News


డేటా సేకరణ ఆరోపణలు నిరాధారమైనవి: టిక్‌టాక్‌

Wednesday 3rd July 2019
news_main1562136490.png-26760

న్యూఢిల్లీ: చట్టవిరుద్ధంగా యూజర్ల డేటాను సేకరిస్తోందంటూ వస్తున్న ఆరోపణలను షార్ట్-వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ఖండించింది. స్థానిక చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే తాము కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పేర్కొంది. చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్‌ సంస్థలో భాగమైన టిక్‌టాక్‌ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. యూజర్ల డేటా భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించింది. యూజర్ల డేటాను టిక్‌టాక్‌ చట్టవిరుద్ధంగా సేకరించి .. చైనాకు పంపుతోందని, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యని లోక్‌సభలో సీనియర్ కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ ఆరోపించిన నేపథ్యంలో టిక్‌టాక్ తాజా వివరణనిచ్చింది. తమపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని పేర్కొంది. తమ సంస్థ కార్యకలాపాలు చైనాలో లేవని, అక్కడి ప్రభుత్వానికి గానీ చైనా టెలికం సంస్థకు గానీ టిక్‌టాక్ యూజర్ల డేటా అందుబాటులో ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. భారతీయ యూజర్ల డేటాను అమెరికా, సింగపూర్‌లోని ప్రముఖ థర్డ్‌ పార్టీ డేటా సెంటర్స్‌లో భద్రపర్చడం జరుగుతుందని టిక్‌టాక్ తెలిపింది. 
 



You may be interested

ఐటీలో 2.5 లక్షల కొత్త కొలువులు

Wednesday 3rd July 2019

నైపుణ్యాభివృద్ధి పథకాలతో సాధ్యం కేంద్ర మంత్రి మహేంద్రనాథ్‌ పాండే వెల్లడి న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో సమగ్ర నైపుణ్యాభివృద్ధి పథకాల ఊతంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో కొత్తగా 2.5 లక్షల ఉద్యోగాల కల్పన జరగనుందని కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్‌, ఎంట్రప్రెన్యూర్‌షిప్ శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే తెలిపారు. డిజిటల్‌ టెక్నాలజీ రంగంలో శరవేగంగా చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులతో దేశీయంగా క్లౌడ్‌ కంప్యూటింగ్ మార్కెట్‌ 2022 నాటికల్లా 7.1 బిలియన్ డాలర్ల స్థాయికి (సుమారు

వాట్సాప్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌ పోటీ..

Wednesday 3rd July 2019

 వైఫైతో కాల్స్‌ చేసుకునే సదుపాయం ప్రస్తుతం ప్రయోగదశలో వీవోవైఫై  ముందుగా ద్వితీయ శ్రేణి నగరాల్లో ప్రవేశపెట్టే యోచన ముంబై:     ప్రైవేట్‌ టెల్కోల రాకతో వెనుకబడిన ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) జోరు పెంచుతోంది. తాజాగా వాట్సాప్‌ వంటి ఓవర్‌–ది–టాప్‌ (ఓటీటీ) సంస్థలతో పోటీపడేందుకు సిద్ధమవుతోంది. వైఫై ఇంటర్నెట్‌ ద్వారా కాల్స్‌ చేయడం, రిసీవ్‌ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టే యత్నాల్లో ఉంది. ఇందుకు సంబంధించిన అడ్వాన్స్‌డ్‌ వాయిస్‌

Most from this category