News


2019 బిజినెస్‌ రివైండ్‌: గతుకుల రోడ్డుపై... ఆటో

Monday 30th December 2019
news_main1577677975.png-30513

డిమాండ్‌ లేక అమ్మకాలు తగ్గడం మొదలుకుని ప్లాంట్ల మూసివేతలు, ఉద్యోగాల కోతలు, వందల మంది డీలర్ల దివాలా..  కొత్త కాలుష్య ప్రమాణాలు, ఎలక్ట్రిక్‌ వాహనాల విధానాలు..  ఇలా వివిధ కారణాలు ఆటోమొబైల్‌ పరిశ్రమను తెరిపిన పడనివ్వకుండా చేశాయి. ఎకానమీలో మందగమనం, ధరల పెంపుతో ప్యాసింజర్‌ వాహన విక్రయాలు క్షీణించగా, అధిక నిల్వలు పేరుకుపోయి.. ఫైనాన్స్‌ అవకాశాలు తగ్గిపోయి వాణిజ్య వాహన అమ్మకాలు పడిపోయాయి. ఉద్యోగ కల్పన, డిమాండ్‌ అంతంత మాత్రంగానే ఉండటంతో ద్విచక్ర వాహన విక్రయాలు భారీగా తగ్గాయి. అయితే, వాహనాల కొనుగోళ్లకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తుండటం, రుణ లభ్యతను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటూ ఉండటం తదితర చర్యలు రాబోయే రోజుల్లో ప్యాసింజర్‌ వాహనాలకు సానుకూలంగా ఉండగలవన్న అంచనాలు నెలకొన్నాయి. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో సెంటిమెంటు మెరుగుపడుతుండటం .. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ల అమ్మకాలకూ సానుకూలంగా ఉండవచ్చని అంచనా. 



You may be interested

2019 బిజినెస్‌ రివైండ్‌: డీల్‌ స్ట్రీట్‌.. కార్పొరేట్లు డీలా

Monday 30th December 2019

కార్పొరేట్లు రుణ సంక్షోభాల్లో కూరుకుపోవడంతో 2019లో విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్‌ఏ) డీల్స్‌ ఒక మోస్తరు స్థాయికే పరిమితమయ్యాయి. లిక్విడిటీ కొరత, విదేశీ ఇన్వెస్టర్లు కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడం, అంతర్జాతీయంగా అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం వంటి అంశాల కారణంగా ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అవలంబించారు. న్యాయసేవల సంస్థ బేకర్‌ మెకెంజీ నివేదిక ప్రకారం 2019లో మొత్తం మీద సుమారు రూ. 52.1 బిలియన్‌ డాలర్ల విలువ చేసే

సోమవారం వార్తల్లో షేర్లు

Monday 30th December 2019

విభిన్న వార్తల ఆధారంగా నేడు(సోమవారం) పలు కౌంటర్లు యాక్టివ్‌గా ట్రేడయ్యే వీలున్నట్లు స్టాక్‌ మార్కెట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా వార్తలలో నిలుస్తున్న కంపెనీల వివరాలు చూద్దాం..  ప్రిన్స్‌ పైప్స్‌ ఈ నెల 18-21 మధ్య పబ్లిక్‌ ఇష్యూ పూర్తిచేసుకున్న ప్రిన్స్‌ పైప్స్‌ అండ్‌ ఫిట్టింగ్స్‌ కంపెనీ నేడు స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. షేరుకి రూ. 178 ధరలో కంపెనీ ఐవోవోను చేపట్టింది. పీఐ ఇండస్ట్రీస్‌ ఐసాగ్రో స్పా, అనుబంధ సంస్థల నుంచి ఐసాగ్రో ఏషియా ఆగ్రోకెమికల్స్‌

Most from this category