News


ట్రూజెట్‌... చిల్డ్రన్స్‌ డే ప్రయాణం!

Thursday 15th November 2018
news_main1542258578.png-22026

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విమానయాన రంగ సంస్థ ‘ట్రూజెట్‌’ పేద పిల్లలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. 40 మంది పిల్లలను బుధవారం ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి సేలంకు తీసుకెళ్లింది. వీరంతా తమిళనాడుకు చెందిన ఎస్‌ఆర్‌వీవీ పాఠశాల విద్యార్థులు. వెల్లప సెంబనా గౌండర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ సాయంతో పిల్లలకు విమానయాన అవకాశం కలిగింది. ‘వింగ్స్‌ ఆఫ్‌ హోప్‌’ కార్యక్రమం కింద ఏటా 300 మంది పేద పిల్లలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని ట్రూజెట్‌ను ప్రమోట్‌ చేస్తున్న టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ కమర్షియల్‌ హెడ్‌ సెంథిల్‌ రాజా ఈ సందర్భంగా తెలియజేశారు.



You may be interested

ఫ్యూచర్‌ రిటైల్‌ లాభం రూ.175 కోట్లు

Thursday 15th November 2018

న్యూఢిల్లీ: బిగ్‌ బజార్‌, ఎఫ్‌బీబీ, ఈజీడే, హెరిటేజ్‌ తదితర దుకాణాలను నిర్వహించే కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ రిటైల్‌ సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.175.1 కోట్ల స్టాండలోన్‌ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.153 కోట్ల లాభంతో పోలిస్తే 14 శాతానికి పైగా పెరిగింది. మొత్తం ఆదాయం సైతం రూ.4,506 కోట్ల నుంచి రూ.4,928 కోట్లకు వృద్ధి చెందింది. ఫ్యూచర్‌ రిటైల్‌కు దేశవ్యాప్తంగా 373 పట్టణాల్లో పలు

43 శాతం తగ్గిన సువెన్‌ లాభం

Thursday 15th November 2018

సెప్టెంబరు క్వార్టరు స్టాండలోన్‌ ఫలితాల్లో సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే 43 శాతం తగ్గి రూ.18 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.112 కోట్ల నుంచి రూ.96 కోట్లకు వచ్చి చేరింది. ఏప్రిల్‌-సెప్టెంబరులో రూ.296 కోట్ల టర్నోవరుపై రూ.57 కోట్ల నికరలాభం ఆర్జించింది. బీఎస్‌ఈలో బుధవారం కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 1.92 శాతం తగ్గి రూ.247.75 వద్ద స్థిరపడింది.

Most from this category