STOCKS

News


భారత సీఈఓలతో 25న ట్రంప్‌ భేటీ

Saturday 15th February 2020
news_main1581737580.png-31810

  • ఢిల్లీలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీ కానున్నారు. ఇరు దేశాల వాణిజ్య బంధం మరింత బలపడటం కోసం ఫిబ్రవరి 25న ఢిల్లీలో ఆయన కార్పొరేట్‌ ప్రముఖులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్‌ భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆయన్ను కలిసేందుకు సిద్దంగా ఉన్న దిగ్గజ సీఈఓల జాబితాలను భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి పంపిదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక్కడ నుంచి ఈ జాబితా అనుమతి కోసం యూఎస్‌లోని వైట్‌హౌస్‌కు చేరింది. ట్రంప్‌ను కలవనున్న ప్రముఖుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అధిపతి ముకేశ్‌ అంబానీ, భారతీ ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ భారతీ మిట్టల్‌, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, లార్సెన్ అండ్‌ టూబ్రో చైర్మన్ ఏ.ఎం నాయక్, బయోకాన్ సీఎండీ కిరణ్‌ మజుందార్‌ షా ఉన్నారు. 



You may be interested

జీవీకే పవర్‌కు రూ.96 కోట్ల నష్టం

Saturday 15th February 2020

(అప్‌డేటెడ్‌...) హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీవీకే పవర్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో రూ.96 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.101 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. టర్నోవరు రూ.1,109 కోట్ల నుంచి రూ.1,156 కోట్లకు ఎగసింది. ఎయిర్‌పోర్టుల ఆదాయం రూ.930 కోట్ల నుంచి రూ.1,044 కోట్లకు చేరింది. 2019-20 తొమ్మిది నెలల్లో (ఏప్రిల్‌- డిసెంబరు)  రూ.3,257 కోట్ల

ఆరవ నెలా ‘ఎగుమతుల’ ఆందోళన!

Saturday 15th February 2020

వృద్ధిలేకపోగా -1.66 శాతం క్షీణత 25.97 బిలియన్‌ డాలర్లుగా నమోదు దిగుమతుల ఎనిమిది నెలల క్షీణబాట  విలువలో 41.14 బిలియన్‌ డాలర్లు వాణిజ్యలోటు 15.17 బిలియన్‌ డాలర్లు న్యూఢిల్లీ: దేశం నుంచి జరుగుతున్న ఎగుమతులపై ఆందోళన కొనసాగుతోంది. ఆరు నెలల నుంచీ వృద్ధిలేకపోగా జారుడు బల్లపై (క్షీణ బాటన) ఎగుమతులు కొనసాగుతుండడం దీనికి కారణం. తాజా సమీక్షా నెల- 2020 జనవరిని చూస్తే, 2019 ఇదే నెలతో పోల్చి ఎగుమతులు 1.66 శాతం క్షీణించాయి. విలువలో ఎగుమతుల

Most from this category