STOCKS

News


దిగ్గజం అనుకుంటే.. దిగ్గున పడిపోయింది!

Tuesday 30th July 2019
news_main1564484508.png-27417

భారీగా పతనమవుతున్న వొడాఫోన్‌ఐడియా షేరు
ఇంకా రిస్కులున్నాయంటున్న నిపుణులు
రెండేళ్ల క్రితం 2017 మార్చిలో రెండు పెద్ద టెలికం కంపెనీలు వొడాఫోన్‌, ఐడియాలు విలీన ప్రకటన చేశాయి. దేశ టెలికం రంగంలో ఈ ప్రకటన సంచలనం సృష్టించింది. ఈ విలీనంతో ఐడియా స్టాకు భారీగా వాల్యూ పెరుగుతుందని అటు మార్కెట్‌ వర్గాలు, ఇటు ఇన్వెస్టర్లు భావించారు. విలీన సమయంలో ఒప్పందంలోని ఒక నిబంధన ప్రకారం ఐడియా సెల్యులార్‌ సంస్థ ప్రమోటర్లు విలీన సంస్థలో వొడాఫోన్‌ గ్రూప్‌ వాటా షేర్లను ఒక షేరు రూ. 130 చొప్పున కొనుగోలు చేసేందుకు వీలు కలిగింది. అయితే అప్పుడు ఈ లావాదేవీ జరగనప్పటికీ, అలా ఆ సమయంలో రూ. 130 ఉన్న ఉమ్మడి సంస్థ షేరు విలువ తాజాగా రూ. 7 దిగువకు వచ్చింది. దీంతో కంపెనీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కంపెనీ ఆర్థిక పరిస్థితి వేగంగా క్షీణిస్తోందని జూన్‌ త్రైమాసిక ఫలితాలు చూపుతున్నాయి. ప్రస్తుతం కంపెనీకి అవుతున్న వ్యయాల ఆధారంగా లెక్కిస్తే వద్ద ఉన్న మిగులు నిధులు కేవలం నాలుగైదు త్రైమాసికాలకే సరిపోతాయని అంచనా. కంపెనీ టారిఫ్‌లు పెంచకుండా, డెట్‌ రీఫైనాన్సింగ్‌ చేయకుండా ఉంటే నిధులు నాలుగైదు త్రైమాసికాలకు సరిపోతాయని జేఎం ఫైనాన్షియల్స్‌ తెలిపింది. ఈ పరిస్థితుల్లో కంపెనీ ఇబ్బందుల పాలయ్యే సమయం చాలా దగ్గరలో ఉందని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ హెచ్చరించింది. మరోపక్క పోటీ కంపెనీ జియో టారిఫ్‌లు పెంచినా, తన స్థానాన్ని సుస్థిరంగానే కాపాడుకుంటోంది. 

సమస్యలనేకం
వొడాఫోన్‌ ఇండియా చుట్టూ ప్రస్తుతం అనేక సమస్యలు మొహరించాయి. జూన్‌ త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ క్షీణించింది. మరో పక్క జియో తన రెవెన్యూ పెంచుకుంది. జియోకు 2.6 లక్షల 4జీ సైట్లుండగా, వొడాఫోన్‌ ఇండియాకు 1.5లక్షల 4జీ సైట్లు మాత్రమే ఉన్నాయి. ఎయిర్‌టెల్‌ సైతం తన 4జీ కవరేజ్‌ను పెంచుకుంటూ పోతోంది. కానీ వొడాఫోన్‌ ఐడియా తన నెటవర్క్‌ కవరేజ్‌ పెంచుకుందామనుకుంటే నగదు నిల్వల పరిస్థితి ఆశాజనకంగా లేదు. దీంతో నానాటికీ క్యాపెక్స్‌ తగ్గుతూ వస్తోంది. చివరకు తన గైడెన్స్‌ ప్రకారం కూడా కంపెనీ క్యాపెక్స్‌ చేయలేకపోతోంది. గతేడాది కంపెనీ షేరు విలువ దాదాపు 88 రూపాయల చొప్పున ఉన్నప్పుడు క్యుఐపీకి వెళ్లింది. మూడు నెలల క్రితం రైట్స్‌ ఇష్యూ సమయానికి షేరు విలువ రూ. 12.50కి పడిపోయింది. ప్రస్తుతం ఇందులో సగానికి వచ్చింది. ఈ ప్రకారం కంపెనీ షేరు క్షీణిస్తూ పోతుంటే కంపెనీపై పెట్టుబడిదారులకు నమ్మకం సడలుతోంది. వీరి నమ్మకం సడలడంతో కొత్తగా ఫండ్‌ రైజింగ్‌ చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది. మరోవైపు సరైన మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఉన్న కస్టమర్లలో అసంతృప్తి పెరిగిపోతోంది. ఇది సబ్‌స్కై‍్రబర్లపై ప్రభావం చూపుతుంది. తాజా త్రైమాసికంలో కంపెనీ దాదాపు 1.4 కోట్ల కస్టమర్లను పోటీ కంపెనీలకు కోల్పోయింది. ఇవన్నీ కలిసి కంపెనీ ఎబిటా మార్జిన్లను తీవ్రంగా నెగిటివ్‌ ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం కంపెనీ ఎబిటా మార్జిన్‌ విలీన సమయంలో ఉన్నంతకు పడిపోయింది. ప్రభుత్వం స్పెక్ర్టం సంబంధిత చెల్లింపులకు సంబంధించి ఏమైనా వెసులుబాటు కల్పిస్తే తప్ప ఇప్పటికిప్పుడు కంపెనీ కోలుకునే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే కంపెనీ రుణభారంలో దాదాపు 80 శాతం ప్రభుత్వానికే చెల్లించాల్సిఉంది. దీంతోపాటు టారిఫ్‌లను సైతం పెంచుకోవాల్సిఉంది. వీలయినంత తొందరలో కంపెనీ కోలుకోకపోతే కష్టమేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 
తొమ్మిది సెషన్లలో 45 శాతం పతనం

వొడాఫోన్‌ ఐడియా షేరు మంగళవారం తన పతనాన్ని కొనసాగించింది. ఆరంభంలో ఇంట్రాడే కనిష్ఠస్థాయి రూ. 6ని తాకింది. చివర్లో కాస్త కోలుకొని 6.95 రూపాయల వద్ద ముగిసింది. కేవలం తొమ్మిది సెషన్లలో ఈ షేరు దాదాపు 45 శాతం పతనమైంది. జూలై 17న షేరు రూ. 11.95 వద్ద కదలాడింది. గతవారం కంపెనీ ప్రకటించిన త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్లకు రుచించలేదు. రెవెన్యూ, ఎబిటా మార్జిన్లు, అర్పు... ఇలా అన్ని పారామీటర్లు డౌన్‌ట్రెండ్‌ చూపాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్‌ బ్రోకరేజ్‌లు షేరుపై పెదవివిరుస్తున్నాయి. ఎమ్‌కే గ్లోబల్‌ తదితర బ్రోకరేజ్‌లు షేరుపై అమ్మొచ్చు రేటింగ్‌ కొనసాగిస్తున్నాయి. బ్రోకరేజ్‌ల సరాసరి టార్గెట్‌ధర రూ. 5గా ఉంది. విక్రయాలు మెరుగుపడి, ఏఆర్‌పీయూ కోలుకుంటే తప్ప షేరులో అప్‌మూవ్‌ రాదని నిపుణుల అంచనా.You may be interested

వాణిజ్యవేత్తగా విఫలమయ్యా: కేఫ్‌ కాఫీడే అధిపతి

Tuesday 30th July 2019

గత రాత్రి నుంచి కన్పించకుండాపోయిన కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ రెండు రోజుల క్రితం రాసిన లేఖ ఒకటి బయపడింది. ఈ లేఖ సారాంశం   ‘మా డైరెక్టర్ల బోర్డుకు, కాఫీ డే కుటుంబానికి, నేను పెద్ద వాటాదారునిగా ఉన్న టెక్నాలజీ కంపెనీలో 37 ఏళ్ల బలమైన నిబద్ధతతో  30,000 ఉద్యోగాలను సృష్టించాను. ఉత్తమ ప్రయత్నాలు చేసినప్పటికి సరైన లాభదాయకమైన వ్యాపార నమూనాను రూపొందించడంలో విఫలమయ్యాను. నాపై నమ్మకం ఉంచిన ప్రజలందరినీ

5నెలల కనిష్టం వద్ద నిఫ్టీ ముగింపు

Tuesday 30th July 2019

బ్యాంకింగ్‌, ఆర్థిక, అటో షేర్ల భారీ పతనంతో స్టాక్‌ మార్కెట్‌ వరుసగా రెండో రోజూ నష్టపోయింది. సెన్సెక్స్‌ 289 పాయింట్లను కోల్పోయి 37,397 వద్దకు, నిఫ్టీ  104 పాయింట్లను నష్టపోయి 11100 దిగువున 11,085 వద్ద స్థిరపడ్డాయి. ఈ స్థాయిలు సెన్సెక్స్‌కు రెండున్నర నెలల కనిష్టస్థాయి కాగా,  నిఫ్టీ ఇండెక్స్‌కిది 5నెలల కనిష్టస్థాయి కావడం గమనార్హం. ఒక్క ఐటీ తప్ప అన్ని రంగాలకు చెందిన షేర్లలో విపరీతమైన అమ్మకాలు జరిగాయి. అత్యధికంగా

Most from this category