News


డిసెంబర్15 దాకా పోర్టబిలిటీ నిలిపివేత

Wednesday 11th December 2019
news_main1576035307.png-30165

  • ఈ నెల 16 నుంచి కొత్త ఎంఎన్‌పీ నిబంధనలు

న్యూఢిల్లీ: మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) ప్రక్రియకు సంబంధించి కొత్త నిబంధనలు డిసెంబర్ 16 నుంచి అమల్లోకి రానున్నట్లు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. పాత వ్యవస్థ నుంచి కొత్త వ్యవస్థకు మారే క్రమంలో డిసెంబర్‌ 10 నుంచి 15 దాకా ఎంఎన్‌పీ సదుపాయం అందుబాటులో ఉండదని, ప్రత్యేక పోర్టింగ్ కోడ్ (యూపీసీ) కూడా జనరేట్ కాదని పేర్కొంది. అయితే, ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల ప్రాసెసింగ్ ప్రక్రియ మాత్రం కొనసాగుతుందని వివరించింది. కొత్త నిబంధనల ప్రకారం అర్హులైన సబ్‌స్క్రయిబర్స్‌కి మాత్రమే యూపీసీ జనరేట్ అవుతుంది. ఉదాహరణకు.. పోస్ట్ పెయిడ్ మొబైల్ కనెక్షన్ గల సబ్‌స్క్రయిబర్‌.. ప్రస్తుత టెలికం సంస్థ బకాయిలన్నీ కట్టేశాకే, కొత్త టెల్కోకు మారేందుకు పోర్టబిలిటీ కోడ్ వస్తుంది. జమ్మూ కశ్మీర్‌, అసోం, ఈశాన్య రాష్ట్రాలు మినహా మిగతా అన్ని సర్కిల్స్‌లో దీనికి నాలుగు రోజుల వేలిడిటీ ఉంటుంది. జమ్మూ తదితర రాష్ట్రాల్లో 30 రోజుల వేలిడిటీ ఉంటుంది. ఒక సర్వీస్ ఏరియాలో పోర్టింగ్ అభ్యర్ధనను మూడు పనిదినాల్లో,  వేర్వేరు సర్కిల్స్‌లో అయిదు పని దినాల్లో ప్రాసెస్ చేయాలి. కార్పొరేట్ మొబైల్ కనెక్షన్ల పోర్టబిలిటీ గడువులో ఎలాంటి మార్పులు ఉండవు. 



You may be interested

రేటు తగ్గింపు వరుసలో మరో మూడు బ్యాంకులు

Wednesday 11th December 2019

యూబీఐ, బీఓబీ, యుకో బ్యాంకుల నిర్ణయం న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సోమవారం రేటు తగ్గించిన నేపథ్యంలో... ఇదే బాటలో మంగళవారం మరో మూడు బ్యాంకులు చేరాయి. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) యుకో బ్యాంకులు తమ నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను స్వల్పంగా తగ్గించాయి.  యూబీఐ విషయంలో రేటు తగ్గింపు 5 నుంచి 10 బేసిస్‌

పార్క్‌ హయత్‌లో ఐవోటీ ఆధారిత వాటర్‌ ప్లాంట్‌

Wednesday 11th December 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రముఖ హాస్పిటాలిటీ కంపెనీ హయత్‌ హోటల్స్‌ కార్పొరేషన్‌ దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) ఆధారిత వాటర్‌ ప్యూరిఫికేషన్, గాజు బాటిల్స్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ‘వాటర్‌హెల్త్‌ ఇండియా’తో ఒప్పందం చేసుకుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలను పునర్వినియోగించడం, నీటిని ఆదా చేయడం ఈ యూనిట్‌ ప్రత్యేకతని పార్క్‌ హయత్‌ సౌత్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ థామస్‌

Most from this category