News


బయటపడేందుకు చివరి అవకాశం!

Saturday 9th February 2019
news_main1549713736.png-24115

ఇన్వెస్టర్లకు సామ్‌కో సెక్యూరిటీస్‌ సూచన
దేశీయ మార్కెట్లు మరింత ముందుకు దూసుకుపోయే సత్తా కోల్పోయాయని సామ్‌కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమిత్‌ మోదీ అభిప్రాయపడ్డారు. ఇకపై సూచీలు వెనుకంజ వేయక తప్పదని అంచనా వేశారు. ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను వదిలించుకునేందుకు ఇదే మంచి తరుణమని, తేడా వస్తే మార్కెట్‌క్రాష్‌లో ఇరుక్కుపోతారని హెచ్చరించారు. గతవారం నిఫ్టీ చార్టుల్లో ఈవెనింగ్‌స్టార్‌ను ఏర్పరిచిందని, బేరిష్‌నెస్‌కు ఇది సంకేతమని వివరించారు. నిఫ్టీ బలంగా 11,000 వేల పాయింట్లపైకి వెళ్లినా, నిలదొక్కుకోలేక వేగంగా పతనమైందని చెప్పారు. పైస్థాయిలో​నిలిచేందుకు అవసరమైన ఫండమెంటల్‌ మద్దతు లేకపోవడం, అంతర్జాతీయ అనిశ్చితి కలిసి మార్కెట్లను వెనక్కు లాగాయని చెప్పారు.

గత కొద్ది నెలలుగా మార్కెట్లో అడ్వాన్సుల కన్నా డిక్లైన్స్‌ ఎక్కువగా ఉన్నాయని, ఈ నెల ఈ వ్యత్యాసం మరింత పెరిగిందని చెప్పారు. మార్కెట్‌ చూసేందుకు ఐదు నెలల గరిష్ఠాలకు చేరినట్లు కనిపిస్తున్నా, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు మాత్రం ముందుకు కదల్లేదని వివరించారు. మార్కెట్లు కరెక‌్షన్‌కు ముందు చూపే బౌన్స్‌కు ఇదే సరైన ఉదాహరణ అన్నారు.

రావాల్సిన పాజిటివ్‌ వార్తలన్నీ అయిపోయాయని, ఇక రాజకీయ అనిశ్చితి పరిస్థితులదే రాజ్యమని చెప్పారు. ఈ పరిస్థితుల్లో సూచీలు పతనానికే మొగ్గు చూపుతాయన్నారు. అందువల్ల ప్రస్తుతం పొజిషన్లు వదిలించుకొని దిగువస్థాయిలో కొనుగోళ్లకు మొగ్గు చూపాలని సలహా ఇచ్చారు. ఎన్‌బీఎఫ్‌సీల్లో సంక్షోభం ముగిసిపోలేదని, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ పతనమే ఇందుకు నిదర్శమని చెప్పారు. వీటి సంక్షోభంతో లిక్విడిటీ కొరత మరింత పెరగవచ్చన్నారు. ఎకానమీలో మౌలిక సమస్యలను ఈ సంక్షోభం ఎత్తి చూపుతోందన్నారు. ఆర్‌బీఐ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మౌలిక సమస్యలు సమసిపోవడం లేదని, అందువల్ల సూచీల్లో పతనం తప్పదని పేర్కొన్నారు. You may be interested

రాబోయే వారం ఎలా ఉంటుంది?

Saturday 9th February 2019

గత వారం నిఫ్టీ ఉర్రూతలూగించినట్లు కనిపించినా చివరకు తుస్సుమని నిరాశ పరిచింది. వారం చివర్లో పతనమై వారం మొత్తం ఆర్జించిన లాభాలను దాదాపు ఆవిరి చేసింది. వారాంతానికి నిఫ్టీ దాదాపు అరశాతం మాత్రమే లాభపడి 10943 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త వారం పేలవ ఆరంభం ఉండొచ్చని అంచనా. మార్కెట్లు మరోమారు కన్సాలిడేషన్‌ లేదా కరెక‌్షన్‌ బాట పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనలిస్టులు భావిస్తున్నారు. గతవారం

ఎన్నికల ముందే కొనుగోళ్లకు ఛాన్స్‌!

Saturday 9th February 2019

డీకే అగర్వాల్‌ సూచన సాధారణ ఎన్నికలకు ముందు సరైన కొనుగోళ్లకు అవకాశం వస్తుంటుందని, ఇన్వెస్టర్లు ఈ సమయంలో సంపద సృష్టి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రముఖ అనలిస్టు డీకే అగర్వాల్‌ సూచించారు. ఈ దఫా ఎన్నికలకు ముందు ప్రభుత్వం పలు జనాకర్షక పథకాలను ప్రవేశపెట్టింది. దీంతో ఇకపై వినిమయం మరింత జోరందుకుంటుందని, ఇన్వెస్టర్‌ సెంటిమెంట్‌ పాజిటివ్‌గా మారుతుందని అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ తాజాగా తీసుకున్న రేట్‌ కట్‌ నిర్ణయం మోదీ ప్రభుత్వానికి అందించిన

Most from this category