News


ఈ కంపెనీల క్యూ3 ఫలితాలపై కన్నేయండి..!

Saturday 11th January 2020
news_main1578739378.png-30866

ఇన్ఫోసిస్‌ శుక్రవారం క్యూ3 ఫలితాలను ప్రకటన అనంతరం దేశీయ కార్పోరేట్‌ కంపెనీలు తమ మూడో త్రైమాసిక ఫలితాల విడుదలకు సన్నద్దమయ్యాయి. ఇప్పటికే విశ్లేషకులు వివిధ కంపెనీల మూడో కార్వర్ట్‌ పనితీరుపై తమ అంచనాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మోతీలాల్‌ ఓస్వాల్‌, కోటక్‌ ఇన్ట్సిట్యూషనల్ ఈక్విటీస్ బ్రోకరేజ్‌ సంస్థలు 10 కంపెనీల క్యూ3 పనితీరుపై తన అంచనాలను వెల్లడించింది. 

1.బ్లూస్టార్‌ కంపెనీ:- 
వార్షిక ప్రాతిపాదికన కంపెనీ నికర లాభం 600శాతం వృద్ధి సాధించి రూ.రూ.45 కోట్లను ఆర్జించవచ్చు. అమ్మకాలు సైతం 12శాతం వృద్ధి చెంది రూ. 1237 కోట్లుగా నమోదు కావచ్చని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తుంది. చైనాతో పాటు ఇతర దేశాల నుంచి కంప్రెసర్ దిగుమతులపై చేసుకుంటున్న నేపథ్యంలో గడచిన ఏడాదిలో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 1.2శాతం బలపడడం కంపెనికి కలిసొస్తుందని బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయపడుతుంది. 
2.బిర్లా కార్పోరేషన్‌:- 
వార్షిక ప్రాతిపాదికన ఈ క్యూ3లో కంపెనీ నికరలాభం 200శాతం వృద్ధిని సాధించవచ్చు. అమ్మకాలు సైతం 6శాతం పెరిగి రూ.1664 కోట్లుగా నమోదుకావచ్చు.  సిమెంట్ వాల్యూమ్‌లు వార్షిక ప్రాతిపదికన 4 శాతం పెరిగి 3.34మెగాటన్నలకి చేరుతాయి. తూర్పు మరియు బలహీనమైన ధరల ద్వారా ఉత్తర మరియు మధ్య మంచి ధరలను తగ్గించవచ్చు. ఉత్తర, మధ్య ప్రాంతాల్లో మంచి ధరలు కలిసొచ్చే విధంగా, తూర్పు ప్రాంతంలోని బలహీన ధరలు కొంత నిరుత్సాహరిచే విధంగా ఉన్నాయి. ఈబిటా మిశ్రమంగా నమోదు కావచ్చని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది.
3.లారస్‌ ల్యాబ్స్‌:- 
మూడో తైమాసికంలో వార్షిక ప్రాతిపదికన కంపెనీ నికరలాభం 157శాతం పెరిగి రూ.45 కోట్లుగా నమోదుకావచ్చు. అమ్మకాలు సైతం 29శాతం పెరిగి రూ.685 కోట్లను ఆర్జించవచ్చని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తుంది.

4.స్ట్రైడ్స్ ఫార్మా:- 
ఇయర్‌-టు-ఇయర్‌ ప్రాతిపదికన క్యూ3లో నికరలాభం 136శాతం వృద్ధి చెంది రూ.56కోట్లుగా నమోదవుతోంది. అమ్మకాలు 3శాతం పెరిగి రూ.762 కోట్లను ఆర్జించిస్తుంది. అమెరికాలో రానిటిడిన్‌ ఔషధ అమ్మకాలు ఊపందుకుంటాయి. రానున్న రోజుల్లో ఏఎన్‌డీఏ ఔషధ ఆమోదాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించాలని బ్రోకరేజ్‌ సంస్థ తన నివేదికలో పేర్కోంది. 

5.బీపీసీఎల్‌:- 
మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయం ప్రకారం, బీపీసీఎల్ యొక్క నికర లాభం వార్షిక  ప్రాతిపదికన 120 శాతానికి పైగా పెరిగి రూ.1,111కు చేరుకోంటుంది. ఆదాయం 19 శాతం కంటే ఎక్కువ పెరిగి రూ 64,030 కోట్లను ఆర్జిస్తుంది. ముంబై రిఫైనరీలో బీఎస్‌-VI అప్-గ్రేడేషన్ మూసివేత కారణంగా రిఫైనరీ అవుట్‌పుట్‌ క్వార్టర్‌-టు-క్వార్టర్‌ 7.5ఎంఎంటీ నమోదు అవుతోంది. జీఆర్‌ఎం తగ్గినప్పటికీ, నిల్వల వల్ల మార్జిన్లు మెరుగపడే అవకాశం ఉంది.
6.టిమ్కెన్ ఇండియా:- 
వార్షిక ప్రాతిపాదికన కంపెనీ నికర లాభం 180 శాతం వృద్ధి సాధిస్తుంది. అమ్మకాలు 10శాతం పెరుగుతాయని కోటక్‌ ఇన్ట్సిట్యూషనల్ బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తుంది. మార్కెటింగ్‌, దిగుమతుల విభాగంలో మెరుగైన పనితీరుతో ఆదాయం 10శాతం పెరుగుతుంది. 
7.బంధన్‌ బ్యాంక్‌:- 
వార్షిక ప్రాతిపాదికన కంపెనీ నికర లాభం 100శాతం వృద్ధి సాధిస్తుంది. అయితే నికర వడ్డీ ఆదాయం 44శాతం పెరుగుతుంది. ఇయర్‌టుఇయర్‌ రుణవృద్ధి 85శాతం పెరిగే అవకాశం ఉంది కావున ఆదాయ వృద్ధి 45శాతం పెరిగే అవకాశం ఉంది. క్వార్టర్‌ టు క్వార్టర్‌ నికర వడ్డీ మార్జిన్లు ఫ్లాట్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. తక్కువ పన్ను రేటు కారణంగా పీఏటీ వృద్ధి చెందుతుంది. ఆస్తుల నాణ్యత స్థిరంగా ఉంటుందని కోటక్‌ ఇన్ట్సిట్యూషనల్ బ్రోకరేజ్‌ అంచనా వేస్తుంది.
8.బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా:- 
ఈ క్యూ3లో వార్షిక ప్రాతిపాదికన బ్యాంకు నికరలాభం​300శాతం వృద్ధిని సాధిస్తుంది. నికర వడ్డీ ఆదాయం 50శాతం పెరుగుతుంది. మెరుగైన పనితీరు కారణంగా తక్కువ స్లిప్పేజీలు ఆశించవచ్చు. 
9.కరూర్‌ వైశ్యా బ్యాంక్‌:- 
మూడో క్వార్ట్‌రలో కంపెనీ నికరలాభం వార్షిక ప్రాతిపదికన 150శాతం పెరిగే అవకాశం ఉందని కోటక్‌ ఇన్ట్సిట్యూషనల్ బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తుంది. నికర వడ్డీ ఆదాయం 2శాతం మేర పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఆదాయాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని, అయితే రుణవృద్ధి మందిగించి 7శాతంగా నమోదవుతుందని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేసింది. 
10.పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌:- 
ఈ క్యూ3లో వార్షిక ప్రాతిపాదికన బ్యాంకు నికరలాభం​300శాతం వృద్ధిని సాధిస్తుంది. నికర వడ్డీ ఆదాయం 20శాతం పెరుగుతుంది. కొన్ని బారీ ఎన్‌పీఏ కేసులలో రికవరీ లాభాలను మెరుగుపరుస్తుంది. ఎన్‌ఐఎం మెరుగుదల, రైట్‌ ఆఫ్‌ లోన్లు  ద్వారా బలమైన ఆదాయ వృద్ధికి దారితీస్తుంది. 

 



You may be interested

యాంఫి మార్పుల ప్రభావం ఫండ్స్‌పై ఉంటుందా..?

Monday 13th January 2020

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల (అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు) అసోసియేషన్‌ ‘యాంఫి’ సెబీ నిబంధనల మేరకు స్టాక్స్‌ వర్గీకరణ జాబితాను ఇటీవలే ప్రకటించింది.  మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఆధారంగా టాప్‌100 స్టాక్స్‌ను లార్జ్‌క్యా్‌ప్‌ విభాగంలోకి, తదుపరి 150 స్టాక్స్‌ను మిడ్‌క్యాప్‌ విభాగం కింద, ఆ తర్వాత స్టాక్స్‌ను స్మాల్‌క్యాప్‌గా వర్గీకరించడం జరిగింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల పనితీరు పోల్చి చూసుకునేందుకు, సులభంగా అర్థం చేసుకునే విధంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో సెబీ 2017 అక్టోబర్‌లో

ఎర్నింగ్స్‌, బడ్జెట్‌ కీలకం!

Saturday 11th January 2020

జిమిత్‌ మోదీ ఈ వారమంతా మార్కెట్లు ఆశకు, భయానికి మధ్య తీవ్ర ఊగిసలాట చూశాయి. ఒకపక్క ఇరాన్‌ సంక్షోభంతో భయాలు, మరోపక్క ఎర్నింగ్స్‌పై అంచనాలు మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. దీంతో నిఫ్టీ 11970 స్థాయిని, 12300 పాయింట్ల స్థాయిని ఈ వారంలో చవిచూసింది. రిటైలర్లు, ఎఫ్‌పీఐలు కొనుగోళ్లు తగ్గించినా, సిప్‌ల్లోకి మాత్రం నిధుల ప్రవాహం కొనసాగింది. బడ్జెట్‌ ముందు స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌లో అధిక యాక‌్షన్‌ ఉండొచ్చని అంచనాలున్నాయి. లార్జ్‌ క్యాప్స్‌

Most from this category