News


విని‘యోగం’ మళ్లీ ఎప్పుడు..?

Saturday 27th July 2019
news_main1564201613.png-27347

  • వ్యవస్థలో తగ్గిన వినియోగం
  • ప్రభుత్వ మద్దతు చర్యలు నామమాత్రం
  • వ్యవస్థలో నగదు లభ్యత తక్కువ
  • ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో సంక్షోభం
  • దీంతో ఎన్‌బీఎఫ్‌సీ షేర్లకు నష్టాలు
  • కొంత కాలం పాటు ఇదే పరిస్థితి
  • దీర్ఘకాలం కోసమే ఇన్వెస్ట్‌ చేసుకోవాలని సూచన

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగానికి చోదక శక్తిగా నిలుస్తున్న వినియోగ రంగం ఈ ఏడాది గడ్డు పరిస్థితులను చవిచూస్తోంది. దేశీయ వినియోగం, ఉత్పాదకతపైనే ఎక్కువగా ఆధారపడిన మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు వృద్ధి క్షీణతను చవిచూస్తోంది. భారీ మెజారిటీతో రెండోసారి కొలువు దీరిన ఎన్డీయే సర్కారు కుంగిన ఆర్థిక వ్యవస్థను పరుగెత్తించే చర్యలు చేపడుతుందన్న ఆకాంక్షలు బలంగా ఉండగా, బడ్జెట్‌ చూసిన తర్వాత నిరాశ చెందాల్సి వచ్చింది. ముఖ్యంగా వ్యవస్థలో నిధుల లభ్యత బాగా తగ్గిపోవడం, ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో సంక్షోభం వినియోగాన్ని గట్టి దెబ్బతీశాయన్న విశ్లేషణ వినిపిస్తోంది. 
తగ్గిన డిమాండ్‌...
జూలై 5న బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పటి నుంచి చూస్తే నిఫ్టీ కన్జంప్షన్‌ ఇండెక్స్‌ 5.7 శాతం పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు చూసుకుంటే నిఫ్టీ కన్జంప్షన్‌ ఇండెక్స్‌ 9.4 శాతం నష్టపోగా, ఇదే కాలంలో నిఫ్టీ-50 3.8 శాతం మేర పెరిగింది. దేశ ఆర్థిక రంగ విస్తరణలో బ్యాంకులతోపాటు ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలది కీలకపాత్రగా చెప్పుకోవాలి. ఎందుకంటే బ్యాంకింగ్‌ రంగం నుంచి లోటు ఉన్న రంగాలకు రుణ అవసరాలను ఎన్‌బీఎఫ్‌సీ విభాగమే తీరుస్తోంది. ఎన్‌బీఎఫ్‌సీ రంగం నిధుల కటకటతో ఆర్థిక రంగ విస్తరణ కూడా ఆగిపోయిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. వినియోగం తగ్గుదల అన్నది మరికొంత కాలం పాటు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) భారత దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాను 2019-20 ఆర్థిక సంవత్సరానికి 0.3 శాతం మేర తగ్గించి 7 శాతంగా పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం. డిమాండ్‌ తగ్గడమే అంచనాలను తగ్గించడానికి కారణమని ఐఎంఎఫ్‌ తెలిపింది. 
మరికొంత కాలం పాటు...
కొత్త ఉద్యోగాలు లేకపోవడం, నగదు లభ్యత తక్కువగా ఉండడం తదితర కారణాలతో డిమాండ్‌/వినియోగం మరికొంత కాలం బలహీనంగానే ఉంటుందన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ రంగంపై ప్రభుత్వ వ్యయాలు పెరగడం సానుకూల చర్య అని, అయితే గతంలో అధిక బేస్‌తోపాటు ప్రభుత్వ వ్యయాలు గణనీయంగా లేని అంశాలను వారు గుర్తు చేస్తున్నారు. కంపెనీల పరంగా చూస్తే... ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) 2019-20లో మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో గత ఏడు త్రైమాసికాల్లోనే తక్కువ విక్రయాలను నమోదు చేసింది. ఇక వినియోగంలో భాగమైన ఆటోమొబైల్‌ రంగం కూడా గడ్డు పరిస్థితులను చూస్తోంది. వాహన అమ్మకాలు గత కొన్ని నెలలుగా అంతకంతకూ తగ్గుతూ వస్తున్నాయి. ‘‘ప్రస్తుతం వినియోగ రంగంలో ఉన్న పరిస్థితిని చూస్తుంటే... రానున్న త్రైమాసికాల్లోనూ అమ్మకాల వృద్ధి పెద్ద సవాలుగానే కనిపిస్తోంది. కన్జ్యూమర్‌ స్టాపుల్స్‌, ఆటో, క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్లు (క్యూఎస్‌ఆర్‌) జ్యుయలరీ విభాగాలు ఇప్పటికే ఎన్నో​సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత మందగమనం కన్జ్యూమర్‌ డ్యురబుల్స్‌ విభాగంపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించనుంది’’ అని ఈక్విరస్‌ సెక్యూరిటీస్‌ తన నివేదికలో పేర్కొంది. 


అప్రమత్తంగా ఉండాలి...
సమీప కాలంలో ఎదురయ్యే సవాళ్ల నేపథ్యంలో వినియోగ రంగ కంపెనీల ఫలితాల వృద్ధి ఆశాజనకంగా లేకపోవడం వల్ల స్టాక్స్‌ ధరలు మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయని ఈ రంగం షేర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. దీర్ఘకాల దృష్టితోనే కొనుగోళ్లకు దిగాలని సూచిస్తున్నారు. ఈ విభాగంలో ఎంఅండ్‌ఎం, టీవీఎస్‌ మోటార్‌, మారుతి సుజుకీ, హీరో మోటోకార్ప్‌, గోద్రేజ్‌ కన్జ్యూమర్‌, కోల్గేట్‌ పామోలివ్‌, బ్రిటానియా, డీమార్ట్‌, యునైటెడ్‌ స్పిరిట్స్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నిఫ్టీ కన్జంప్షన్‌ సూచీలో ఈ ఏడాది ఇప్పటి వరకు ఎక్కువగా నష్టపోయిన షేర్లు. ‘‘స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి మందగమనం ఉంటుందన్న దానికి ఆధారాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈ షేర్లను మూడేళ్ల కాలం కోసమే కొనుగోలు చేసుకోవాలి. కేవలం వచ్చే 3-6 నెలల కోసం అయితే వీటిల్లో పెట్టుబడులకు దూరంగా ఉండాలి. హెచ్‌యూఎల్‌, పిడిలైట్‌, టైటాన్‌, మారికో కంపెనీల పట్ల సానుకూలంగా ఉన్నాం’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ గౌతం దుగ్గద్‌ సూచించారు. 



You may be interested

వొడాఫోన్‌ ఐడియాకు రూ.4,874 కోట్ల నష్టాలు

Saturday 27th July 2019

ఆదాయం రూ.11,270 కోట్లు న్యూఢిల్లీ: వొడాఫోన్‌ ఐడియా కన్సాలిడేటెడ్‌ నష్టాలు జూన్‌ త్రైమాసికంలో రూ.4,874 కోట్లుగా ఉన్నాయి. మార్చి త్రైమాసికంలో ఈ సంస్థ రూ.4,882 కోట్ల నష్టాలను నమోదు చేసింది. అంటే రూ.8 కోట్ల నష్టాలను తగ్గించుకుంది. వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులర్‌ రెండూ 2018 ఆగస్ట్‌ 31 నుంచి విలీనమై వొడాఫోన్‌ ఐడియాగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రితం ఏడాది జూన్‌ త్రైమాసికం ఫలితాలతో ఈ ఏడాది

లాభాల్లోకి పీఎన్‌బీ

Saturday 27th July 2019

గత క్యూ1లో రూ.940 కోట్ల నష్టాలు  ఈ క్యూ1లో రూ.1,019 కోట్ల నికర లాభం  తగ్గిన మొండి బకాయిలు, కేటాయింపులు  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో మళ్లీ లాభాల్లోకి వచ్చింది. గత క్యూ1లో రూ.940 కోట్ల నికర నష్టాలు రాగా, ఈ క్యూ1లో రూ.1,019 కోట్ల నికర లాభం వచ్చిందని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే, గత ఆర్థిక సంవత్సరం

Most from this category