News


ఈ నెల 1 నుంచి ఇవి మారాయి.. తెలుసా?

Sunday 1st September 2019
news_main1567360801.png-28134

సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పులను గమనించినట్టయితే..

 

  • ఇల్లు కొనుగోలు చేసే సమయంలో టీడీఎస్‌ ఒకటి ఉంటుందని తెలుసు కదా. అయితే, ఇకపై మీరు ఎంచుకునే క్లబ్‌ మెంబర్‌షిప్‌, కారు పార్కింగ్‌ వంటి వాటికి చేసే చెల్లింపులు కూడా టీడీఎస్‌ పరిధిలోకి వస్తాయి. 
  • ప్రతీ అవసరానికి ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తున్నారా..? అయితే మరోసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఒక ఏడాదిలో నగదు ఉపసంహరణలు రూ.కోటి దాటితే 2 శాతం టీడీఎస్‌ అమలవుతుంది. అంటే బ్యాంకులే దీన్ని కోసేసి ఆదాయపన్ను శాఖకు మీ పాన్‌ నంబర్‌ పేరిట జమ చేస్తాయి. 
  • కాంట్రాక్టర్లకు ఒక ఏడాదిలో చేసే చెల్లింపులు రూ.50 లక్షలు మించితే (వివాహ పంక్షన్ల  కాంట్రాక్టులు సైతం), 5 శాతం టీడీఎస్‌ను మినహాయించుకోవాల్సి ఉంటుంది. 
  • లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కాల వ్యవధి తీరిన తర్వాత దానిపై పన్ను అమలయ్యేది ఉంటే, 5 శాతం టీడీఎస్‌ను మినహాయించుకుంటారు. 
  • ఐఆర్‌సీటీసీ టికెట్ల బుకింగ్‌ ఇక భారం కానుంది. ఎందుకంటే డీమోనిటైజేషన్‌ తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఐఆర్‌సీటీసీ టికెట్ల బుకింగ్‌పై సర్‌చార్జీని తొలగించారు. తిరిగి ఇది అమల్లోకి వచ్చింది. నాన్‌ ఏసీ టికెట్‌ బుకింగ్‌పై రూ.15, ఏసీ టికెట్‌ బుకింగ్‌పై రూ.30 చార్జీ పడుతుంది. 
  • ట్రాఫిక్‌ ఉల్లంఘనలను ఇకపై ఆషామాషీగా తీసుకోవద్దు. ఎందుకంటే భారీగా పెంచిన జరిమానాలు అమల్లోకి వచ్చేశాయి. గత జరిమానాలను పది రెట్ల వరకు పెంచేశారు. హెల్మెట్‌ లేకపోతే రూ.100 కాస్తా, ఇకపై రూ.1,000 అవుతుంది. తాగి నడిపితే రూ.10,000 వరకు ఫైన్‌ వేస్తారు. 
  • ఇప్పటి వరకు బ్యాంకులు రూ.50,000 దాటిన లావాదేవీల వివరాలను పన్ను అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. కానీ, ఇకపై చిన్న లావాదేవీలను కూడా బ్యాంకులు తెలియజేస్తాయి. ఎందుకంటే పన్ను రిటర్నులతో పోల్చుకునేందుకే. 
     You may be interested

మార్కెట్లు పడిపోతున్నాయా... వర్రీ వద్దు..!

Sunday 1st September 2019

స్టాక్‌ మార్కెట్లు పడిపోతుంటే ఎక్కువ మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు చేసే పని... దూరంగా వెళ్లిపోవడం. కానీ, ఈక్విటీ మార్కెట్లో దీర్ఘకాలం పాటు కొనసాగాలంటే ఇలా చేయడం ఎంత మాత్రం సరికాదంటున్నారు నిపుణులు. మార్కెట్లు పడిపోతుంటే... బేర్లు అమ్మకాలు చేస్తుంటే అవకాశాలను సొంతం చేసుకోవాలన్నది నిపుణుల సూచన. మార్కెట్లో సంక్షోభాన్ని ప్రతీ ఒక్క ఇన్వెస్టర్‌ ఎందుకు ఆహ్వానించాలన్నది ఎడెల్వీజ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఈవీపీ రాహుల్‌ జైన్‌ తెలియజేశారు...   రీబ్యాలన్స్‌  మీ బ్యాలన్స్‌ను పునర్నించుకునేందుకు మార్కెట్‌

ఆశించిన స్థాయిలో ఎఫ్‌ఎంసీజీ వృద్ధి ఉండకపోవచ్చు!

Saturday 31st August 2019

గౌరవ్ గార్గ్ రానున్న రోజుల్లో ఫాస్ట్ మూవింగ్ కన్జుమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) ఆశించిన స్థాయిలో వృద్ధిని సాధించకవపోవచ్చని ప్రముఖ అనలిస్టు గౌరవ్ గార్గ్ అంచనా వేస్తున్నారు. దేశీయ ఆర్థిక వ్యవస్థలో ఎఫ్‌ఎంజీసీ నాలుగో అతిపెద్ద రంగం. వచ్చే ఏడాది నాటికి ఈ రంగం 27.86 శాతం సీఏజీఆర్‌ వృద్ధి రేటుతో 103.7 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఐబీఈఎఫ్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ రంగం 2019 లో 11-12 శాతం వృద్ధి చెందుతుందని

Most from this category