News


ఓఎంసీలను జీఆర్‌ఎం కాపాడుతుంది!

Tuesday 1st October 2019
news_main1569913127.png-28654

క్యు2లో మంచి లాభాల నమోదుకు అవకాశాలు
నిపుణుల అంచనా
అంతర్జాతీయ మందగమన సంకేతాల నేపథ్యంలో కూడా సెప్టెంబర్‌ త్రైమాసికంలో చమురు మార్కెటింగ్‌ కంపెనీలు లాభాలను నమోదు చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇన్వెంటరీ నష్టాలు, వినిమయం తగ్గడం కారణంగా పెరిగిన మార్జిన్ల నుంచి వచ్చే లాభాలు పరిమితం కావచ్చంటున్నారు. ప్రధానమైన ఓఎంసీలు నికర లాభంలో తరుగుదలకు క్రూడాయిల్‌ ధరలు దిగిరావడం కారణం అవుతుంటాయి. బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర తొలి త్రైమాసికం చివర్లో, రెండో త్రైమాసికంలో పేలవంగానే కదలాడింది. క్రూడాయిల్‌ ధరలు పతనం కావడం ఓఎంసీలకు ఇన్వెంటరీ నష్టాలు కలిగిస్తుంటుంది. గతనెల సౌదీపై డ్రోన్‌ దాడుల అనంతరం క్రూడ్‌ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కానీ ఆ పెరుగుదల కొనసాగలేదు. మరోవైపు దేశీయంగా వినిమయం పెరగకపోవడం కూడా చమురు డిమాండ్‌పై ప్రభావం చూపింది. ఈ కారణాల వల్ల ఓఎంసీల లాభాలు గణనీయంగా తగ్గాల్సిఉంటుంది.

కానీ ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా స్థూల రిఫైనింగ్‌ మార్జిన్లు పెరగడం ఓఎంసీలకు కలసివస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రెండోత్రైమాసిక కాలంలో సింగపూర్‌ జీఆర్‌ఎం(ఆసియా ప్రాంతంలో గ్రాస్‌ రిఫైనింగ్‌ మార్జిన్లకు నమూనాగా తీసుకుంటారు) 86 శాతం మేర పెరుగుదల చూపి బ్యారెల్‌కు 6.5 డాలర్లకు చేరింది. చమరు షిప్పింగ్‌ నిబంధనలు మారడం, రిఫైనరీల షట్‌డౌన్స్‌ కారణంగా సింగపూర్‌ జీఆర్‌ఎం ఎనిమిదేళ్లలో లేనంత మెరుగుదల చూపింది. ఈ కారణంగా ఓఎంసీలకు మేలు జరగనుంది.

జీఆర్‌ఎం పెరుగుదల స్థూల మార్కెటింగ్‌ మార్జిన్లు(జీఎంఎం) పెరిగేందుకు కారణం కానుంది. రెండోత్రైమాసికంలో సరాసరిన లీటర్‌కు పెట్రోల్‌ జీఎంఎం రూ.3.4, డీజిల్‌ జీఎంఎం 3.7 రూపాయలు ఉండవచ్చని అంచనా. ఓఎంసీల రిటైల్‌ విక్రయాలు వాటి నిర్వాహణా లాభాల్లో సింహభాగం ఉన్నందున క్యు2లో ఈ కంపెనీల లాభాలు మెరుగుదల చూపుతాయని నిపుణుల విశ్లేషణ. 

 You may be interested

నష్టాల్లో రియల్టీ రంగ షేర్లు

Tuesday 1st October 2019

మార్కెట్‌ పతనంలో భాగంగా రియల్టీ ఇండెక్స్‌ మంగళవారం 4శాతానికి పైగా నష్టపోయింది. మార్కెట్‌ సెంటిమెంట్, ఆర్ధిక మందగమనం, సబ్‌ వెన్షన్‌ స్కీమ్‌ రద్దుతో పాటు ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఆల్టికో క్యాపిటల్ ఇండియా లిమిటెడ్‌ కుంభకోణాలతో రియల్టీ రంగ తీవ్ర ఒడిదుడులను ఎదుర్కోంటుంది. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశవ్యాప్తంగా గృహాల అమ్మకాలు 18శాతం క్షీణించడం సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. ఈ నేపథ్యంలో నేడు రియల్టీ షేర్లు తీవ్ర

ఐఆర్‌సీటీసీ ఐపీఓ: రెండో రోజే 100శాతం సబ్‌స్క్రిప్షన్‌

Tuesday 1st October 2019

రైల్వేరంగంలో సేవలందించే ఐఆర్‌సీటీసీ ఐపీఓకు రెండో రోజూ అనూహ్య స్పందన లభించింది. తొలిరోజు 81శాతం సబ్ స్క్రైబ్ కావడంతో అదే ఉత్సాహంతో మంగళవారం ఉదయం కల్లా 100శాతం సబ్‌స్క్రిప్షన్‌ సాధించింది. నేటి ఉదయం గం.10:30 కల్లా 2.18 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలైన ఎన్‌ఎస్‌ఈ గణాంకాలు చెబుతున్నాయి. అక్టోబర్‌ 03 వరకు బిడ్లను స్వీకరిస్తారు. కేంద్ర ప్రభుత్వ రైల్వేలకు చెందిన ఆన్‌లైన్‌ టికెటింగ్‌, టూరిజం, కేటరింగ్‌ సంస్థ ఐఆర్‌సీటీసీ ఐపీఓ

Most from this category