News


సిద్ధార్థ ఆత్మహత్యకు రెండు కారణాలు?

Wednesday 31st July 2019
Markets_main1564562707.png-27445

కాఫీ కింగ్‌ వీజీ సిద్ధార్థ ఆత్మహత్య వెనుక రెండు బలమైన కారణాలున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గత 12 నెలలుగా తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సిద్ధార్థకు, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం ఫలితంగా మార్కెట్లో లిక్విడిటీ కొరతతో అదనపు రుణాలు సమీకరించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని వారు తెలిపారు. అలాగే స్వల్పకాలిక రుణాల్ని తీర్చేందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం తన రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్ అమ్మకంలో సిద్ధార్థ విఫలమైనట్లు ఆయన సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఈ అమ్మకం జరిగివుంటే అతని లిక్విడిటీ సమస్య తీరేది. అంతేకాకుండా అతని ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు కూడా ఇది సహాయపడేదని వివరించారు. అతను అదృశ్యమయ్యే ముందు రోజున....దేశంలోని ఒక అగ్ర రుణదాత నుంచి సుమారుగా రూ. 1,600 కోట్ల రుణం పొందేందుకు ప్రయత్నాలు చేశారని సిద్ధార్థ సన్నిహితులు తెలిపారు.      
    కాఫీ డే సంస్థ మైండ్‌ట్రీలో తనకున్న 20 శాతం వాటాను ఎల్ అండ్ టికి  రూ.3,200 కోట్లకు విక్రయించింది. పన్నులు, ఖర్చులు పోగా రూ. 2,100 కోట్లు ఈ ఒప్పందం ద్వారా సిద్ధార్థ  పొందగలిగారు. కానీ ఇవి రుణ ఒత్తిళ్లను తగ్గించలేకపోయాయి. ఈ ఒప్పందం తర్వాత బెంగుళూరులో 20 ఎకరాలలో 40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రియాల్టీ వెంచర్‌ గ్లోబల్‌ టెక్‌ విలేజ్‌ను రూ. 2,800 కోట్లకు విక్రయించాలని ప్రయత్నించారు. ప్రైవేట్ ఈక్విటీ మేజర్ బ్లాక్‌స్టోన్‌తో పాటు స్థానిక డెవలపర్ సాలార్‌పురియా సత్వా దీనిని సొం‍తం చేసుకునేందుకు ప్రయత్నించాయి. ఇదే సమయంలో కాఫీ డే ఎంటర్‌ప్రైన్యూర్‌లో కొంత వాటాను యుఎస్‌ కంపెనీ కోకో-కోలాకు విక్రయించాలని ప్రయత్నించారు. ‘ ఈ రెండు సంఘటనలు సిద్ధార్థ ఎంత రుణ ఒత్తిడిలో ఉన్నాడో తెలియడానికి నిదర్శనం. ఎదో ఒక డీల్‌ పూర్తయ్యుంటే అతనిపై ఉన్న ఒత్తిడి తగ్గేది’ అని సిద్ధార్థ సన్నిహితులు తెలిపారు. కొద్ది నెలలుగా కాఫీ డే ఎంటర్ప్రైజెస్ స్వల్పకాలిక రుణాలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది కాలంలో దాదాపు ఐదు రెట్లు పెరిగి రూ. 3,890 కోట్లకు చేరుకున్నాయి. ఈ రుణాలను వచ్చే 12 నెలల్లో తిరిగి చెల్లించాల్సి రావడంతో అతను తన వివిధ రకాల ఆస్తులను విక్రయించడానికి ప్రయత్నించారు. You may be interested

స్వల్ఫ లాభాల్లో ఫార్మా షేర్లు

Wednesday 31st July 2019

మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌లో నష్టాల నుంచి కొలుకుంటున్నాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ మధ్యాహ్నాం 2.30 సమయానికి 1.08 శాతం లాభపడి 7,963.00 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో సన్‌ ఫార్మా 3.56 శాతం, అరబిందో ఫార్మా 3.38 శాతం, కాడియల్‌ హెల్త్‌ కేర్‌ 2.07 శాతం, లుపిన్‌ 2.03 శాతం, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లి. 0.79 శాతం, గ్లెన్‌మార్క్‌ 0.53 శాతం, డా. రెడ్డీస్‌ 0.40 శాతం, సిప్లా

200 డీఎంఏ కూడా కాపాడలేదు.. తర్వాతేంటి?

Wednesday 31st July 2019

నిఫ్టీ పయనం ఎటు... ఈ నెల 13న గత ఫిబ్రవరి తర్వాత తొలిసారి నిఫ్టీ తన 200 డైలీ మూవింగ్‌ యావరేజ్‌(డీఎంఏ) స్థాయి దిగువకు వచ్చింది. ఫిబ్రవరి 12న నిఫ్టీ 200 రోజుల డీఎంఏ మద్దతు కోల్పోయి 10585 పాయింట్ల కనిష్ఠాన్ని తాకి బౌన్స్‌ బ్యాక్‌ అయింది. సాధారణంగా 200 రోజుల డీఎంఏను బలమైన మద్దతు స్థాయిగా పరిగణిస్తారు. ఈ స్థాయికి పైన ఉన్నంత వరకు బలంగా ఉన్నట్లు, దిగువకు వస్తే

Most from this category