News


2019 బిజినెస్‌ రివైండ్‌: టెల్కోలకు షాక్‌ ట్రీట్‌మెంట్‌..

Monday 30th December 2019
news_main1577679918.png-30521

సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) లెక్కింపు విషయంలో కేంద్రం ఫార్ములానే సమర్ధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలివ్వడంతో పాత ప్రైవేట్‌ టెల్కోల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఈ దెబ్బతో టెల్కోలు ఏకంగా రూ. 1.47 లక్షల కోట్లు కేంద్రానికి చెల్లించాల్సి వస్తోంది. వీటికి కేటాయింపులు జరపడంతో వొడాఫోన్‌ ఐడియా సంస్థ దేశ కార్పొరేట్‌ చరిత్రలోనే రికార్డు స్థాయిలో రూ. 50,921 కోట్ల పైచిలుకు నష్టాలను సెప్టెంబర్‌ త్రైమాసికంలో ప్రకటించింది. ఎయిర్‌టెల్‌ కూడా రూ. 23,045 కోట్ల నష్టాలు నమోదు చేసింది. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే కంపెనీని మూసేయక తప్పదని వొడాఫోన్‌ ఐడియా ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తానికి రంగంలోకి దిగిన కేంద్రం.. టెల్కోలకు ఊరటనిచ్చేలా స్పెక్ట్రం బాకీల చెల్లింపుపై రెండేళ్ల మారటోరియం ప్రకటించింది. ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ చార్జీల వివాదం కూడా తెరపైకి వచ్చింది. ఈ చార్జీలను కొనసాగించాలంటూ పాత టెల్కోలు, ఎత్తివేయాలని కొత్త టెలికం సంస్థ జియో వాదించాయి. చివరికి 2021 దాకా దీని గడువును ట్రాయ్‌ పొడిగించింది. ఈలోగా టెల్కోలన్నీ కలిసికట్టుగా చార్జీలను పెంచేశాయి. రేటు పెరిగినా డేటా వినియోగానికి డిమాండ్‌ తగ్గదని, ఆదాయాలు గణనీయంగా మెరుగుపడతాయని కంపెనీలు ఆశిస్తున్నాయి. కనీస చార్జీలను నిర్దేశించే ప్రతిపాదనను ట్రాయ్‌ పరిశీలిస్తోంది. అటు ప్రభుత్వ రంగ టెల్కోలకు కాస్త ఊరట లభించింది. బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ను విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. వీటికి రూ. 69,000 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది. రెండు సంస్థల్లో 92,000 మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ఎంచుకున్నారు. You may be interested

స్కిప్పర్‌- గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌ జూమ్‌

Monday 30th December 2019

దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు సోమవారం హుషారుగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 ప్రాంతంలో సెన్సెక్స్‌ 126 పాయింట్లు పెరిగి 41,701కు చేరగా.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 12281 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ డెవలప్‌మెంట్స్‌ ఆధారంగా ఇటు స్కిప్పర్‌ లిమిటెడ్‌, అటు గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌తోపాటు స్నోమన్‌ లాజిస్టిక్స్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వివరాలు చూద్దాం.. స్కిప్పర్‌ లిమిటెడ్‌ దేశీయంగా తొలిసారి విజయవంతంగా 765 కేవీ S/C

2019 బిజినెస్‌ రివైండ్‌: మ్యూచువల్‌ ఫండ్స్‌ జోష్‌..

Monday 30th December 2019

2019లో మ్యూచువల్‌ ఫండ్స్‌ అసెట్స్‌ భారీగా పెరిగాయి. 2019 నవంబర్‌ నాటికే ఏయూఎం 18 శాతం (సుమారు రూ. 4.2 లక్షల కోట్లు) ఎగిసి రూ.27 లక్షల కోట్లకు చేరింది. ఇన్వెస్టర్ల ధీమాను పెంచేందుకు సెబీ తీసుకుంటున్న చర్యలు, డెట్‌ స్కీముల్లోకి భారీగా పెట్టుబడుల రాకతో.. కొత్త ఏడాది కూడా ఇదే ధోరణి కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. 2020లో మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ 17–18 శాతం మేర వృద్ధి

Most from this category