_main1567740380.png-28224

  • వాణిజ్య యుద్ధంతో అమెరికాలో పరిస్థితి

వాషింగ్టన్‌: చైనాతో అమెరికా వాణిజ్య పోరు అగ్ర దేశంలో ఉద్యోగాలకు గండి కొడుతోంది. ఆగస్ట్‌ నెలలో ఏకంగా 10,000కు పైగా ఉగ్యోగులను కేవలం  వాణిజ్య యుద్ధంతో ఎదుర్కొంటున్న ఇబ్బందుల కారణంగానే అమెరికన్‌ కంపెనీలు తొలగించుకోవాల్సి వచ్చినట్టు గ్రే అండ్‌ క్రిస్‌మస్‌ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. అంతేకాదు 2009 ఆగస్ట్‌ తర్వాత... ఇంతగా ఉద్యోగుల తొలగింపు ఈ ఏడాది ఆగస్ట్‌లోనే జరిగినట్టు గ్రే అండ్‌ క్రిస్‌మస్‌ సంస్థ అంటోంది. జూలైతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్ట్‌లో ఉగ్యోగాల కోత 38 శాతం పెరిగింది. మొత్తం మీద 53,480 మందిని పేరోల్స్‌ నుంచి తొలగించాయి. వాణిజ్య యుద్ధం, టారిఫ్‌ల ప్రభావం కంపెనీలపై చూపించడం ఆరంభమైందని గ్రే అండ్‌ క్రిస్‌మస్‌ సం‍స్థ వైస్‌ ప్రెసిడెంట్‌ యాండ్ర్యూ చాలెంజర్‌ పేర్కొన్నారు. తమ ఉత్పత్తులు, సేవలకు డిమాండ్‌ తగ్గడంతో ఉద్యోగులను తగ్గించుకునే పనిలో ఉన్నాయని చెప్పారు. అయితే, అమెరికాలో నిరుద్యోగ రేటు అన్నది చారిత్రకంగా కనిష్ట స్థాయిల్లోనే ప్రస్తుతానికి ఉండడం గమనార్హం. కాకపోతే నూతన ఉద్యోగాల కల్పన తగ్గింది. ముఖ్యంగా గత ఏడాది కాలంగా చైనాతో అమెరికా వాణిజ్య పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. 



You may be interested

ఇక రిటైల్‌లోనూ 59 నిమిషాల్లో...

Friday 6th September 2019

వ్యక్తిగత, గృహ రుణాలు ఇకపై మరింత సులభతరం త్వరలో ఆటో పరిశ్రమకు విస్తరణ ఇప్పటి వరకూ చిన్న పరిశ్రమలకే ఈ ప్రయోజనం న్యూఢిల్లీ: ‘59 నిమిషాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) రుణాలు’ పోర్టల్‌ సేవలు రిటైల్‌ రుణాలకూ విస్తరించడం జరిగింది. రిటైల్‌ రుణ లభ్యతకూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. గృహ, వ్యక్తిగత రుణ ప్రతిపాదనలకు ఈ పోర్టల్‌ ఇకపై అందుబాటులో ఉండనుంది. త్వరలో ఆటో రుణాలకు సంబంధించి

జియో ఫైబర్‌ వచ్చేసింది...

Friday 6th September 2019

న్యూఢిల్లీ: 4జీ మొబైల్‌ సేవల్లో చౌక టారిఫ్‌లతో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియో.. బ్రాడ్‌బాండ్‌ ఇంటర్నెట్‌లో మరొ కొత్త సంచలనానికి తెరతీసింది. దేశీ నెట్‌ వినియోగదారులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న జియో ఫైబర్‌ సేవలను దేశవ్యాప్తంగా 1,600 నగరాల్లో గురువారం ప్రారంభించింది. కనీసం 100 ఎంబీపీఎస్‌(మెగాబైట్స్‌ పర్ సెకన్‌) స్పీడు నుంచి గరిష్టంగా 1 జీబీపీఎస్‌(గిగాబైట్స్‌ పర్‌ సెకన్‌) స్పీడు వరకూ వివిధ రకాల ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. అన్‌లిమిటెడ్‌ బ్రాండ్‌బాండ్‌తో పాటు దేశంలో

Most from this category