News


ఈ సారి సాఫీగా ఎయిర్‌ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్‌

Tuesday 18th February 2020
news_main1581995763.png-31873

  • ఎలాంటి ఇబ్బందులు ఉండవు 
  • విమానయాన శాఖ మంత్రి భరోసా

న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియా వాటా విక్రయం ఈ సారి సాఫీగా జరిగిపోనున్నదని విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి ధీమా వ్యక్తం చేశారు. ఎయిర్‌ ఇండియా కొనుగోలు కోసం సత్తా గల కంపెనీలు మరింత ఆసక్తిగా ఉన్నాయని చెప్పారాయన. అందుకని ఎయిర్‌ ఇండియా వాటా విక్రయం విషయంలో ఈసారి ఎలాంటి సమస్యలు తలెత్తబోవన్నారు. భవిష్యత్తులో కూడా ఒక బ్రాండ్‌గా ఎయిర్‌ ఇండియా కొనసాగాలన్నదే ప్రభుత్వ అభిమతమని చెప్పారు. ‘‘ఎయిర్‌ ఇండియా ఉద్యోగుల ప్రయోజనాలు పరిరక్షిస్తాం. ఎందుకంటే ఎయిర్‌ ఇండియాను కొనుగోలు చేసిన కంపెనీకి దానిని నడపటానికి సిబ్బంది కావాలి కదా? ప్రస్తుతమున్న ఉద్యోగులే సరిపోతారు. కొన్నేళ్లుగా ఎలాంటి రిక్రూట్‌మెంట్లూ జరగలేదు కనక మిగులు సిబ్బంది అనే సమస్య ఉండదు’’ అని చెప్పారాయన. 



You may be interested

జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ చేతికి జీఎమ్‌ఆర్‌ కమళంగ ఎనర్జీ

Tuesday 18th February 2020

డీల్‌ విలువ రూ.5,321 కోట్లు  న్యూఢిల్లీ: జీఎమ్‌ఆర్‌ ఎనర్జీకి చెందిన ఒడిషాలోని 1,050 మెగావాట్ల  థర్మల్‌ పవర్‌​ ప్లాంట్‌ను సజ్జన్‌ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కొనుగోలు చేయనుంది. డీల్‌ విలువ రూ.5,321 కోట్లు. ఒడిశాలోని ఈ ప్లాంట్‌ను నిర్వహించే జీఎమ్‌ఆర్‌ ఎనర్జీకి చెందిన జీఎమ్‌ఆర్‌ కమళంగ ఎనర్జీ లిమిటెడ్‌లో వంద శాతం వాటాను కొనుగోలు చేయడానికి షేర్‌ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తెలిపింది. ఈ ప్లాంట్‌

ఓయో నష్టాలు 335 మిలియన్‌ డాలర్లు

Tuesday 18th February 2020

న్యూఢిల్లీ: ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ కన్సాలిడేటెడ్‌ నష్టాలు మరింత అధికమయ్యాయి. 2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సం‍స్థ 335 మిలియన్‌ డాలర్ల (రూ.2,390 కోట్లు) నష్టాలను ప్రకటించింది. 2018 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి నష్టాలు రూ.52 మిలియన్‌ డాలర్లుగానే (రూ.370 కోట్లు) ఉండడం గమనార్హం. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న 211 మిలియన్‌ డాలర్ల నుంచి 951 మిలియన్‌ డాలర్లకు

Most from this category