News


పీడబ్ల్యూసీపై సెబీ నిషేధాన్ని కొట్టివేసిన శాట్‌

Tuesday 10th September 2019
news_main1568089952.png-28278

  • ఆడిటర్లపై ఐసీఏఐ మాత్రమే చర్యలు తీసుకోగలదు
  • ఆ అధికారం సెబీకి లేదని శాట్‌ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ (పీడబ్ల్యూసీ) ఇండియాకు ఊరట లభించింది. లిస్టెడ్‌ కంపెనీలకు ఆడిటింగ్‌ సేవలు అందించకుండా ఆ సంస్థ విభాగంపై సెబీ విధించిన నిషేధాన్ని సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) కొట్టివేసింది. ఆడిటింగ్‌ సంస్థను నిషేధించే అధికారం సెబీకి లేదని స్పష్టం చేసింది. కేవలం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ (ఐసీఏఐ) మాత్రమే ఆడిటర్లపై చర్యలు తీసుకోగలదని పేర్కొంది. ఆడిటింగ్‌లో నిర్లక్ష్యం ఆధారంగా ఆర్థిక మోసాలను నిరూపించలేరని శాట్‌ అభిప్రాయపడింది. ఎటువంటి ప్రత్యక్ష ఆధారాలు లేకుండా సెబీ తీసుకున్న చర్యలు చెల్లుబాటు కావని పేర్కొంది. లిస్టెడ్‌ కంపెనీలకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఆడిటింగ్‌ సర్టిఫికెట్‌లు జారీ చేయకూడదంటూ పీడబ్ల్యూసీకి చెందిన సంస్థలపై రెండేళ్లపాటు నిషేధం విధిస్తూ సెబీ 2018 జనవరిలో ఆదేశాలు జారీ చేసింది. 2009 జనవరి 8న సత్యం కంప్యూటర్స్‌ ఖాతాల్లో అక్రమాలు ఉన్నాయని, కొంత కాలంగా పుస్తకాల్లో రూ.5,004 కోట్ల మేర వాస్తవాలను దాచిపెట్టినట్టు ఆ సంస్థ చైర్మన్‌ రామలింగ రాజు స్వయంగా బయటపెట్టారు. ఈ కేసులో ఆడిటింగ్‌ కంపెనీ పాత్ర ఉందని సెబీ దర్యాప్తులో తేలింది. పీడబ్ల్యూసీ బెంగళూరుతోపాటు, ఆ సంస్థ భాగస్వాములు ఎస్‌ గోపాలకృష్ణన్‌, శ్రీనివాస్‌ తాళ్లూరి ఐసీఏఐ ఆడిటింగ్‌ ప్రమాణాల మేరకు నడుచుకోలేదని సెబీ గుర్తించింది. సెబీ ఆదేశాలను పీడబ్ల్యూసీ శాట్‌లో సవాలు చేసింది. పీడబ్ల్యూసీ బెంగళూరు విభాగం ఉల్లంఘనలతో సంబంధం లేకపోయినా కానీ, పీడబ్ల్యూసీకి చెందిన ఇతర అన్ని విభాగాలను శిక్షించడం తగదని వాదించింది. దీంతో శాట్‌ సెబీ ఆదేశాలను కొట్టివేసింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కుంభకోణంలో రెండు అతిపెద్ద ఆడిటింగ్‌ సంస్థలైన డెలాయిట్‌, బీఎస్‌ఆర్‌ (కేపీఎంజీ సంస్థ)ల పాత్రపై నియంత్రణ సంస్థలు, ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తు జరుగుతున్న సమయంలో శాట్‌ ఈ తరహా ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఎందుకంటే ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఖాతాల్లో లోపాలను బయటపెట్టడంలో విఫలమైన డెలాయిట్‌, కేపీఎంజీలపై ఐదేళ్ల పాటు నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్లు ఎన్‌సీఎల్‌టీ, బోంబే హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉండడం గమనార్హం. 
ఇతరుల అధికార పరిధిలోకి చొరబడరాదు
భవిష్యత్తులో సెబీ నిర్ణయాలను ప్రభావితం చేసే విధంగానూ శాట్‌ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇతర నియంత్రణ సంస్థలు లేదా ఐసీఏఐ వంటి పరిశ్రమ బాడీల అధికార పరిధిలోకి చొరబడరాదని స్పష్టం చేసింది. ప్రస్తుత చట్టాల ప్రకారం సెబీ ఉద్దేశ్యం ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడడమేనని, కనుక ఇచ్చే ఆదేశాలు చికిత్స చేసే విధంగా ఉండాలే కానీ శిక్షించే విధంగా కాదని పేర్కొంది. You may be interested

బీమా వ్యాపారాలను ఏం చేస్తారు

Tuesday 10th September 2019

ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనంతో చిక్కు! 10 పీఎస్‌బీలను విలీనం చేయనున్న కేంద్రం వీటిల్లో పలు బ్యాంకులకు బీమా వ్యాపారాలు విలీనానంతర బ్యాంకుకు ఒకటికి మించిన కంపెనీల్లో వాటాలు నిబంధనల ప్రకారం ప్రమోటర్‌గా ఒక కంపెనీకే ఒక సంస్థలో వాటాలు విక్రయించడం లేదంటే రెండింటిలోనూ మైనారిటీ వాటాలు న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీలు) మధ్య మెగా విలీనానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, ఆయా బ్యాంకులు నిర్వహిస్తున్న బీమా, ఇతర ఆర్థిక వ్యాపారాల పరిస్థితి ఏంటన్న సందేహం తలెత్తుతోంది. 10 ప్రభుత్వరంగ బ్యాంకులను

ఆంధ్రాబ్యాంక్‌ విలీనానికి యూనియన్‌ బ్యాంక్‌ బోర్డ్‌ ఓకే

Tuesday 10th September 2019

రూ.17,200 కోట్ల పెట్టుబడుల సమీకరణకు కూడా  సోమవారం నాటి సమావేశంలో ఆమోదం తెలిపిన బోర్డ్‌ న్యూఢిల్లీ: ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌లను విలీనం చేసుకోవడానికి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.17,200 కోట్ల నిధుల సమీకరణ ప్రతిపాదనను కూడా డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదించిందని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. సోమవారం జరిగిన బోర్డ్‌ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని

Most from this category