News


ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభం .. బ్యాంకులకు వరం

Wednesday 3rd October 2018
news_main1538542642.png-20812

ముంబై: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) సంక్షోభం మరింతగా ముదురుతుండటం.. వాణిజ్య బ్యాంకులకు వరంగా మారొచ్చని సింగపూర్‌కి చెందిన బ్రోకింగ్ సంస్థ డీబీఎస్ ఒక నివేదికలో పేర్కొంది. దీన్ని అవకాశంగా మల్చుకుని బ్యాంకులు మళ్లీ కార్పొరేట్ల రుణాల మార్కెట్లో తమ వాటాను పెంచుకునేందుకు ప్రయత్నించవచ్చని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల రుణ అవసరాలు తీర్చేందుకు బ్యాంకులే ప్రధాన వనరుగా మారవచ్చని వివరించింది. మొండిబాకీల సమస్యలతో 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ఆర్‌బీఐ ఆంక్షలు ఎదుర్కొంటున్నప్పటికీ ఇది సాధ్యమేనని డీబీఎస్ పేర్కొంది. 2016 ఆర్థిక సంవత్సరంలో వ్యాపార సంస్థలకు రుణాల్లో బ్యాంకుల మార్కెట్ వాటా 55 శాతంగా ఉండగా.. 2017 ఆర్థిక సంవత్సరంలో 34 శాతానికి తగ్గింది. మళ్లీ 2018 ఆర్థిక సంవత్సరంలో 50 శాతానికి చేరిందని డీబీఎస్‌ వివరించింది. 



You may be interested

మరో విడత ‘వడ్డి’ంపు!

Wednesday 3rd October 2018

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అక్టోబర్‌ 3,4,5వ తేదీల్లో జరపనున్న ద్రవ్య, పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు) నిర్ణయం వైపే మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.  అరశాతం వరకూ పెంచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదే జరిగితే ఈ రేటు 6.5 శాతం నుంచి 7 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది

జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు..!

Wednesday 3rd October 2018

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు వచ్చే నెలలో రూ.లక్ష కోట్లను మించిపోయే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వరుసగా నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో జీఎస్‌టీ ఆదాయం లక్ష కోట్ల మార్కును దాటిపోయే సూచనలు కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. పండుగల సీజన్‌ కావడం వల్ల ఈ రెండు నెలల్లో వస్తు, సేవల డిమాండ్‌ పెరిగి వసూళ్లు ఊపందుకోనున్నాయని భావిస్తోన్న ఆర్థిక

Most from this category