News


బ్యాంకు రుణాలు మాకొద్దు..!?

Monday 30th December 2019
Markets_main1577644504.png-30501

దేశంలో 50 కార్పొరేట్‌ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (2019 ఏప్రిల్‌-సెప్టెంబర్‌) మొత్తం మీద రూ.59,600 కోట్ల మేర రుణభారాన్ని తగ్గించుకున్నాయి. తమ బ్యాలన్స్‌షీట్లలో రుణ భారాన్ని తగ్గించుకోవాలన్న కార్యాచరణలో భాగమే ఇది. ఇది బ్యాంకుల రుణాల వృద్ధిపై ప్రభావం చూపిస్తుందని, దేశీయ బ్యాంకుల నుంచి కార్పొరేట్ల రుణ సమీకరణ తగ్గినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఇవే కంపెనీలు క్రితం ఆర్థిక సంవత్సరం 2018-19లోనూ రూ.43,000 కోట్ల మేర రుణభారాన్ని తగ్గించుకోవడం గమనార్హం. 


 ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత దేశీయంగా రుణాలు సులభంగా లభించే పరిస్థితి సన్నగిల్లింది. ముఖ్యంగా బ్యాంకులు కార్పొరేట్లకు రుణాలు ఇవ్వాలంటే ఆచితూచి స్పందిస్తున్నాయి. దీంతో కంపెనీలు తమకు కావాల్సిన నిధులను ఎక్స్‌టర్నల్‌ కమర్షియల్‌ బారోయింగ్‌ (ఈసీబీ) వంటి ప్రత్యామ్నాయ సాధనాల ద్వారా సమీకరించుకుంటున్నాయి. దివాలా అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ను (ఐబీసీ) కేంద్రం తీసుకురావడంతో, కంపెనీలు రుణాలపై ఆధారపడడం తగ్గించినట్టు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. మన దేశ కంపెనీలు విదేశీ రుణాల రూపంలో ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి సమీకరించిన మొత్తం 3.41 బిలియన్‌ డాలర్లు. ఇది అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీలు సమీకరించిన 1.41 బిలియన్‌ డాలర్ల కంటే రెట్టింపునకు పైగా ఎక్కువ. 3.41 బిలియన్‌ డాలర్ల రుణాల్లో 2.87 బిలియన్‌ డాలర్లను ఆటోమేటిక్‌ మార్గంలో ఈసీబీల ద్వారా, 538 డాలర్ల మేర అనుమతించిన ఈసీబీ మార్గం ద్వారా కంపెనీలు సమకూర్చుకున్నాయి. ఈ ప్రభావం బ్యాంకుల రుణ వృద్ధిపై చూపించింది కూడా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇంత వరకు బ్యాంకుల్లో రుణ వృ‍ద్ధి కేవలం 1.7 శాతంగానే ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 6.7 శాతంగా ఉండడం పరిస్థితిని తెలియజేస్తోంది. 



You may be interested

భారతీయ రైల్వే పట్టాలపై ప్రైవేటు రైళ్ల పరుగులు

Monday 30th December 2019

భారతీయ రైల్వే పట్టాలపై ప్రైవేటు రైళ్లు అతి త్వరలోనే విస్తృతంగా కనిపించనున్నాయి. ఇప్పటికే భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ ఢిల్లీ-లక్నో మార్గంలో తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో ప్రైవేటు రైలు సర్వీసు నడుపుతోంది. మరో తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసును అహ్మదాబాద్‌-ముంబై మధ్య జనవరి 16 నుంచి ఐఆర్‌సీటీసీ ప్రారంభించనుంది. ఈ రెండు సర్వీసులను ప్రయోగాత్మకంగా ఐఆర్‌సీటీసికి అప్పగించగా, ఢిల్లీ-లక్నో మధ్య సర్వీస్‌ విజయవంతం అయింది. దీంతో 150 ‍ప్రైవేటు రైలు

2019: పసిడి లాభాల కాంతులు

Saturday 28th December 2019

ఈ ఏడాది పసిడి ఇన్వెస్టర్లకు మంచి లాభాల్ని పంఛింది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రికత్తలు, యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ అనిశ్చితిలతో పాటు ఇతర భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల తగ్గింపు తదితర కారణాలు పసిడి ఫ్యూచర్లను పరుగులు పెట్టించాయి. ఫలితంగా గడిచిన ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ 2019లో దాదాపు పసిడి 13.50శాతం పెరిగింది. అగ్ర రాజ్యాల వాణిజ్య యుద్ధం:-  అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం

Most from this category