News


పీఎంసీ స్కామ్‌.. 2008లోనే బీజాలు!!

Monday 30th September 2019
news_main1569912817.png-28632

పంజాబ్‌ మహరాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంక్‌(పీఎంసీ)లో తాజాగా వెలుగు చూసిన కుంభకోణం ఆర్‌బీఐ ఊహించినదానికన్నా చాలా లోతైనదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికి బీజాలు 2008లోనే పడ్డాయని చెబుతున్నారు. ఆ సమయంలో హెచ్‌డీఐఎల్‌ను ఆదుకునేందుకు బ్యాంకు అధికారులే పలు అకౌంట్లను సృష్టించారని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించినట్లు ఎకనమిక్‌ టైమ్స్‌ తెలిపింది. బ్యాంకు మొత్తం రుణాల్లో దాదాపు 73 శాతం రుణాలను కేవలం ఒక్క కంపెనీ(హెచ్‌డీఐఎల్‌)కు మంజూరు చేయడం బయటపడడంతో బ్యాంకు కార్యకలాపాలపై ఆర్‌బీఐ దృష్టిపెట్టింది. ఇప్పటికే బ్యాంకు ఎండీ జాయ్‌ థామస్‌ సస్పెండ్‌ అయ్యారు. ఇటీవలే హెచ్‌డీఐఎల్‌ దివాలా ప్రకటించింది. దీంతో బ్యాంకు ఇచ్చిన రుణాలు ప్రశ్నార్ధకంలో పడ్డాయి. హెచ్‌డీఐఎల్‌కు ఇచ్చిన రుణాలను బ్యాంకు కనీసం బహిర్గతం చేయకపోవడం బ్యాంకింగ్‌ చట్టాలను దారుణంగా ఉల్లంఘించడమేనని నిపుణులు అభిప్రాయపడ్డారు. 2008లో మొదలైన ఈ ఆట ఇంకా కొనసాగేదేనని, కానీ లావాదేవీలను డిజిటైజ్‌ చేయాలని బ్యాంకుపై ఆర్‌బీఐ ఒత్తిడి పెంచడంతో కుదరలేదని వివరించారు. ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్న ఆర్‌బీఐ ఇకపై బ్యాంకు ఎండీ, ఇతర కీలక ఉద్యోగులపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ ఆరంభించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఎకనమిక్‌ అఫెన్సిస్‌ వింగ్‌ వద్ద ఈ విషయమై ఫిర్యాదు నమోదయింది. నిజానికి హెచ్‌డీఐఎల్‌లో డైరెక్టర్‌గా ఉంటూనే బ్యాంకుకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న వర్యం సింగ్‌ను చైర్మన్‌గా తొలగించాలని గత అక్టోబర్‌లోనే సెంట్రల్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ సొసైటీస్‌ను ఆర్‌బీఐ కోరింది. కానీ సొసైటీ ఈ విషయమై నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆర్‌బీఐ బ్యాంకుపై నిబంధనలు విధించాల్సివచ్చిందని తెలిసింది. 
మా మాట వినట్లేదు...
పీఎంసీ మొత్తం ఏడు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కుంభకోణం బయటపడడంతో బ్యాంకులో విత్‌డ్రాలు, డిపాజిట్లపై ఆర్‌బీఐ పరిమితులు విధించింది. మరోవైపు తమకు లోన్‌ రికవరీకి అవకాశం ఇవ్వకుండా ఆర్‌బీఐ చాలా కర్కశంగా వ్యవహరిస్తోందని జాయ్‌థామస్‌ ఆరోపించారు. హెచ్‌డీఐఎల్‌కు ఇచ్చిన రుణాలకు సంబంధించి తమ వద్ద సరిపడ సెక్యూరిటీ గ్యారెంటీలున్నాయన్నారు. ఈ విషయమై ఆర్‌బీఐ ఈడీని కలిసి వివరించామని, కానీ ఆర్‌బీఐ తమ మాట వినకుండా ఆంక్షలు విధించిందని ఆయన విమర్శించారు. రెండు రోజుల పరిశీలనతో తాము తప్పు​ చేశామని ఎలా నిర్ధారిస్తారన్నారు. కంపెనీకి ఇచ్చిన రుణాలు ఎందుకు జమాపత్రాల్లో చూపలేదో తనకు తెలియదని, కానీ ఈ రుణాలకు రెండున్నర రెట్లు అధిక విలువైన గ్యారెంటీలు తమవద్ద ఉన్నాయన్నారు. You may be interested

అక్టోబర్‌లో 12వేలకు నిఫ్టీ?!

Monday 30th September 2019

వారం క్రితం అనూహ్య ర్యాలీ అనంతరం నిఫ్టీ కన్సాలిడేషన్‌ మూడ్‌లోకి వెళ్లింది. వీక్లీ చార్టుల్లో డోజి క్యాండిల్‌ ఏర్పడడం మార్కెట్లో అస్పష్టతకు సంకేతం. గతవారం నిఫ్టీ ముగింపు అంతకుముందు పతనానికి 61.8 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయికి పైన జరిగింది. అందువల్ల సూచీల్లో ఇకముందు కూడా బలం కనిపించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. చార్టుల్లో హయ్యర్‌టాప్‌, బాటమ్‌ ఏర్పరచడం కూడా ఇందుకు సంకేతంగా చెబుతున్నారు. ప్రస్తుత ప్యాట్రన్‌ ప్రకారం నిఫ్టీ 11620 పాయింట్ల

ఎయిర్‌టెల్‌ 7 శాతం అప్‌!

Monday 30th September 2019

రానున్న మూడు క్వార్టర్‌లలో టెలికం మార్కెట్లో తమ ఆదాయ వాటాను 35శాతానికి పెంచుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని భారతీ ఎయిర్‌టెల్‌ ఇండియా, దక్షిణాసియా సీఈఓ గోపాల్‌ విట్టాల్‌ సోమవారం అన్నారు. అంతేకాకుండా ప్రత్యర్థి కంపెనీలైన రిలయన్స్‌ జియో, వోడాఫోన్‌ ఐడియా కంపెనీ బలహీనతలను ఉపయోగించుకుంటామని ఆయన తెలిపారు. ఫలితంగా సోమవారం ట్రేడింగ్‌లో భారతీ ఎయిర్‌టెల్‌ షేరు 6.93 శాతం లాభపడి రూ. 373.30 వద్ద ముగిసింది. కాగా గత సెషన్‌లో రూ. 349.10 వద్ద

Most from this category