News


భారత పర్యటనలో వాణిజ్య ఒప్పందం ఉండకపోవచ్చు

Thursday 20th February 2020
news_main1582167801.png-31945

(అప్‌డేటెడ్‌...) 

  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన

వాషింగ్టన్‌: వాణిజ్యం విషయంలో భారత్‌ సరిగ్గా వ్యవహరించడం లేదని ట్రంప్‌ ఆరోపించారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోపు భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదరకపోవచ్చన్న సంకేతం ఇచ్చారు. ‘‘భారత దేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకోవచ్చు. అయితే, తర్వాత కోసం దీన్ని పొదుపు చేస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్‌ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నారా? అన్న మీడియా ప్రశ్నకు ట్రంప్‌ స్పందించారు. భారత్‌ మాతో సరిగ్గా వ్యవహరించడం లేదన్నారు. ఇతర దేశాలతో వాణిజ్యం విషయంలో అమెరికా ప్రయోజనాలే పరమావధిగా ట్రంప్‌ వ్యవహరిస్తున్న విషయం ప్రపంచానికి తెలిసిందే. ఈ విషయంలో భారత్‌ను మొదటి నుంచి ఆయన విమర్శిస్తూనే ఉన్నారు. ‘‘భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటాం. ఇది మాకు అవసరం. అయితే, ఎన్నికల ముందు ఇది జరుగుతుందా అన్నది నాకు తెలియదు. కానీ, భారత్‌తో మాకు భారీ వాణిజ్య ఒప్పందం అయితే ఉంటుంది’’ అంటూ కర్ర విరగకుండా, పాము చావకుండా రీతిలో ట్రంప్‌ చెప్పారు. ఇరు దేశాల మధ్య ట్రంప్‌ పర్యటనలో భాగంగా ఒప్పందం కుదురొచ్చన్న అంచనాలు ఇప్పటికే వ్యక్తమవుతుండడం గమనార్హం. భారత్‌తో వాణిజ్య చర్యలకు నాయకత్వం వహిస్తున్న అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్‌ లైట్‌జర్‌ ట్రంప్‌తో కలసి భారత పర్యటనకు రాకపోవచ్చని తెలుస్తోంది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌, లైట్‌జర్‌ మధ్య ఇప్పటికే పలు విడతలుగా వాణిజ్య చర్చలు జరిగాయి. తమ దేశ పాడి, పౌల్ట్రీ, వైద్య పరికరాలకు మరింత మార్కెట్‌ అవకాశాలు కల్పించాలని అమెరికా డిమాండ్‌ చేస్తోంది.
మోదీ అంటే ఎంతో ఇష్టం...
ప్రధానమంత్రి మోదీ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు ట్రంప్‌. భారత పర్యటనలో భాగంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నూతనంగా నిర్మించిన మొతెరా స్టేడియంలో ఇరు దేశాధి నేతలతో భారీ సభ జరగనుంది. దీని గురించి ట్రంప్‌ మాట్లాడుతూ..‘‘విమానాశ్రయం, కార్యక్రమం జరిగే ప్రాంతానికి మధ్య ఏడు మిలియన్ల ప్రజలు ఉంటారని ఆయన (మోదీ) నాకు చెప్పారు. ఆ స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్దదిగా అవతరించనుంది. ఇది ఎంతో ఆసక్తి కలిగిస్తోంది. మీరు కూడా దీన్ని ఆనందిస్తారు’’ అని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ట్రంప్‌ అన్నారు.  You may be interested

విమానాల్లో నెల్కో వై-ఫై సర్వీసులు

Thursday 20th February 2020

విస్తార ఎయిర్‌లైన్స్‌తో ప్రారంభం న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌లో భాగమైన నెల్కో సంస్థ తాజాగా విమానాల్లో వై-ఫై సర్వీసులు ఆవిష్కరించింది. విస్తార ఎయిర్‌లైన్స్‌ ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తేనుంది. తద్వారా విస్తార.. దేశీయంగా ఇన్‌-ఫ్లయిట్ వై-ఫై సర్వీసులు (ఐఎఫ్‌సీ) అందిస్తున్న తొలి విమానయాన సంస్థ కానుంది. పానసోనిక్ ఏవియోనిక్స్‌తో కలిసి ఈ సేవలు అందిస్తున్నట్లు నెల్కో ఎండీ, సీఈవో పీజే నాథ్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఐఎఫ్‌సీకి భారీ అవకాశాలు ఉన్నాయని,

కోవిడ్‌ భయం... పసిడి పరుగు

Thursday 20th February 2020

అంతర్జాతీయంగా సరికొత్త గరిష్టస్థాయి ఔన్స్‌ 1,614 డాలర్లపైకి అప్‌ ఏడేళ్ల గరిష్ట స్థాయి న్యూయార్క్‌: చైనాలో మొదలై ప్రపంచాన్ని భయపెడుతున్న కోవిడ్‌-19 (కరోనా) వైరెస్‌... ఇన్వెస్టర్లను బంగారంవైపు తిరిగేలా చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ పెట్టుబడులకు బంగారమే సురక్షిత మార్గమని వారు భావిస్తున్నారు. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌- న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్స్చేంజ్‌- నైమెక్స్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర బుధవారం ట్రేడింగ్‌ ఒక దశలో 1,614.25 డాలర్లను తాకింది. ఇది ఏడేళ్ల కనిష్టస్థాయి. ఈ

Most from this category