News


అదానీ గ్యాస్‌లోకి ‘టోటల్‌’

Tuesday 15th October 2019
Markets_main1571113215.png-28884

  • 37.4 శాతం కొనుగోలు చేసిన ఫ్రాన్స్‌ ఇంధన దిగ్గజం
  • డీల్‌ విలువ రూ. 5,700 కోట్లు

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కి చెందిన ఇంధన రంగ దిగ్గజం టోటల్ ఎస్‌ఏ తాజాగా దేశీ దిగ్గజ సంస్థ అదానీ గ్యాస్‌లో 37.4 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ సుమారు రూ. 5,700 కోట్లు ఉండవచ్చని అంచనా. రిటైల్ స్థాయిలో వాహనాలకు గ్యాస్ విక్రయించడానికి దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 68 పట్టణాల్లో 1,500 సీఎన్‌జీ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు, వచ్చే పదేళ్లలో 60 లక్షల కుటుంబాలకు పైప్‌ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేసేందుకు ఈ డీల్ తోడ్పడనుందని అదానీ గ్రూప్ పేర్కొంది. వచ్చే పదేళ్లలో దేశీయంగా గ్యాస్ మౌలిక సదుపాయాలు, పంపిణీ, మార్కెట్ వ్యాపారాలను మెరుగుపర్చేందుకు రెండు సంస్థలు గణనీయంగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది. "భారత్‌లో సహజ వాయువుకు గణనీయ డిమాండ్‌ ఉందనడానికి టోటల్ పెట్టుబడులు నిదర్శనం. ప్రపంచ స్థాయి అసెట్స్ రూపొందించడంలో అదానీ సామర్ధ్యాలు .. ఎల్‌ఎన్‌జీ, ఇంధన రిటైల్‌, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌లో టోటల్ అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు ఈ జాయింట్‌ వెంచర్‌కు సానుకూల అంశాలు" అని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు. "ఇంధనానికి భారీ డిమాండ్ నేపథ్యంలో భారత సహజ వాయువు మార్కెట్లో ఆకర్షణీయమైన అవకాశాలు ఉన్నాయి" అని టోటల్ సీఈవో ప్యాట్రిక్ పోయోన్ ఒక ప్రకటనలో తెలిపారు. 
    భారత్‌లో రెండు ఎల్‌ఎన్‌జీ దిగుమతి టెర్మినల్స్‌ను, వచ్చే 10 సంవత్సరాల్లో 1,500 పెట్రోల్ బంకులు నిర్మించేందుకు టోటల్‌ గతేడాది అక్టోబర్‌లో అదానీ గ్రూప్‌తో కలిసి ఒక జాయింట్ వెంచర్‌ ఏర్పాటు చేసింది. ఇందులో ఇరు సంస్థలకు చెరి 50 శాతం వాటాలు ఉన్నాయి. ప్రస్తుతం దానికి కొనసాగింపుగా సిటీ గ్యాస్ పంపిణీ విభాగం అదానీ గ్యాస్‌లో కూడా వాటాలు కొనుగోలు చేస్తోంది. ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్‌ చమురు, కెమికల్స్ వ్యాపారంలో సౌదీ అరేబియన్ ఆయిల్‌ కంపెనీ 20 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం తాజాగా మరో విదేశీ దిగ్గజం టోటల్ కూడా దేశీ ఇంధన రంగంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండటం గమనార్హం. 

ఒప్పందం స్వరూపం ఇలా..
అదానీ గ్యాస్‌లో 25.2 శాతం వాటాల కొనుగోలు కోసం టోటల్ ముందుగా ఓపెన్ ఆఫర్ ప్రకటిస్తుంది. ఆఫర్ ఫలితాలను బట్టి 37.4 శాతం దాకా పెంచుకునేందుకు అవసరమైన మిగతా వాటాలను అదానీ నుంచి కొనుగోలు చేస్తుంది. అదానీ గ్యాస్‌లో 74.8 శాతం వాటాలు ఉన్నాయి. డీల్ అనంతరం రెండు సంస్థలకు చెరి 37.4 శాతం వాటాలు ఉంటాయని ఇరు కంపెనీలు వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. లిస్టింగ్ నిబంధనల ప్రకారం పబ్లిక్ వాటా 25 శాతంగా ఉండేందుకు అదానీ కుటుంబం ఓపెన్ మార్కెట్లో కొంత వాటాలను విక్రయించనుంది. You may be interested

బలహీన చైనా ఆర్థిక డేటా..నష్టాల్లో చమురు

Tuesday 15th October 2019

చైనా ఆర్థిక డేటా సెప్టెంబర్‌ నెలకు సంబంధించి బలహీనంగా వెల్లడికావడం,  యుఎస్‌-చైనా పాక్షిక ఒప్పందం అమలుపై అనుమానాలు పెరగడంతో చమురు ధరలు మంగళవారం సెషన్‌లో కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.36 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.76 శాతం నష్టపోయి బారెల్‌ 58.90 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.63 శాతం నష్టపోయి 53.25 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ‘అంతర్జాతీయంగా వాణిజ్యం మందగించడంతో పాటు యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌లో భాగంగా టారీఫ్‌లు పెంచుకోవడం వంటి

హెచ్‌యూఎల్‌ లాభం రూ.1,848 కోట్లు

Tuesday 15th October 2019

క్యూ2లో 21 శాతం వృద్ధి  ఒక్కో షేర్‌కు రూ.11 మధ్యంతర డివిడెండ్‌  రూ.9,708 కోట్లకు పెరిగిన అమ్మకాలు  మాంద్యంలోనూ మంచి వృద్ధి సాధించాం: సీఎండీ న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌(హెచ్‌యూఎల్‌) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.1,848 కోట్ల నికర లాభం(స్టాండ్‌అలోన్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ2లో ఆర్జించిన నికర లాభం(రూ.1,525 కోట్లు)తో పోల్చితే 21 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్‌ తెలిపింది. గృహ సంరక్షణ, సౌందర్య, వ్యక్తిగత

Most from this category