జీఎస్టీ 2.0 అమల్లోకి తేవాలి
By Sakshi

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ) రెండో దశను (2.0) అమల్లోకి తేవాల్సిన సమయం వచ్చిందని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. విద్యుత్, చమురు, గ్యాస్, రియల్ ఎస్టేట్, ఆల్కహాల్‌ను కూడా దీని పరిధిలోకి తీసుకురావడం ద్వారా పన్ను సంస్కరణలకు మరింత ఊతమివ్వాల్సిన అవసరముందని పేర్కొన్నాయి. అలాగే పన్ను రేటును 2-3 శ్లాబులకు పరిమితం చేయాలని కోరాయి. "జీఎస్టీ అమల్లోకి వచ్చి రెండేళ్లయింది. ఇక జీఎస్టీ 2.0ని అమలు చేయాల్సిన తరుణం వచ్చింది. ఇది దేశ ఎకానమీని తదుపరి వృద్ధి స్థాయికి చేర్చగలదు" అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ తెలిపారు. ప్రారంభ దశలో ఎదురైన పలు సవాళ్లను అధిగమించిన నేపథ్యంలో పరోక్ష పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేయాలన్న లక్ష్య సాధన దిశగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమానీ పేర్కొన్నారు. మరోవైపు రిటర్నుల ఫైలింగ్ల్లోనూ.. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ల్లోనూ వ్యత్యాసాలు ఉన్నా, పన్నులు ఎగవేసినా ఆయా సంస్థల ప్రమోటర్లు, డైరెక్టర్లు, ప్రొప్రైటర్లకు ఎస్ఎంఎస్లు పంపుతున్నట్లు జీఎస్టీ నెట్వర్క్ సీఈవో ప్రకాష్ కుమార్ తెలిపారు. దీనివల్ల తెలియక చేసిన తప్పులేమైనా ఉంటే వారు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుందని ఆయన వివరించారు.
You may be interested
ఐటీ మినహాయింపు పరిమితి పెంపు!
Monday 1st July 2019- రూ.10 కోట్ల ఆదాయం మించితే 40 శాతం పన్ను... - బడ్జెట్లో ఈ దిశగా చర్యలు ఉండొచ్చని కేపీఎంజీ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ: రానున్న కేంద్ర బడ్జెట్లో మోదీ సర్కారు ఆదాయపు పన్ను(ఐటీ) విషయంలో కీలక చర్యలను ప్రకటించే అవకాశం ఉందని కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ నిర్వహించిన సర్వేలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత ఐటీ చెల్లింపుదారులకు ఇప్పటివరకూ రూ.2.5 లక్షలుగా ఉన్న మినహాయింపు పరిమితిని పెంచొచ్చని పేర్కొన్నారు. ఈ నెల 5న
ఈ వారం స్టాక్ రికమెండేషన్స్
Monday 1st July 2019యాక్సిస్ బ్యాంక్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.808 టార్గెట్ ధర: రూ.925 ఎందుకంటే: ఈ ప్రైవేట్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నిలకడైన పనితీరును సాధించింది. మొండి బకాయిల సమస్య, కవరేజ్ రేషియో అంశాల్లో మెరుగుదలను సాధించింది. ఈ బ్యాంక్ దూకుడుగా బ్రాంచ్‌లను విస్తరిస్తోంది. సగటు బ్రాంచ్ వ్యాపారం ఏడాది కాలంలో రూ.240 కోట్ల నుంచి రూ.260 కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో సగటు ఉద్యోగి వ్యాపారం రూ.15 కోట్ల