News


2019 బిజినెస్‌ రివైండ్‌: బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సవాళ్లమయం

Monday 30th December 2019
news_main1577678559.png-30515

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ దివాలా ప్రభావాలతో 2019 నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగం కష్టాలు కొనసాగాయి. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, అల్టికో క్యాపిటల్‌ వంటి సంస్థలు దివాలా తీశాయి. ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభంతో రుణ లభ్యత కొరవడి ఆటోమొబైల్‌ వంటి ఇతర రంగాలపైనా ప్రభావం పడింది. మొండిబాకీలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీనాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం 10 బ్యాంకులను నాలుగు కింద విలీనం చేసింది. యూనియన్‌ బ్యాంకులో విలీనంతో తెలుగువారి ఆంధ్రా బ్యాంకు కనుమరుగు కానుంది. నెఫ్ట్‌ సేవలు ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులోకి వచ్చాయి. ఎట్టకేలకు దివాలా కోడ్‌ ప్రయోజనాలు కనిపించడం ప్రారంభమైంది. ఎస్సార్‌ స్టీల్‌ వంటి కేసులు పరిష్కారం కావడంతో బ్యాంకులకు వేల కోట్ల మేర మొండిబాకీల రికవరీ సాధ్యపడింది. అయితే, ఇంకా చాలా కేసుల పరిష్కారానికి సుదీర్ఘ సమయం పట్టేస్తుండటం ఆందోళనకర విషయం. మొండిబాకీల (ఎన్‌పీఏ) భారం ఈసారి కాస్త తగ్గింది. రిజర్వ్‌ బ్యాంక్‌ గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్‌ ఆఖరు నాటికి స్థూల ఎన్‌పీఏలు రూ. 8.94 లక్షల కోట్లకు తగ్గాయి. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో స్థూల మొండిబాకీలు రూ. 10.18 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇక, సుదీర్ఘ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ బిమల్‌ జలాన్‌ సిఫార్సుల మేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ .. 2018–19 కేంద్రానికి గాను తన వద్ద ఉన్న మిగులు నిధుల్లో రూ. 1.76 లక్షల కోట్లు కేంద్రానికి బదలాయించేందుకు అంగీకరించింది. మందగమనంతో కొట్టుమిట్టాడుతున్న ఎకానమీకి ఊతమిచ్చేలా కీలక వడ్డీ రేట్లను 135 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు .. దశాబ్ద కనిష్ట స్థాయి 5.15 శాతానికి దిగివచ్చింది. అయితే, ద్రవ్యోల్బణం ఎగియడంతో డిసెంబర్‌లో రేట్ల కోతకు కాస్త విరామమిచ్చింది. You may be interested

2019 బిజినెస్‌ రివైండ్‌: ఎకానమీ అస్తవ్యస్తం..

Monday 30th December 2019

అంతర్గత, అంతర్జాతీయ సవాళ్లతో ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థకు కష్టంగానే గడిచింది. వినియోగం, ప్రైవేట్‌ పెట్టుబడులు, ఎగుమతులు.. అన్నీ మందగించాయి. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అగ్రగామి దేశం హోదాను భారత్‌ కోల్పోయింది. సెప్టెంబర్‌ క్వార్టర్లో జీడీపీ వృద్ధి.. ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి పడిపోయింది. 5 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యం దిశగా దూసుకెళ్లాల్సిన ఎకానమీ... మందగమనం దెబ్బతో కుంటినడకలు నడుస్తోంది. ఐఎంఎఫ్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు

2019 బిజినెస్‌ రివైండ్‌: డీల్‌ స్ట్రీట్‌.. కార్పొరేట్లు డీలా

Monday 30th December 2019

కార్పొరేట్లు రుణ సంక్షోభాల్లో కూరుకుపోవడంతో 2019లో విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్‌ఏ) డీల్స్‌ ఒక మోస్తరు స్థాయికే పరిమితమయ్యాయి. లిక్విడిటీ కొరత, విదేశీ ఇన్వెస్టర్లు కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడం, అంతర్జాతీయంగా అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం వంటి అంశాల కారణంగా ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అవలంబించారు. న్యాయసేవల సంస్థ బేకర్‌ మెకెంజీ నివేదిక ప్రకారం 2019లో మొత్తం మీద సుమారు రూ. 52.1 బిలియన్‌ డాలర్ల విలువ చేసే

Most from this category