News


యాపిల్‌ ఐఫోన్‌ 11 వచ్చేసింది..

Wednesday 11th September 2019
news_main1568173423.png-28294

  • ప్రారంభ ధర 699 డాలర్లు
  • యాపిల్‌ టీవీ పేరుతో వీడియో స్ట్రీమింగ్‌ సర్వీస్‌ ప్రారంభం
  • ఆర్కేడ్‌ పేరుతో వీడియో గేమింగ్‌ సర్వీస్‌  కూడా..

కాలిఫోర్నియా: ప్రపంచమంతా ఉత్కంఠతో  ఎదురు చూస్తోన్న కొత్త ఐఫోన్‌లను యాపిల్‌ విడుదల చేసింది. ఐఫోన్‌ 11, 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్‌ అధునాతన స్మార్ట్‌ఫోన్‌లను యాపిల్‌ హెడ్‌క్వార్టర్స్‌ క్యుపర్టినోలోని స్టీవ్‌ జాబ్స్‌ ఆడిటోరియమ్‌లో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో  ఆవిష్కరించారు. ఐఫోన్‌ 11 ఆరు రంగుల్లో లభ్యం కానున్నది. కొత్తగా గ్రీన్, పర్పుల్‌ రెడ్, యెల్లో రంగుల్లో లభించనున్నది.  స్పెషల్‌ ఆడియో, డాల్బీ అట్మోస్‌ ఫీచర్, ఇరువైపులా 12 మెగాపిక్సెల్‌ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 6.1 లిక్విడ్‌ రెటినా డిస్‌ప్లే, స్లో మోషన్‌ సెల్ఫీలు, ఏ13 బయోనిక్‌ చిప్‌ వంటి ప్రత్యేకతలున్నాయి. ఐఫోన్‌ 11 ధర 699 డాలర్ల నుంచి మొదలవుతుంది.

యాపిల్‌ ఐ వాచ్‌ 5..
మరోపక్క,  ఐవాచ్‌ సిరీస్‌ 5ను తీసుకొచ్చింది. మామూలు వాచ్‌లాగానే ఎప్పుడు డిస్‌ప్లే కంటికి కనిపించేలా ఐ వాచ్‌ సిరీస్‌ 5ను ఆవిష్కరించింది. ఈ వాచ్‌ల్లో కంపాస్‌ను కూడా అమర్చింది. ధర 399 నుంచి  499 డాలర్లు. ఏడో జనరేషన్‌ ఐప్యాడ్‌లను కూడా యాపిల్‌ ప్రవేశపెట్టింది.  ధరలు 329 డాలర్ల నుంచి ప్రారంభమవుతాయి. వీటి అమ్మకాలు ఈ నెల 30 నుంచి మొదలవుతాయి. కొత్తగా వీడియో స్ట్రీమింగ్‌ సర్వీస్‌–యాపిల్‌ టీవీ, వీడియో గేమింగ్‌ సర్వీస్‌–ఆర్కేడ్‌లను అందుబాటులోకి తెచ్చింది.

 

సర్వీసులపై దృష్టి...
ఐఫోన్‌ల అమ్మకాలు పడిపోవడంతో ఇప్పుడు యాపిల్‌ కంపెనీ సర్వీసులపై దృష్టి పెట్టిందని నిపుణులంటున్నారు. గత ఏడాది వరుసగా మూడు క్వార్టర్ల పాటు ఐఫోన్‌ల అమ్మకాలు పడిపోయాయి. గతంలో కొత్తది రాగానే పాత ఫోన్‌ను పక్కనపెట్టి, కొత్త ఫోన్‌ కోసం పరుగులు పెట్టేవాళ్లు. ఇప్పుడు సీన్‌ మారింది. కనీసం ఐఫోన్‌ యూజర్లలో చాలా మంది మూడేళ్లు దాటిన తర్వాతనే కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేస్తున్నారని నిపుణులంటున్నారు. డివైస్‌ల అమ్మకాలు పడిపోతుండటంతో ఆపిల్‌ మ్యూజిక్, ఐక్లౌడ్, యాపిల్‌ టీవీ వంటి సర్వీసులపై యాపిల్‌ కంపెనీ దృష్టిని ఎక్కువగా పెడుతోంది. 



You may be interested

పేటీఎమ్‌ ‘యస్‌’ డీల్‌!

Wednesday 11th September 2019

చర్చలు జరుపుతున్న ఇరు సంస్థలు రాణా కపూర్‌ వాటాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు...  యస్‌ బ్యాంక్‌లో టెక్నాలజీ కంపెనీకి మైనారిటీ వాటా అమ్మకం! తుది దశలో ఒప్పందం న్యూఢిల్లీ/ముంబై: యస్‌ బ్యాంక్‌లో కొంత వాటాను డిజిటల్‌ చెల్లింపుల దిగ్గజ సంస్థ, పేటీఎమ్‌ కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తోంది. యస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాణా కపూర్, ఆయనకు సంబంధించిన సంస్థలకు యస్‌బ్యాంక్‌లో 9.6 శాతం మేర వాటా ఉంది. ఈ వాటాలో కొంత భాగాన్ని కొనుగోలు చేయడానికి

పెట్టుబడులపై టాస్క్‌ఫోర్స్‌ దృష్టి

Wednesday 11th September 2019

అనంతరం కేంద్రం నుంచి నిధులు మరో ఒకటి రెండు ఉద్దీపన ప్రకటనలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెన్నై: మౌలికరంగ ప్రాజెక్టుల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌.. కేంద్రం నుంచి నిధుల సహకారం అవసరమైన రంగాలను గుర్తించే పనిలో ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వినియోగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం తన వ్యయాలను వేగవంతం చేయాల్సి ఉందన్నారు. ఇందులో మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయడమే ఉత్తమమని

Most from this category