టారిఫ్ నిబంధనలు దుర్వినియోగం చేశారు
By Sakshi

న్యూఢిల్లీ: టీవీ చానళ్ల సిసలైన మార్కెట్ రేటును కనుగొనేందుకు లేకుండా బ్రాడ్‌కాస్టర్స్, ఆపరేటర్లు (డీపీవో) కొత్త టారిఫ్ ఆర్డరును దుర్వినియోగం చేశారంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ వ్యాఖ్యానించింది. చానళ్ల ఎంపిక, చార్జీలపరంగా కొత్త సమస్యలపై సంబంధిత వర్గాలు అభిప్రాయాలు తెలపాలంటూ కోరింది. టీవీ రంగంలో వ్యాపార ప్రక్రియలు క్రమబద్ధీకరించేందుకు, వివిధ వర్గాల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు, చానళ్ల చార్జీల విషయంలో పారదర్శకత తెచ్చేందుకు కొత్త నిబంధనలు ఉపకరించినా.. కస్టమర్లు తాము కోరుకున్న చానళ్లను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లభించకుండా పోయిందని ట్రాయ్ పేర్కొంది. టీవీ వీక్షకులు తాము కోరుకున్న చానళ్లు మాత్రమే పొందేందుకు, నెలవారీ బిల్లులు తగ్గించుకునేందుకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో గతేడాది డిసెంబర్ నుంచి ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే, బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు భారీ డిస్కౌంటులకు బొకేలను ఆఫర్ చేస్తుండటం తదితర అంశాల కారణంగా ఆయా చానళ్ల అసలు మార్కెట్ రేటును తెలుసుకునే అవకాశం లేకుండా పోతోందని తాజాగా ట్రాయ్ పేర్కొంది. పైపెచ్చు స్వల్ప మార్పులతో బొకేలను ఆఫర్ చేస్తుండటం యూజర్లను గందరగోళంలో పడేస్తోందని అభిప్రాయపడింది.
You may be interested
జెట్ ఎయిర్వేస్ ఫలితాలు ఆలస్యం !
Saturday 17th August 2019న్యూఢిల్లీ: విమానయాన సంస్థ, జెట్ ఎయిర్వేస్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి ఆలస్యం కానున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ కంపెనీ తన కార్యకలాపాలను నిలపేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కంపెనీపై దివాళా ప్రక్రియ నడుస్తోంది. దివాలా చట్టం కింద రిజల్యూషన్ ప్రక్రియను రిజల్యూషన్ ప్రొఫెషనల్ ఆశీష్ చౌచారియా నిర్వహిస్తున్నారు. కంపెనీ ఎదుర్కొంటున్న వివిధ సమస్యల కారణంగా ఆర్థిక ఫలితాల వెల్లడి
భారత్‌కు మళ్లీ వస్తాం..!
Saturday 17th August 2019ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో కొత్త ట్రెండ్ తిరిగి ప్రవేశిస్తున్న టీవీ కంపెనీలు స్మార్ట్‌ఫోన్స్ బ్రాండ్లదీ అదే దారి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో 135 కోట్లు దాటిన జనాభా. కోట్లాది మంది యువ కస్టమర్లు. ఉద్యోగులు, వ్యాపారులకు పెరుగుతున్న వ్యయం చేయదగ్గ ఆదాయం. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకునే వినియోగదార్లు.. ఇంకేముంది ఈ అంశాలే తయారీ, రిటైల్ కంపెనీలకు భారత మార్కెట్ బంగారు బాతుగా నిలుస్తోంది. ముఖ్యంగా టెలివిజన్, స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థలకైతే ఇండియా ప్రధాన మార్కెట్