News


సావరిన్‌ బాండ్ల ద్వారా రూ.70,000 కోట్ల సమీకరణ !

Saturday 13th July 2019
news_main1562995710.png-27037

  • సావరిన్‌ బాండ్ల ద్వారా రూ.70,000 కోట్ల సమీకరణ !
  • ఆర్థిక శాఖ కార్యదర్శి వెల్లడి 

న్యూఢిల్లీ: సావరిన్‌ బాండ్ల ద్వారా కేంద్రం రూ.70,000 కోట్లు సమీకరించే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ సూచనప్రాయంగా వెల్లడించారు. విదేశీ మార్కెట్ల నుంచి  సావరిన్‌ బాండ్ల ద్వారా రుణాలు సమీకరించడం సాహసోపేతమైన చర్య అని ఆయన అభివర్ణించారు. విదేశాల్లో రుణాలను సమీకరించడం వల్ల దేశీయంగా ప్రైవేట్‌ రంగానికి మరిన్ని నిధులు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు. ఇక్కడ జరిగిన సీఐఐ సమావేశంలో ఆయన మాట్లాడారు. మౌలిక రంగంలో భారీ పెట్టుబడులు అవసరమని, ఈ విషయమై ప్రైవేట్‌ రంగం దృష్టి సారించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయన కంపెనీలను కోరారు. ‍కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల సమస్య ఉందని, ఈ సమస్యపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షల కోట్ల రుణాలు చేయనున్నామని గార్గ్‌ పేర్కొన్నారు.  దీంట్లో 10 శాతాన్ని, రూ.70,000 కోట్ల మేర సావరిన్‌ బాండ్ల ద్వారా సమీకరిస్తే, ఆ మేరకు నిధులు ప్రైవేట్‌ రంగానికి లభిస్తాయని వివరించారు. ఫలితంగా మన వ్యవస్థలో ద్రవ్య సరఫరా పెరుగుతుందని పేర్కొన్నారు. భారత ప్రైవేట్‌ రంగంలో మరిన్ని పెట్టుబడులు లభించేలా చూడ్డంలో భాగమే ఇదంతా అని వివరించారు. ఇప్పటివరకూ అనుమతించని పలు రంగాల్లో ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యానికి(పీపీపీ)ను అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. 



You may be interested

ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి!

Saturday 13th July 2019

ఆందోళనకలిగిస్తున్న పారిశ్రామిక,  ద్రవ్యోల్బణం గణాంకాలు మేలో ఐఐపీ వృద్ధి స్పీడ్‌ 3.1 శాతం మైనింగ్‌, తయారీ పేలవ పనితీరు రిటైల్‌ ధరల పరుగు జూన్‌లో 3.18 శాతం వరుసగా ఆరునెలల నుంచీ ఎగువముఖం న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి శుక్రవారం నిరుత్సాహకరమైన గణాంకాలు వెలువడ్డాయి. ఈ అధికారిక గణాంకాల ప్రకారం- పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధికి సంబంధించిన ఐఐపీ (పారిశ్రామిక ఉత్పత్తి సూచీ) మేలో కేవలం 3.1 శాతం పెరిగింది. అంటే 2018 మేతో పోల్చితే, 2019 మేలో ఈ

వడ్డి రేట్ల కోత బలమైన ఉద్దీపనం: మనిష్‌ గున్వానీ

Saturday 13th July 2019

 అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో పాటు ఇండియా మానెటరీ పాలసీలు కూడా పని చేస్తే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని రిలయన్స్‌ మూచ్యువల్‌ ఫండ్‌ సీఐఓ మనిష్‌ గున్వానీ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే...    రేట్ల కోత, అంతర్జాతీయ సంకేతాలే మూలం ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోడానికి ఎటువంటి కారకాలు పనిచేస్తాయో చెప్పడం కష్టం!  ప్రస్తుతం వాహనాల అమ్మకంలో మందగమనాన్ని ఆరు నెలల ముందు  అంచనా వేయలేకపోయాం.

Most from this category