News


ట్రేడ్‌డీల్‌పై సంతకాలకు రెడీ!

Saturday 21st December 2019
news_main1576909713.png-30351

వాణిజ్యయుద్ధానికి ముగింపు పలుకుతూ తయారైన ట్రేడ్‌డీల్‌ తొలిదశ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు యూఎస్‌, చైనా తయారవుతున్నాయి. ఈమేరకు చైనా అధ్యక్షుడితో చర్చల అనంతరం అమెరికా అధ‍్యక్షుడు ట్రంప్‌ ఒక ప్రకటన చేశారు. ‘‘ట్రేడ్‌డీల్‌పై చైనా ప్రెసిడెంట్‌తో మంచి చర్చలు జరిగాయి. ఇ‍్పపటికే పలు అగ్రిఉత్పత్తులను భారీగా కొనేందుకు చైనా అంగీకరించింది. త్వరలో డీల్‌పై సంతకాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.’’అని ట్రంప్‌ ఒక ట్వీట్‌లో తెలిపారు. హాంకాంగ్‌, నార్త్‌కొరియాపై సైతం తామిరువురం చర్చించామన్నారు. తమ ట్రేడ్‌డీల్‌ రెండు దేశాలనే కాకుండా, ప్రపంచమంతటికీ మేలు చేస్తుందని చైనా అధ్యక్షుడు గ్జీపింగ్‌ చెప్పారు. పరస్పర గౌరవపూర్వకంగా ట్రేడ్‌డీల్‌ ఉంటుందన్నారు. డిసెంబర్‌ 13న ఈ ట్రేడ్‌డీల్‌ గురించి ట్రంప్‌ ప్రకటించారు. కొత్తగా చైనా ఉత్పత్తులపై సుంకాలు వేయబోవడం లేదని ఆనాడు చెప్పారు. ట్రేడ్‌డీల్‌ తొలిదశ ఒప్పందంపై తాను, చైనా నుంచి వైస్‌ప్రీమియర్‌ లీహి వచ్చే జనవరిలో సంతకాలు చేయవచ్చని యూఎస్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ రాబర్ట్‌లైట్జర్‌ ప్రకటించారు. సంతకాలకు మందు ఇరుదేశాల న్యాయనిపుణులు ఒప్పందాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారన్నారు. సంతకాల తర్వాత 30 రోజుల్లో డీల్‌ అమల్లోకి వస్తుందన్నారు. ప్రస్తుతం ఇరు పక్షాలు ముసాయిదాలను ఇచ్చిపుచ్చుకుంటున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. జనవరి ప్రథామర్ధంలో ఇవి ఒక కొలిక్కి వస్తాయని ఎక్కువమంది అంచనా వేస్తున్నారు. 



You may be interested

బీపీసీఎల్‌ కొనేందుకు తప్పక పోటీపడతాం!

Saturday 21st December 2019

వేదాంత చీఫ్‌ అనిల్‌ అగర్వాల్‌ భారత పెట్రోలియ కార్పొరేషన్‌ కొనుగోలుకు తప్పక పోటీపడతామని, బీపీసీఎల్‌ ఆఫర్‌కు తప్పక బిడ్‌ వేస్తామని వేదాంత రిసోర్సెస్‌ చీఫ్‌ అనిల్‌ అగర్వాల్‌ చెప్పారు. బీపీసీఎల్‌లో 53.29 శాతం వాటా విక్రయానికి ఇటీవలే కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ‘‘బిడ్స్‌పై పరిశీలిన జరుపుతున్నాం, దేశీయ చమురు, సహజవాయువు ఉత్పత్తిలో మాకు 30 శాతం వాటా ఉంది, ఈ వ్యాపారంలో చాలా సంవత్సరాలుగా ఉన్నాం. అందువల్ల ఈ

1480డాలర్ల వద్ద స్థిరపడిన పసిడి

Saturday 21st December 2019

అమెరికా మూడో త్రైమాసికపు వృద్ధి గణాంకాలు మార్కెట్‌ అంచనాలను అందుకోవడంతో పసిడి ధర శుక్రవారం నష్టాలతో ముగిసింది. అమెరికాలో రాత్రి ఔన్స్‌ పసిడి ధర 3.50డాలర్లు  పతనమై 1,480.90డాలర్ల వద్ద స్థిరపడింది. అమెరికా చైనాల మధ్య పాక్షిక ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని కనబరుస్తోంది. ఫలితంగా ఇన్వెస్టర్లు రిస్క్‌ అసెట్స్‌లైన  ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గచూపుతుండంతో పసిడికి డిమాండ్‌ తగ్గుతోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు

Most from this category