News


2019 బిజినెస్‌ రివైండ్‌: డీల్‌ స్ట్రీట్‌.. కార్పొరేట్లు డీలా

Monday 30th December 2019
news_main1577678345.png-30514

కార్పొరేట్లు రుణ సంక్షోభాల్లో కూరుకుపోవడంతో 2019లో విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్‌ఏ) డీల్స్‌ ఒక మోస్తరు స్థాయికే పరిమితమయ్యాయి. లిక్విడిటీ కొరత, విదేశీ ఇన్వెస్టర్లు కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడం, అంతర్జాతీయంగా అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం వంటి అంశాల కారణంగా ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అవలంబించారు. న్యాయసేవల సంస్థ బేకర్‌ మెకెంజీ నివేదిక ప్రకారం 2019లో మొత్తం మీద సుమారు రూ. 52.1 బిలియన్‌ డాలర్ల విలువ చేసే డీల్స్‌ జరిగాయి.  2019లో సగటు ఎంఅండ్‌ఏ డీల్‌ పరిమాణం 81 మిలియన్‌ డాలర్లుగా నమోదైంది. గడిచిన మూడేళ్లతో పోలిస్తే ఇదే అత్యల్పం. తయారీ, ఇంధనం, స్టార్టప్, ఫార్మా, బ్యాంకింగ్, ఐటీ, ఇన్‌ఫ్రా, రిటైల్, ఈ–కామర్స్‌ రంగాల్లో గణనీయంగా ఒప్పందాలు కుదిరాయి. వ్యాపారాలకు అనువైన సంస్కరణలు, అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు తిరిగొస్తుండటం వంటి అంశాల ఊతంతో 2020, 2021 సంవత్సరాల్లో డీల్స్‌ పరిస్థితి మళ్లీ పుంజుకోగలదని బేకర్‌ మెకెంజీ ఒక నివేదికలో తెలిపింది. 



You may be interested

2019 బిజినెస్‌ రివైండ్‌: బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సవాళ్లమయం

Monday 30th December 2019

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ దివాలా ప్రభావాలతో 2019 నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగం కష్టాలు కొనసాగాయి. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, అల్టికో క్యాపిటల్‌ వంటి సంస్థలు దివాలా తీశాయి. ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభంతో రుణ లభ్యత కొరవడి ఆటోమొబైల్‌ వంటి ఇతర రంగాలపైనా ప్రభావం పడింది. మొండిబాకీలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీనాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం 10 బ్యాంకులను నాలుగు కింద విలీనం చేసింది. యూనియన్‌ బ్యాంకులో విలీనంతో తెలుగువారి ఆంధ్రా

2019 బిజినెస్‌ రివైండ్‌: గతుకుల రోడ్డుపై... ఆటో

Monday 30th December 2019

డిమాండ్‌ లేక అమ్మకాలు తగ్గడం మొదలుకుని ప్లాంట్ల మూసివేతలు, ఉద్యోగాల కోతలు, వందల మంది డీలర్ల దివాలా..  కొత్త కాలుష్య ప్రమాణాలు, ఎలక్ట్రిక్‌ వాహనాల విధానాలు..  ఇలా వివిధ కారణాలు ఆటోమొబైల్‌ పరిశ్రమను తెరిపిన పడనివ్వకుండా చేశాయి. ఎకానమీలో మందగమనం, ధరల పెంపుతో ప్యాసింజర్‌ వాహన విక్రయాలు క్షీణించగా, అధిక నిల్వలు పేరుకుపోయి.. ఫైనాన్స్‌ అవకాశాలు తగ్గిపోయి వాణిజ్య వాహన అమ్మకాలు పడిపోయాయి. ఉద్యోగ కల్పన, డిమాండ్‌ అంతంత మాత్రంగానే

Most from this category