News


దివాలా అంచుల్లో థామస్‌ కుక్‌

Monday 23rd September 2019
news_main1569211103.png-28479

  • లభించని ప్రైవేట్‌ పెట్టుబడులు
  • ​బ్రిటిష్‌ ప్రభుత్వ సాయం కోసం చూపు  
  • ప్రభుత్వ సాయం కష్టమేనంటున్న నిపుణులు

ల‍ండన్‌: బ్రిటిష్‌ పర్యాటక సంస్థ, థామస్‌ కుక్‌ దివాలా స్థితికి చేరింది. 178 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీ మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ దొరకడం దుర్లభం కావడంతో ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తోంది.  ఫలితంగా ఈ కంపెనీ ద్వారా వివిధ దేశాల్లో పర్యటిస్తున్న లక్షన్నర మంది బ్రిటిష్‌ పర్యాటకులు ఇబ్బందులు పడనుండగా, వేలాదిమంది ఉద్యోగులు వీధినపడే అవకాశాలున్నాయి. థామస్‌ కుక్‌కు తగిన నిధులు అందకపోతే, ఈ లక్షన్నర మంది పర్యాటకులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి బ్రిటిష్‌ ప్రభుత్వానికి భారీగానే ఖర్చు కానున్నది. 
తక్షణం 25 కోట్ల డాలర్లు అవసరం...
కార్యకలాపాలు కొనసాగించడానికి 25 కోట్ల డాలర్ల నిధులు అవసరమని థామస్‌ కుక్‌ గత శుక్రవారం వెల్లడించింది. నిధుల కోసం ఈ కంపెనీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ప్రభుత్వం ఆదుకోకపోతే, థామస్‌ కుక్‌ కంపెనీ మూతపడక తప్పదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. అయితే దీర్ఘకాలంలో ఈ కంపెనీ మనుగడపై సందేహాలున్న ప్రభుత్వ వర్గాలు ఎలాంటి తోడ్పాటు నందించేందుకు సుముఖంగా లేవని ది టైమ్స్‌ పత్రిక పేర్కొంది. రెండు రోజుల్లో ఈ విషయమై స్పష్టత రావచ్చని ఆ పత్రిక వెల్లడించింది. ఈ కంపెనీ మూతపడితే వేలాది మంది ఉద్యోగులు వీధులపాలవుతారని, కంపెనీని ప్రభుత్వమే ఆదుకోవాలని కంపెనీ ఉద్యోగుల  సంఘం, టీఎస్‌ఎస్‌ఏ(ట్రాన్స్‌పోర్ట్‌ శాలరీడ్‌ స్టాఫ్స్‌ అసోసియేషన్‌) కోరుతోంది. 

మోనార్క్‌ ఎయిర్‌లైన్స్‌ మునిగిపోయినప్పుడు..
ప్రస్తుతం థామస్‌ కుక్‌ ఎదుర్కొంటున్న విషమ పరిస్థితినే రెండేళ్ల క్రితం మోనార్క్‌ ఎయిర్‌లైన్స్‌ ఎదుర్కొంది. ఈ కంపెనీ మునిగిపోయినప్పుడు లక్షా పదివేల మంది ప్రయాణికులు వివిధ చోట్ల చిక్కుకు పోయారు. వీరిని వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి బ్రిటన్‌ ప్రభుత్వానికి 6 కోట్ల పౌండ్ల ప్రభుత్వ సొమ్ములు ఖర్చు చేయాల్సి వచ్చింది. అంతే కాకుండా బ్రిటన్‌లో 9,000 మందితో పాటు ప్రపంచవ్యాప్తంగా 22,000 ఉద్యోగాలు పోయాయి. 
బ్రెగ్జిట్‌, ఆన్‌లైన్‌ పోటీతో భారీగా నష్టాలు...
ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో నష్టాలు భారీగా పెరగనున్నాయని ఈ ఏడాది మేలోనే థామస్‌ కుక్‌ వెల్లడించింది. బ్రెగ్జిట్‌ అనిశ్చితి కారణంగా సమ్మర్‌ హాలిడే బుకింగ్స్‌ ఆలస్యం కావడంతో నష్టాలు పెరిగాయి. మరోవైపు ఇంగ్లాండ్‌లో 600 వరకూ స్టోర్స్‌ ఉన్న ఈ కంపెనీకి ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సంస్థల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. 



You may be interested

10 పైసలు నష్టంతో ప్రారంభమైన రూపీ

Monday 23rd September 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో సోమవారం 10 పైసలు బలహీనపడి 71.04 వద్ద ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 40 బలపడి 70.94 వద్ద ముగిసింది. దీనితోపాటు దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు గత సెషన్‌లో భారీగా లాభపడడం కూడా రూపీకి కలిసివచ్చింది. కానీ ట్యాక్స్‌ తగ్గిం‍పు బాండ్‌ మార్కెట్‌లో తీవ్రమైన ప్రభావాన్ని చూపకపోవడం గమనార్హం. గత సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో

భారత్‌లో పెట్టుబడుల వరద

Monday 23rd September 2019

యాపిల్‌ వంటి కంపెనీల చూపు భారత్‌ వైపు  వ్యక్తిగత ఆదాయ పన్ను తగ్గింపు లేదు  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  న్యూఢిల్లీ: కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపుతో భారత్‌లో పెట్టుబడుల వరద పారనున్నదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. చైనా, ఇతర ఆగ్నేయాసియా దేశాలతో పోల్చితే మన దేశంలోనే పన్ను తక్కువగా ఉందని, ఫలితంగా పెట్టుబడులకు భారత్‌ ఆకర్షణీయమైన దేశంగా నిలుస్తుందని  వివరించారు.  చైనా కంటే భారత్‌ మేలు... గతంలో కార్పొరేట్‌ ట్యాక్స్‌ అధికంగా ఉండేదని, మరికొన్ని

Most from this category