News


టయోటా, సుజుకీ జట్టు

Thursday 29th August 2019
news_main1567060577.png-28087

  • సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీ కోసం భాగస్వామ్యం

టోక్యో: జపాన్‌కు చెందిన వాహన దిగ్గజం టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం).. మరో వాహన కంపెనీ సుజుకీ మోటార్ కార్ప్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు బుధవారం ప్రకటించింది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీ కోసమే పోటీ కంపెనీలో వాటాను కొనుగోలు చేసి జట్టుకట్టినట్లు వివరించింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన తాజా ఒప్పందం ప్రకారం.. సుజుకీ మోటార్ కార్ప్‌లో 4.9 శాతం వాటాను (908 అమెరికా డాలర్లు, జపాన్‌ కరెన్సీ విలువ పరంగా 96 బిలియన్‌ ఎన్‌) టయోటా కైవసంచేసుకోనుంది. ఇదే క్రమంలో సుజుకీ, టయోటాలో 454 అమెరికా డాలర్లు (48 బిలియన్‌ ఎన్‌) పెట్టుబడి పెట్టనుంది. కృత్రిమ మేధ వంటి అధునాతన టెక్నాలజీలో ఉండే భారీ వ్యయాలను తట్టుకోవడం కోసం ఇరు సంస్థలు జట్టుకట్టినట్లు పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక 2017లో జరిగిన ఒప్పందానికి అనుగుణంగా.. సుజుకీ బలంగా ఉన్న భారత మార్కెట్లో రెండు సంస్థలు పరస్పర సహకారాన్ని అందించుకుంటున్నాయి. 



You may be interested

అంత డబ్బు ఎలా ఇచ్చేస్తారండీ!

Thursday 29th August 2019

కేంద్రానికి ఆర్‌బీఐ అదనపు నిధుల బదలాయింపుపై బ్యాంకింగ్‌ సంఘం విమర్శ ఇది తీవ్ర ఆందోళనకరం ఆర్‌బీఐ కేంద్రానికి బ్రాంచ్‌ ఆఫీస్‌ కారాదు న్యూఢిల్లీ: కేంద్రానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) భారీ నిధుల బదలాయింపుపై అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆర్‌బీఐ అదనపు నిధుల బదలాయింపును ప్రస్తావిస్తూ, ‘‘ఇది తీవ్ర ఆందోళనకర అంశం’’ అని పేర్కొంది. ఆర్థిక మంత్రిత్వశాఖకు ఆర్‌బీఐ అదనపు బ్రాంచ్‌ ఆఫీస్‌ (ఎక్స్‌టెన్షన్‌

ఎలక్ట్రిక్‌ కార్ల ధరలు తగ్గుతాయి: నీతీ ఆయోగ్‌

Thursday 29th August 2019

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ కార్ల ధరలకే ఎలక్ట్రిక్‌ కార్ల ధరలు దిగివస్తాయని నీతీ ఆయోగ్‌ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు. బ్యాటరీల ధరలు గణనీయంగా తగ్గుతునందున భారత్‌ వీటి వినియోగం దిశగా మార్పుకు సిద్ధంకావాలన్నారు. వచ్చే 3-4 ఏళ్లలో ఇతర ఇంధన ధరల కార్లకే ఎలక్ట్రిక్‌ కార్ల ధరలు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ‘బ్యాటరీ వ్యయం బాగా తగ్గింది. గతంలో 267 అమెరికా డాలర్లుగా ఉన్న కిలోవాట్‌ అవర్‌ (కేడబ్ల్యూహెచ్‌)

Most from this category